Begin typing your search above and press return to search.

ప్రియుడితో సెల్ఫీ సుంద‌రి దిశా వెకేష‌న్?

దిశా ఈ ఫోటోషూట్ లో డీప్ పర్పుల్ ఆఫ్ షోల్డర్ కోఆర్డ్ సెట్ తో పోజులిచ్చింది. మ‌రో ఫోటోలో దిశా బీచ్ దగ్గర సూర్యాస్తమయాన్ని ఆస్వాధిస్తూ క‌నిపించింది.

By:  Tupaki Desk   |   8 March 2025 9:35 AM IST
ప్రియుడితో సెల్ఫీ సుంద‌రి దిశా వెకేష‌న్?
X

బికినీ బీచ్ విహార‌యాత్ర‌ల‌తో యూత్‌ని మ‌రిగించ‌డం దిశా ప‌టానీకి కొత్తేమీ కాదు. ఈసారి కూడా స‌మ్మ‌ర్ ని మ‌రింత హీటెక్కిస్తోంది ఈ బ్యూటీ. తాజాగా దిశా షేర్ చేసిన బికినీ ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ లో అగ్గి రాజేస్తోంది. దిశా టోన్డ్ బాడీ లుక్ మ‌తులు చెడ‌గొడుతోంది. బోల్డ్ ఫ్యాషన్ సెన్స్ తో మైండ్ బ్లాక్ చేసే దిశా త‌న విదేశీ విహారయాత్ర నుండి అద్భుతమైన ఫోటో డంప్‌ను షేర్ చేసింది. ఈ ఫోటోషూట్ వీక్షించాక‌ అభిమానులు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు.


దిశా ఈ ఫోటోషూట్ లో డీప్ పర్పుల్ ఆఫ్ షోల్డర్ కోఆర్డ్ సెట్ తో పోజులిచ్చింది. మ‌రో ఫోటోలో దిశా బీచ్ దగ్గర సూర్యాస్తమయాన్ని ఆస్వాధిస్తూ క‌నిపించింది. బికినీలో స‌ముద్ర‌పు ఒడ్డున నడుస్తుంటే అలలు త‌న‌ చుట్టూ మెల్లగా ఢీకొంటున్న ఫోటోలు ఆక‌ర్షిస్తున్నాయి. నారింజ ఎరుపు రంగు ఆకాశం దిగువ‌న‌ ఎత్తైన భవనాలు...ఆకులు లేని చెట్లను ఈ ఫోటోషూట్ లో క‌వ‌ర్ చేయ‌డం ఫోటోగ్ర‌ఫీ టోన్ ని హైలైట్ చేసింది. ఇది న్యూయార్క్ లోనే అంటూ అభిమానులు గెస్ చేస్తున్నారు.


ఫోటోషూట్ అనంత‌రం హాయిగా స్పెష‌ల్ భోజన అనుభవం గురించి దిశా వెల్ల‌డించింది. ఈ ఫోటోగ్రాఫ్స్ ఆధారంగా, దిశా ప‌టానీ త‌న ప్రియుడితో రొమాంటిక్ డేట్ లో ఉందని ఫ్యాన్స్ గెస్ చేస్తున్నారు. ప్రియుడితో దిశా విదేశీ విహారయాత్రలో ఉందా? అని అభిమానులను ఆశ్చర్యపోతున్నారు. అయితే దిశా ప‌టానీ నుంచి దానికి స‌రైన స‌మాధానం ఇంకా రాలేదు. ఈ విహార‌యాత్ర‌లో ప్రియుడు ఉన్నాడా లేడా? అనేదానిపై స‌స్పెన్స్ నెల‌కొంది. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. దిశా ఇటీవల యోధ, కల్కి 2898 AD, కంగువ లాంటి భారీ పాన్ ఇండియా చిత్రాల్లో క‌నిపించింది. త‌దుప‌రి `వెల్‌కమ్ టు ది జంగిల్` లాంటి భారీ చిత్రంలోను దిశా న‌టిస్తోంది.