దిశా పటానీ స్టన్నింగ్ మిర్రర్ సెల్ఫీ
`కల్కి 2989ఏడి`లో పెప్పీ లుక్ తో కనిపించింది దిశా పటానీ. నాగి కొత్త లోకంలో కొత్తగా కనిపించింది.
By: Tupaki Desk | 3 Sep 2024 1:30 PM GMT`కల్కి 2989ఏడి`లో పెప్పీ లుక్ తో కనిపించింది దిశా పటానీ. నాగి కొత్త లోకంలో కొత్తగా కనిపించింది. ప్రభాస్ తో ఈ బాలీవుడ్ బ్యూటీ ఫన్, రొమాన్స్ ప్యాన్స్ కి పిచ్చిగా నచ్చేశాయి. ఇక ఆఫ్ ద స్క్రీన్ కూడా ప్రభాస్ తో దిశా ఎంతగా మింగిల్ అయిపోయిందో కొన్ని సెల్ఫీలు, ఫోటోల్లో చూసిన అభిమానులు వెర్రెత్తిపోయారు. దిశాకు ఇలా టీజ్ చేయడం కొత్త కాదు. ఇప్పుడు మరోసారి అదే విధంగా టీజ్ చేసింది. ఈసారి తన మిర్రర్ సెల్ఫీతో ఇంటర్నెట్‌ను మరిగించింది.
దివా అద్దం ముందు బ్రాలెట్ లో అందాలను తెరపరిచింది. స్లీవ్‌లెస్ టాప్.. మ్యాచింగ్ షార్ట్‌లో తన టోన్డ్ ఫిజిక్‌ను ప్రదర్శించింది. దిశా ఒంపుసొంపులు యువతరాన్ని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. దిశా పటానీ నేచురల్ బ్యూటీ. పైగా టోన్డ్ లుక్ తో ఎంతో ఒద్దికగా కనిపిస్తుంది. తాజాగా షేర్ చేసిన సెల్ఫీ ఫోటోషూట్ కి అభిమానుల నుంచి స్పందన అద్భుతంగా ఉంది. దిశా అందాన్ని ప్రశంసిస్తూ తదుపరి తాను నటించే ప్రాజెక్ట్‌ల గురించి తెలుసుకునేందుకు ఫ్యాన్స్ ఉత్సాహం చూపించారు. దిశా పరిశ్రమలో నిజమైన ఫ్యాషన్ ఐకాన్. ఫిట్‌నెస్ విషయంలో దిశా అంకితభావం కూడా తాజాగా షేర్ చేసిన ఫోటోల్లో స్పష్టంగా కనిపించింది.
ఈ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ సౌత్ సినిమాల్లో నటిస్తోంది. కల్కి 2989 ఏడితో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తన ఖాతాలో చేరింది. తదుపరి మరో భారీ పాన్ ఇండియన్ సినిమా కంగువపైనా చాలా హోప్స్ ఉన్నాయి. కంగువ విడుదలకు సిద్ధమవుతుండగా ప్రచారంలో దిశా హంగామా కోసం అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. దిశా ప్రతిభ, అందం, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రతిదీ అభిమానులకు ఇష్టం. ప్రేక్షకులను ఆకర్షించడంలో దిశా ఎత్తుగడలు నచ్చుతాయి. ఈ బ్యూటీ నటిస్తున్న ప్రతి కొత్త ప్రాజెక్ట్‌తో తన ఫ్యాషన్ సెన్స్ తో హెడ్ లైన్స్ లోకొస్తోంది. ఇప్పుడు మిర్రర్ సెల్ఫీతో మరిగించింది. తదుపరి కంగువ ప్రమోషన్స్ లో ఇంకా ఎలాంటి కొత్తదనాన్ని పరిచయం చేస్తుందో వేచి చూడాలి.