పిక్ టాక్ : అందాల షో తో దిశా అదుర్స్
ఈ అమ్మడు మొదటి సినిమాతో టాలీవుడ్ లో సక్సెస్ దక్కించుకోలేక పోయింది.
By: Tupaki Desk | 15 March 2024 6:00 PM ISTలోఫర్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల పరిచయం అయిన ముద్దుగుమ్మ దిశా పటానీ. ఈ అమ్మడు మొదటి సినిమాతో టాలీవుడ్ లో సక్సెస్ దక్కించుకోలేక పోయింది. అదే సమయంలో హిందీలో ధోనీ సినిమాలో నటించే అవకాశం దక్కడం, ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో అక్కడ బిజీ అయ్యింది.
బాలీవుడ్ లో ఈ అమ్మడి జోరు కంటిన్యూ అవుతోంది. బాలీవుడ్ లో ఈ అమ్మడు వరుసగా చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సొంతం చేసుకుంటూ ఉంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలతో రెగ్యులర్ గా నెట్టింట వైరల్ అవుతూనే ఉంటుంది.
తాజాగా లైఫ్ స్టైల్ ఆసియా ఇండియా మ్యాగజైన్ కోసం దిశా పటానీ అందాల ఆరబోత ఫోటో షూట్ తో కవర్ పేజీకి ఫోజ్ ఇచ్చింది. ఆకట్టుకునే అందం తో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అంటూ ఈ ఫోటోలతో మరో సారి నిరూపితం అయ్యిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
చాలా కాలం తర్వాత టాలీవుడ్ లో ఈ అమ్మడు ప్రభాస్ కు జోడీగా కల్కి సినిమాలో నటిస్తోంది. మరో వైపు బాలీవుడ్ లో కూడా ఈ అమ్మడు రెండు మూడు సినిమాలు చేస్తోంది. మరో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. మొత్తానికి హీరోయిన్ గా బిజీగా ఉన్న ఈ అమ్మడు ఇలా కవర్ పేజీ పై అందాల ఆరబోత ఫోటోలతో నెట్టింట ప్రేక్షకులకు కన్నుల విందు చేస్తుంది.