Begin typing your search above and press return to search.

బాయ్ ఫ్రెండ్ చేతిలో మోస‌పోయిన దిశా ప‌టానీ?

అయితే టైగ‌ర్ ష్రాఫ్ కంటే ముందే దిశా వేరొక‌రి చేతిలో మోస‌పోయింద‌ని తాజాగా లీకైంది.

By:  Tupaki Desk   |   21 Nov 2024 7:05 AM GMT
బాయ్ ఫ్రెండ్ చేతిలో మోస‌పోయిన దిశా ప‌టానీ?
X

త‌న‌దైన అందం, గ్లామ‌ర్‌తో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న దిశా ప‌టానీ ప్ర‌స్తుతం భార‌త‌దేశంలో భారీ పాన్ ఇండియా చిత్రాలలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. `క‌ల్కి 2898 ఏడి` లాంటి పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ లో న‌టించిన దిశా ఇటీవ‌లే విడుద‌లైన మ‌రో పాన్ ఇండియ‌న్ మూవీ `కంగువ`లోను కీల‌క పాత్ర‌ను పోషించింది. మునుముందు సౌత్ లో ప‌లు భారీ పాన్ ఇండియా చిత్రాలతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

అలాగే దిశా ప‌టానీ వ్య‌క్తిగ‌త జీవితం, డేటింగ్ లైఫ్ గురించి తెలిసిందే. దిశా గ‌తంలో ట్యాలెంటెడ్ హీరో టైగ‌ర్ ష్రాఫ్ తో డేటింగ్ చేసింది. అత‌డితో కొన్నేళ్ల పాటు డేటింగ్ చేశాక‌, బ్రేక‌ప్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆ ఇద్ద‌రూ ఇప్పుడు మంచి స్నేహితులుగా ఉన్నారు. అయితే టైగ‌ర్ ష్రాఫ్ కంటే ముందే దిశా వేరొక‌రి చేతిలో మోస‌పోయింద‌ని తాజాగా లీకైంది.

దిశా ప‌టానీ గ‌తంలో పార్థ్ సమ‌థాన్ అనే టీవీ న‌టుడితో డేటింగ్ చేసింది. పార్త్ మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ .. మాస్టర్ మైండ్ వికాస్ గుప్తాకు సన్నిహితుడు. వికాస్ -పార్త్ బహిరంగంగా గొప్ప స్నేహితులు అని అంద‌రికీ తెలుసు. దిశాతో పార్థ్ ఒకానొక స‌మ‌యంలో నిండా ప్రేమ‌లో మునిగాడు. దిశ గురించి పిచ్చిగా పొసెసివ్‌గా ఉండేవాడు. కానీ ఆ ఇద్ద‌రికీ ఓ ప్ర‌త్యేక కార‌ణం వ‌ల్ల బ్రేక‌ప్ అయింది. దిశా అతడిని విడిచిపెట్ట‌డానికి కార‌ణం.. తన ఫోన్‌ను దిశా నిరంతరం తనిఖీ చేయ‌డ‌మేన‌ని తెలిసింది. దిశా పొసెసివ్‌నెస్‌ని చూసి, ఆమెను విడిచిపెట్టాలని పార్థ్ నిర్ణయించుకున్నాడు.

ఏక్తా కపూర్ ప్ర‌ఖ్యాత‌ DNA తో మాట్లాడుతూ ``వికాస్ గుప్తా స్వ‌లింగ‌సంప‌ర్కుడు`` అని, అత‌డితో పార్థ్ కి సంబంధం ఉంద‌ని వ్యాఖ్యానించిన‌ట్టు `కొయిమోయ్ డాట్ కాం` పేర్కొంది. వికాస్ - పార్త్ ఒకరికొకరు సన్నిహితంగా ఉన్నారు. సంబంధం ఉంది. 7 డిసెంబర్ 2013న వికాస్ తనను అనుచితంగా తాకాడని పార్థ్ ఆరోపించాడు. 20 రోజుల తర్వాత అతడు బ్యాంకాక్‌లో విహారయాత్రలో వికాస్‌తో ఉన్నాడు! న్యూ ఇయర్ పార్టీ కోసం నేను కూడా అక్కడ ఉన్నందున ఇది నాకు తెలుసు. అతడు వికాస్‌పై తన ప్రేమను ప్రకటించే అనేక వీడియోలను నేను చూశాను. తన టీవీ షోలో బ్రేక్ ఇచ్చిన వికాస్‌పై పార్థ్‌కు కోపం రావడానికి కారణం ఆ సంబంధానికి ముగింపు పలకడమేన‌ని కూడా ఏక్తా అన్నారు. కానీ తనను తీర్చిదిద్ది, ప్రజెంట్ చేసిన వికాస్‌కి కృతజ్ఞతలు తెలుపుతూ తన కెరీర్‌ని మరచిపోయాడని విమ‌ర్శించారు.

అయితే వీరంతా ఇప్పుడు ఎవ‌రి దారిలో వారు ఉన్నారు. దిశా టైగర్ ష్రాఫ్‌తో డేటింగ్ ప్రారంభించింది, కానీ కొన్ని సంవత్సరాల క్రితం సంబంధం ముగిసింది. వికాస్ గుప్తా- పార్థ్ సమతాన్ వారి బహిరంగ వైరం తర్వాత కెరీర్ పై దృష్టి పెట్టారు.