Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: దిశా ప‌టానీ రెడ్ హాట్ బికినీ

తరచుగా ఒకరితో ఒకరు చాటింగులు చేస్తూ లేదా ఔటింగుల‌కు వెళుతూ కనిపిస్తున్నారు.

By:  Tupaki Desk   |   21 Dec 2023 9:55 AM GMT
ఫోటో స్టోరి: దిశా ప‌టానీ రెడ్ హాట్ బికినీ
X

2023 ముగింపు వేడెక్కిపోతోంది. ఇయ‌ర్ ఎండ్ బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్స్ పీక్స్ కి చేరుకుంటున్నాయి. తాజాగా ఇండ‌స్ట్రీ బెస్ట్ ఫ్రెండ్స్ దిశా పటాని -మౌని రాయ్‌ బీచ్ వాకేలో అగ్గి రాజేసారు. బికినీ బీచ్ లో ఈ స్నేహితురాళ్ల ర‌చ్చ మ‌రిగిస్తోంది. ముఖ్యంగా ఎరుపు బికినీలో దిశా స్ట‌న్నింగ్ లుక్ ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తోంది.


ఈ సంవత్సరం ప్రారంభంలో అక్షయ్ కుమార్ 'ది ఎంటర్‌టైనర్స్ నార్త్ అమెరికా టూర్‌`లో ఘాఢమైన స్నేహాన్ని ఏర్పరచుకున్న దిశా పటానీ- మౌని రాయ్ ఆ త‌ర్వాతా ఈ స్నేహాన్ని కొన‌సాగిస్తూ నిరంతరం అభిమానుల హృదయాలను గెలుచుకుంటున్నారు. డైనమిక్ గాళ్స్ ఒక‌రిని వీడి ఒక‌రు ఉండ‌లేకున్నారు. తరచుగా ఒకరితో ఒకరు చాటింగులు చేస్తూ లేదా ఔటింగుల‌కు వెళుతూ కనిపిస్తున్నారు. ఇప్పుడు మరోసారి దిశా- మౌని ఒక అన్ నోన్ బీచ్ లో సెల‌బ్రేష‌న్ ని ఆస్వాధిస్తున్నారు. అందుకు సంబంధించిన ప్ర‌తి ఫోటో నెట్ ని షేక్ చేస్తున్నాయి.


మౌని తన స్నేహితురాలు దిశాతో కలిసి బీచ్ వెకేషన్ నుండి చాలా ఫోటోలను తన సోషల్ మీడియా ఫాలోవర్లకు అందిస్తోంది. తాజా ఫోటోషూట్ లో మౌని మెజెంటా షార్ట్ డ్రెస్‌లో అద్భుతంగా కనిపించగా, దిశా ఎరుపు రంగు బికినీలో వెడల్పాటి లెగింగ్ ని ధ‌రించి హీట్ పెంచింది. స్నేహితురాళ్లు మ్యాచింగ్ బ్రాస్‌లెట్‌లను కూడా ధరించారు. కామెంట్ సెక్షన్‌లో ఫ్యాన్స్ వీరిద్దరిని ప్రేమ, అభిమానంతో ప్ర‌శంసించ‌డం ఆప‌లేదు. ఒక నెటిజ‌న్ `స్పెక్టాక్యులర్ స్నాప్` అని రాయ‌గా `లవ్ యు సో మచ్, స్వీట్ హార్ట్ దిశా`` అని మ‌రొక‌రు వ్యాఖ్యానించారు. చాలా మంది కామెంట్ సెక్షన్‌లో హార్ట్ - ఫైర్ ఎమోజీలను షేర్ చేసారు.


కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. దిశా పటానీ యాక్షన్ డ్రామా `యోధా`లో కనిపించ‌నుంది. సిద్ధార్థ్ మల్హోత్రా, రాశి ఖన్నాతో స్క్రీన్‌ను షేర్ చేస్కుంటోంది. నాగ్ అశ్విన్ యాక్షన్ డ్రామా కల్కి 2898 ADలో ప్ర‌భాస్, దీపికా పదుకొనే, దుల్కర్ సల్మాన్, అమితాబ్ బచ్చన్‌లతో కలిసి కూడా కనిపిస్తుంది. అంతే కాకుండా ఇమ్రాన్ హష్మీ నటించిన `షోటైమ్` అనే వెబ్ సిరీస్‌లో కనిపించనుంది. మౌని రాయ్ తదుప‌రి వ‌రుస చిత్రాల్లో న‌టిస్తోంది. బాబీ డియోల్, అర్జున్ రాంపాల్‌లతో కలిసి మోస్ట్ అవైటెడ్ క్రైమ్ మిస్టరీ చిత్రం పెంట్‌హౌస్‌లో కనిపించనుంది. దేవాంగ్ భావ్‌సర్ కామెడీ థ్రిల్లర్ బ్లాక్అవుట్‌లో తన బహుముఖ ప్రజ్ఞను కూడా ప్రదర్శిస్తుంది. సునీల్ గ్రోవర్, విక్రాంత్ మాస్సేతో కలిసి దిశా న‌టించ‌నుంది. ఇటీవల జియోసినిమాలో డేటింగ్ రియాలిటీ షో `టెంప్టేషన్ ఐలాండ్ ఇండియా`ను కూడా హోస్ట్ చేస్తోంది.