ఫోటో స్టోరి: మిస మిస మెరుపుల మెహబూబా
దిశా పటానీకి ఇన్ స్టా వేదికగా లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. వీరందరికీ ఇది స్పెషల్ విజువల్ ఫెస్ట్ అని చెప్పాలి
By: Tupaki Desk | 7 Feb 2024 8:28 AM ISTమిస మిస మెరుపులతో మతులు చెడగొట్టడంలో దిశా పటానీ తర్వాతే. నిరంతరం సోషల్ మీడియాల్లో ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలు, వీడియోలకు యూత్ కి మైండ్ బ్లాక్ అయిపోతోంది. తాజాగా దిశా షేర్ చేసిన ఓ ఫోటోషూట్ ఒక్కసారిగా అగ్గి రాజేసింది. ఎరుపు రంగు మెరుపులు మిరుమిట్ల ఛమ్కీ దుస్తుల్లో దిశా స్టన్నర్ గా కనిపించింది.
దిశా ఈ అందమైన డిజైనర్ దుస్తుల్లో స్టైలిష్ గా క్యాట్ వాక్ చేస్తూ కనిపించింది. ఇక ఎంపిక చేసుకున్న ఔట్ ఫిట్ లో దిశా అందాల మిలమిలలకు మతులు చెడిపోయాయ్ అంటే నమ్మండి. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ వీడియోని సోషల్ మీడియాల్లో వైరల్ గా షేర్ చేస్తోంది యూత్. దీనికి అద్బుతమైన క్లిక్ లు వ్యూస్ దక్కుతున్నాయి.
దిశా పటానీకి ఇన్ స్టా వేదికగా లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. వీరందరికీ ఇది స్పెషల్ విజువల్ ఫెస్ట్ అని చెప్పాలి. త్వరలోనే ప్రభాస్ నటిస్తున్న కల్కి చిత్రంలో దిశా పటానీని తెలుగు ప్రేక్షకులు వీక్షించబోతున్నారు. లోఫర్ తర్వాత చాలా కాలానికి దిశా భారీ పాన్ ఇండియా సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. తనకు నిరూపించుకునేందుకు ఇది మంచి అవకాశం. ఏం చేస్తుందో వేచి చూడాలి. అటు బాలీవుడ్ లో దిశా పటానీ తదుపరి భారీ యాక్షన్ డ్రామా `యోధా`లో కనిపించనుంది. సిద్ధార్థ్ మల్హోత్రా, రాశి ఖన్నాతో కలిసి నటించింది. అంతే కాకుండా ఇమ్రాన్ హష్మీ నటించిన `షోటైమ్` అనే వెబ్ సిరీస్‌లో కనిపించనుంది.