Begin typing your search above and press return to search.

దిశా X మౌని: స్నేహితురాళ్ల అల్ల‌ర‌ల్ల‌రి

సోష‌ల్ మీడియాలో ఇటీవ‌ల ఆ ఇద్ద‌రి స్నేహం ఇటీవ‌ల‌ పెద్ద చ‌ర్చ‌గా మారుతోంది.

By:  Tupaki Desk   |   14 Feb 2024 2:32 PM GMT
దిశా X మౌని: స్నేహితురాళ్ల అల్ల‌ర‌ల్ల‌రి
X

మంచి స్నేహం చాలా రిలీఫ్‌నిస్తుంది. బిజీ లైఫ్ ఒత్తిళ్ల‌ను కూడా దూరం చేస్తుంది. ఇదిగో ఈ ఇద్ద‌రినీ చూస్తే దీనిని సులువుగా అర్థం చేసుకోచ్చు. సోష‌ల్ మీడియాలో ఇటీవ‌ల ఆ ఇద్ద‌రి స్నేహం ఇటీవ‌ల‌ పెద్ద చ‌ర్చ‌గా మారుతోంది. దిశా ప‌టానీ, మౌనీరాయ్ స్నేహానికి సంబంధించిన ఫోటోలు అభిమానుల్లో వైర‌ల్ గా మారుతున్నాయి...ఆ ఇద్ద‌రూ క‌లిస్తే చాలు అక్క‌డ బోలెడంత సంద‌డి నెల‌కొంటోంది. జాయ్ ఫుల్ లైఫ్ కి మీనింగ్ క‌నిపిస్తుంది. అందుకే స్నేహానికి మీనింగ్ ఈ అమ్మ‌ణ్ణులు అంటూ అంతా పొగిడేస్తున్నారు!


కొన్నాళ్ల క్రితం విదేశాల్లో ఓ అవార్డ్ ఫంక్ష‌న్ కి వెళ్లి అక్క‌డ ఒకే వేదిక‌పై క‌లుసుకున్న‌ప్ప‌టి నుంచి ఇద్ద‌రి మ‌ధ్యా స్నేహం మొద‌లైంది. ఆ స్నేహంలో మాధుర్యాన్ని ఈ ఇద్ద‌రూ ఆస్వాధిస్తూ ఇత‌రుల‌కు గోల్స్ ని సెట్ చేస్తున్నారు. తాజాగా మౌని రాయ్- దిశా ప‌టానీ స్నేహానుబంధానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తోంది. ఆ ఇద్ద‌రూ ముసి ముసి న‌వ్వుల‌తో ఆనందంగా క‌నిపిస్తున్నారు. ఆ ఆనందం ముఖంలో ప్ర‌స్ఫుట‌మ‌వుతోంది.


మౌని-దిశా బాలీవుడ్ లో త‌మ‌దైన ముద్ర వేసిన నటీమ‌ణులు. యువ‌త‌రం మ‌న‌సులు దోచారు. ఆ ఇద్ద‌రూ కెరీర్ ప‌రంగా బిజీ. మౌని రాయ్ చివరిసారిగా వెబ్ సిరీస్ `సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ`లో కనిపించింది. ఇటీవలి ఇంటర్వ్యూలో మౌని సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ .. బ్రహ్మాస్త్ర వంటి ప్రాజెక్టులు తనలోని న‌టి విష‌య‌మై ప్ర‌జ‌ల‌ అభిప్రాయాన్ని మార్చాయని అంది. `బ్రహ్మాస్త్ర` పూర్తిగా భిన్నమైనది. గోల్డ్, రా .. మేడ్ ఇన్ చైనా లోను విల‌క్ష‌ణ పాత్ర‌ల‌కు మంచి గుర్తింపు ద‌క్కింద‌ని మౌని తెలిపింది. మ‌రోవైపు దిశా ప‌టానీ త‌దుప‌రి ప్ర‌భాస్ న‌టిస్తున్న పాన్ ఇండియా చిత్రం క‌ల్కి లో క‌నిపించ‌నుంది. దిశా పాత్ర ఏమిట‌న్న‌ది ప్ర‌స్తుతానికి రివీల్ కాలేదు.