టోన్డ్ బాడీతో మతులు చెడగొట్టిన పటానీ
సీకే బ్యూటీ దిశా పటానీ స్టన్నింగ్ ఫ్యాషన్ సెన్స్, ఫిట్ నెస్ గురించి చెప్పాల్సిన పని లేదు.
By: Tupaki Desk | 9 Sep 2024 4:45 AM GMTసీకే బ్యూటీ దిశా పటానీ స్టన్నింగ్ ఫ్యాషన్ సెన్స్, ఫిట్ నెస్ గురించి చెప్పాల్సిన పని లేదు. ప్రతిసారీ ఏదో ఒక కొత్తదనంతో అభిమానులను స్టన్ అయ్యేలా చేస్తుంది. ఇక బికినీలు, అథ్లెటైజర్స్ తో ఫ్యాన్స్ కంటికి కునుకుపట్టనివ్వని ట్రీటివ్వడంలో దిశా తర్వాతే.
ఇప్పుడు మరోసారి దిశా పటానీ తనదైన శైలిలో చెలరేగింది. తాజా ఫోటోషూట్ లో టోన్డ్ ఫిజిక్ ని ఎలివేట్ చేస్తూ బ్లాక్ బాటమ్, రెడ్ స్పోర్ట్స్ బ్రా ధరించిన ఈ బ్యూటీ న్యూట్రిషన్ ప్రచారంలో బిజీగా కనిపించింది. ముఖ్యంగా దిశా టోన్డ్ దేహశిరులు యువతరం దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం ఈ అందమైన ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైరల్ గా దూసుకెళుతోంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే .. లోఫర్ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన దిశా చాలా గ్యాప్ తర్వాత కల్కి 2989 ఏడి అనే తెలుగు చిత్రంలో నటించింది. దిశా తన కెరీర్ లో ఉత్తమ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది. సల్మాన్ ఖాన్, టైగర్ ష్రాఫ్ లాంటి స్టార్ హీరోలు ఇవ్వలేని బంపర్ హిట్ ని ప్రభాస్ ఈ సన్నజాజి కెరీర్ కి అందించాడు. ప్రస్తుతం దిశా మరో సౌత్ సినిమాలో నటించింది. సూర్య కంగువలో కీలక పాత్రను పోషించింది. కల్కి తరహాలోనే మరో భారీ పాన్ ఇండియా హిట్ తనకు దక్కుతుందని హోప్ తో ఉంది. కంగువ అక్టోబర్ 10న విడుదల కానుండగా ప్రచారంలో బిజీ అవుతోంది.