Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: దిశా కాదు బార్బీ బొమ్మ‌

తాజాగా ఓ ప్ర‌యివేట్ ఈవెంట్ లో దిశా లుక్ కి 'వావ్' అంటూ స్ట‌న్ అయ్యారు ఫ్యాన్స్. ఈ వేడుక‌లో పింక్ స్ట్రెచ్-నిట్ మినీ డ్రెస్‌లో దిశా పటానీ సంథింగ్ స్పెష‌ల్ గా క‌నిపించింది.

By:  Tupaki Desk   |   8 Dec 2023 5:06 AM GMT
ఫోటో స్టోరి: దిశా కాదు బార్బీ బొమ్మ‌
X

వేదిక ఏదైనా కానీ దిశా పటానీ ఎప్పుడూ షో స్టాప‌ర్ గా నిలుస్తుంది. తాజాగా పింక్ మినీ డ్రెస్ లో దిశా ప‌టానీ హొయ‌లు అభిమానుల్లో గుబులు పుట్టించాయి. ముంబైలో ఒక ప్ర‌యివేట్ ఈవెంట్‌లో దిశా ప‌టానీ లుక్ ట్రెండ్ సెట్ట‌ర్ గా నిలిచింది. మ‌రింత డీప్ గా వివ‌రాల్లోకి వెళితే.


వినోద పరిశ్రమలో బోల్డ్ బ్యూటీగా దిశా పటానీకి గుర్తింపు ఉంది. క్యాట్ వాక్ ల‌తో నిరంత‌రం వేదిక‌ల‌పై హొయ‌లు పోయే దిశా అభిమానులను ఊపిరి పీల్చుకునే అవకాశాన్ని కూడా ఇవ్వ‌దు. చీరలో అయినా .. ఏదైనా క్యాజువల్స్ లుక్ లేదా బికినీలో స్విమ్ సూట్ లో క‌నిపించినా.. దిశా తన అందమైన వేష‌ధార‌ణ‌తో అభిమానుల హృద‌యాల్లో అగ్గి రాజేస్తుంది.

తాజాగా ఓ ప్ర‌యివేట్ ఈవెంట్ లో దిశా లుక్ కి 'వావ్' అంటూ స్ట‌న్ అయ్యారు ఫ్యాన్స్. ఈ వేడుక‌లో పింక్ స్ట్రెచ్-నిట్ మినీ డ్రెస్‌లో దిశా పటానీ సంథింగ్ స్పెష‌ల్ గా క‌నిపించింది. పాపుల‌ర్ క్రియేటివ్ ఫెస్ట్ ఈవెంట్‌లో దిషా పటానీ కెమెరా క‌ళ్ల‌కు స్టైల్‌గా పోజులిచ్చింది. దిశా అందమైన గులాబీ రంగు దుస్తులు ముందు భాగంలో రెండు ల‌వ్ ఈమోజీ అలంకారాలతో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. స్ట్రెచ్-నిట్ మినీ డ్రెస్‌లో హ్యాండ్ కవర్-అప్ డిటైలింగ్ తో ఈ డ్రెస్ ప్ర‌త్యేకంగా క‌నిపించింది.

ఈ అందమైన పింక్ మినీ డ్రెస్‌ని ధరించినప్పుడు దిశా పటానీ బార్బీలా కనిపించిందంటూ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. దిశా మినిమల్ యాక్సెసరీస్‌ని ఎంచుకున్నప్పటికీ, ఆమె క్లాస్ పెయిర్ స్టోన్-స్టడెడ్ టై-అప్ హీల్స్ ఆ రూపానికి వ‌న్నె తెచ్చాయి. దిశా పటానీ పింక్ మినీ డ్రెస్ ధర రూ. 70,000. దిశా దుస్తులు బ్రాండ్, మాక్ అండ్ మ్యాక్ నుండి ఎంపిక చేసుకున్న‌వి. ఈ డ్రెస్ 780 యూరోల ధర ట్యాగ్‌తో వస్తుంది. దేశీ క‌రెన్సీలో దీని విలువ దాదాపు రూ. 70,116.

న‌ట వృత్తి ప‌రంగా చూస్తే... దిశా మ‌రోసారి త‌న మాజీ టైగర్ ష్రాఫ్ స‌ర‌స‌న న‌టించ‌నుంది. ద‌ర్శ‌క‌నిర్మాత జగన్ శక్తి త‌దుప‌రి చిత్రం 'హీరో నంబర్ 1'లో ఒక క‌థానాయిక‌గా న‌టిస్తోంది. మొదట్లో సారా అలీ ఖాన్‌ను ఈ పాత్రకు ఎంపిక చేశారు. కానీ సారా స్థానంలో దిశా వ‌చ్చి చేరింది. హీరో నంబర్ 1లో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ కజిన్ పష్మీనా రోషన్ టైగర్ ప్రేమికురాలిగా నటించనుంది. ఈ ప్రాజెక్ట్ డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించిన హీరోనం.1 కి సీక్వెల్ కాద‌ని తెలిసింది. 1997లో గోవింద-నటించిన చిత్రానికి రీమేక్ లేదా సీక్వెల్ కాదు. ఈ చిత్రాన్ని జాకీ భగ్నాని ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తోంది. సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటించిన 'యోధా' విడుదలకు సిద్ధమవుతోంది. మ‌రోవైపు మోహిత్ సూరితో క‌లిసి భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ లో దిశా ప‌టానీ న‌టించ‌నుందని తాజాగా వార్త అందింది. ఇటు టాలీవుడ్ లో ప‌లు క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్టుల్లోను దిశా న‌టిస్తోంద‌ని క‌థ‌నాలొస్తున్న సంగ‌తి తెలిసిందే. కానీ వాటి గురించి అధికారికంగా స‌మాచారం లేదు.