Begin typing your search above and press return to search.

CK లోదుస్తుల్లో దిశా పటానీ దుమారం

దిశా పటానీ తన సోషల్ మీడియాలో మిర్రర్ సెల్ఫీని పోస్ట్ చేయ‌గా అది క్లిక్ లు లైక్ ల‌తో వైర‌ల్ గా దూసుకెళ్లింది.

By:  Tupaki Desk   |   10 Sep 2024 6:48 AM GMT
CK లోదుస్తుల్లో దిశా పటానీ దుమారం
X

బాలీవుడ్ అందాల క‌థానాయిక దిశా ప‌టానీ ఏం చేసినా సంథింగ్ స్పెష‌ల్ గా ఉంటుంది. ఈ భామ నిరంత‌ర ఫోటోషూట్లు అంత‌ర్జాలంలో గుబులు పుట్టిస్తున్నాయి. తనవైన‌ బోల్డ్ లుక్‌లతో అభిమానులను ఆకట్టుకోవడంలో ఈ బాలీవుడ్ భామ‌ ఎప్పుడూ విఫలం కాలేదు. ఈసారి కూడా దీనికి మినహాయింపు కాదు. బీచ్‌లో బికినీ ధరించి ఆనందిస్తున్నా లేదా స్పోర్ట్స్ బ్రా- ప్యాంటీ ధరించి పోజులిచ్చిన దిశా పటాని ఎప్పుడూ తన బోల్డ్ స్టైల్ స్టేట్‌మెంట్ ల‌తో తన అభిమానుల దృష్టిని ఆకర్షించింది.

ముఖ్యంగా ప్ర‌ఖ్యాత కెల్విన్ క్లెయిన్ లోదుస్తుల్లో గ‌డిచిన నాలుగైదేళ్లుగా దిశా దుమారం ఎలాంటిదో చూస్తున్న‌దే. ఇప్పుడు మ‌రోసారి సీకే బ్రాండ్ లోదుస్తుల్లో దుమ్ము రేపింది. కొత్త మిర్రర్ సెల్ఫీ వ్యూ పిక్‌లో దిశా అంద‌చందాలు మ‌తులు చెడ‌గొడుతున్నాయి. దిశా పటానీ తన సోషల్ మీడియాలో మిర్రర్ సెల్ఫీని పోస్ట్ చేయ‌గా అది క్లిక్ లు లైక్ ల‌తో వైర‌ల్ గా దూసుకెళ్లింది.

కాల్విన్ క్లైన్ గ్రే స్పోర్ట్స్ బ్రా - ప్యాంటీ లో తన పిక్చర్-పర్ఫెక్ట్ బాడీని దిశా అందంగా ఆవిష్క‌రించింది. ఈ బ్యూటీ వేషధారణ యువ‌త‌రంలో క్రేజీగా మారింది. అయితే ఈ ఫోటోగ్రాఫ్ లో దిశా టోన్డ్ లుక్ మాత్ర‌మే హైలైట్ కాగా, మినిమ‌ల్ మేక‌ప్ తో సింపుల్ గా క‌నిపించింది.

ఇటీవ‌లే క‌ల్కి 2989 ఏడితో పాన్ ఇండియా విజ‌యంలో భాగ‌మైంది. టాలీవుడ్ స్టార్ ప్ర‌భాస్ కెరీర్ బెస్ట్ ని అందించాడు. ఈ చిత్రంలో దీపిక ప‌దుకొనే కీల‌క పాత్ర‌ను పోషించిన సంగ‌తి తెలిసిందే. త‌దుప‌రి సూర్య కంగువ‌లోను దిశా ప‌టానీ క‌నిపించ‌నుంది. కంగువ అక్టోబ‌ర్ 10న విడుద‌ల కానుండ‌గా ప్ర‌చారంలో బిజీ అవుతోంది.