Begin typing your search above and press return to search.

ఆ ఇద్ద‌రి భామ‌ల సెగ‌ల‌కి ఆహుత‌వ్వాల్సిందే!

భామ‌లిద్ద‌రు అందాల దాడి చేస్తుంటూ చూసి త‌ట్టుకోవ‌డం కుర్రాళ్ల‌కి సాధ్య‌మ‌వ్వ‌డం లేదు. ఇక ఆ ఫోటోల కింద కామెంట్లు చూస్తే మ‌తి పోవాల్సిందే.

By:  Tupaki Desk   |   21 Dec 2023 6:19 AM GMT
ఆ ఇద్ద‌రి భామ‌ల సెగ‌ల‌కి ఆహుత‌వ్వాల్సిందే!
X

సాధార‌ణంగా ఒక బ్యూటీ ఎలివేష‌న్లను త‌ట్టుకోవ‌డమే సాధ్య‌మ‌వ్వ‌డం క‌ష్ట‌మైన ప‌ని. అందులోనూ ఒకేసారి ఇద్ద‌రు బ్యూటీలు పోటీ ప‌డి మ‌రీ అందాల దాడి చేస్తే ఎలా ఉంటుంది? ఆ వేడిని...ఆ సెగ‌ని త‌ట్టుకోవ‌డం అంత వీజీనా? అవును ఈ ఫోటో చూసిన త‌ర్వాత ఇది నిజ‌మే అన‌క త‌ప్ప‌దు. ఒకేసారి ఇదిగో ఇక్క‌డిలా ఇద్ద‌రు భామ‌లు టూపీస్ ట్రీట్ షురూ చేసారు. మౌనీరాయ్..దిశాప‌టానీ ప‌నిగట్టుకుని మ‌రీ స్ట్రెయికింగ్ చేసారిలా.


బీచ్ లో ఇలా భామా మ‌ణులిద్ద‌రు కెమెరాకి వివిధ భంగిమ‌ల్లో ఫోజులిచ్చారు. మౌనీరాయ్ క‌ళ్ల‌కు గ్లాసెస్ ధ‌రించి...డార్క్ బ్లూ పీస్ లో..దిశా ప‌టానీ ఎరుపు వ‌ర్ణం బ్లౌజులో సెగ‌లు పుట్టిస్తున్నారు. ఇద్ద‌రు ప‌క్క‌ప‌క్క‌నే కూర్చుని కెమెరా వైపు చూస్తూ ఇలా క‌వ్వించేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఒకేసారి రెండు అందాల్ని చూడ‌టానికి రెండు క‌ళ్లు స‌రిపోవ‌డం లేదు. కాదు వెయి క‌ళ్లు ఉన్నా! ఇలా ఒకేసారి త‌నివి తీర‌డం అన్న‌ది సాధ్యంకాని ప‌నిగానే క‌నిపిస్తుంది.


భామ‌లిద్ద‌రు అందాల దాడి చేస్తుంటూ చూసి త‌ట్టుకోవ‌డం కుర్రాళ్ల‌కి సాధ్య‌మ‌వ్వ‌డం లేదు. ఇక ఆ ఫోటోల కింద కామెంట్లు చూస్తే మ‌తి పోవాల్సిందే. ఎవ‌రి స్టైల్లో వారు భామా మ‌ణుల ఇద్ద‌రి బ్యూటీనీ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇక ఇద్ద‌రి భామ‌ల కెరీర్ గురించిచెప్పాల్సిన ప‌నిలేదు. దిశా పటానీ బాలీవుడ్ తో పాటు సౌత్ లోనూ అవ‌కాశాలు అందుకుంటోంది. సూర్య హీరోగా న‌టిస్తోన్న పాన్ ఇండియా పిరియాడిక్ చిత్రం `కంగువా`లో న‌టిస్తోంది.


ఇందులో అమ్మ‌డు సాహ‌సోపేత‌మైన పాత్ర‌లో ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌బోతుంది. అలాగే మౌనీ రాయ్ సీరియ‌ల్స్ ని వెండి తెర‌కు ప్రమోట్ బిజీ నాయిక‌గా మారిపోయింది. బాలీవుడ్ కొత్త అవ‌కాశాలు క్యూ క‌డుతున్నాయి. వీటికి తోడు ఇన్ స్టాలో హాట్ ట్రీట్ తో మ‌రింత పాపుల‌ర్ అయింది. సినిమాల్ని మించిన గొప్ప పాపులారిటీ బ్యూటీకి ఇన్ స్టా తీసుకొచ్చింది. ల‌క్ష‌ల్లో ఫాలోవ‌ర్స్ ని సంపాదించుకుంది.