Begin typing your search above and press return to search.

పిక్‌ టాక్ : బ్లాక్‌ డ్రెస్ లో 'కల్కి' అందాల షో

ఇటీవల విడుదల అయిన ట్రైలర్ లో దిశా పటానీకి చాలా ప్రాముఖ్యత కథలో సినిమాలో ఉండబోతుందని తేలిపోయింది

By:  Tupaki Desk   |   15 Jun 2024 10:46 AM GMT
పిక్‌ టాక్ : బ్లాక్‌ డ్రెస్ లో కల్కి అందాల షో
X

ప్రభాస్ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 ఏడీ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకునే తో పాటు బాలీవుడ్ మరో సెన్షేషనల్ ముద్దుగుమ్మ దిశా పటానీ నటించిన విషయం తెల్సిందే. మొదట దిశా పటానీ యొక్క రోల్‌ గురించి చాలా తక్కువ ప్రచారం జరిగింది.

ఇటీవల విడుదల అయిన ట్రైలర్ లో దిశా పటానీకి చాలా ప్రాముఖ్యత కథలో సినిమాలో ఉండబోతుందని తేలిపోయింది. మరో వైపు బాలీవుడ్‌ లో కూడా ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. సోషల్‌ మీడియాలో ఎప్పటిలాగే ఈ అమ్మడి అందాల ఆరబోత కంటిన్యూ అవుతుంది.

తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఈ ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బ్లాక్ డ్రెస్ లో ఉన్న దిశా పటానీ సైడ్‌ యాంగిల్‌ నుంచి తన అందాలను చూపిస్తూ అలరించింది. ఈ స్థాయి అందాల ఆరబోత కేవలం దిశా పటానీకే సాధ్యం అన్నట్లుగా ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం చేస్తున్న సినిమాల పబ్లిసిటీ లో భాగంగా కూడా తెగ అందాల ఆరబోత ఫోటో షూట్స్ షేర్‌ చేస్తుంది. ఆకట్టుకునే అందం తో పాటు అలరించే ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అవ్వడంతో నెటిజన్స్ ఈమె ఏ ఫోటోలు షేర్‌ చేసినా కూడా తెగ లైక్ చేస్తారు.

తాజా ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. బ్లాక్‌ డ్రెస్ లో కన్నుల విందు చేస్తున్న దిశా పటానీ ముందు ముందు మరిన్ని తెలుగు సినిమాలు చేయాలని ఆమె తెలుగు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చాలా కాలం తర్వాత తెలుగు లో ఈ అమ్మడు సినిమా చేసింది. కల్కి తో ఈ అమ్మడు హిట్ కొట్టేనా చూడాలి.