Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : పొట్టి డ్రెస్ లో అందాల లోఫర్‌...!

నెట్టింట తాజాగా ఈమె షేర్‌ చేసిన రెడ్‌ మినీ డ్రెస్ ఫోటోలు నెటిజన్స్ నోరు వెళ్లబెట్టేంత అందంగా ఉన్నాయి.

By:  Tupaki Desk   |   6 Feb 2024 8:54 AM GMT
పిక్ టాక్‌ : పొట్టి డ్రెస్ లో అందాల లోఫర్‌...!
X

మెగా హీరో వరుణ్‌ తేజ్‌ నటించిన లోఫర్ సినిమా తో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ దిశా పటానీ. ఈ అమ్మడు మొదటి సినిమాతో టాలీవుడ్ లో విజయాన్ని సొంతం చేసుకోలేక పోయింది. దాంతో బాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేసింది. ఎంఎస్ ధోనీ సినిమాలో నటించే అవకాశం రావడంతో ఈ అమ్మడి కెరీర్ టర్న్‌ అయ్యింది.

బాలీవుడ్ లో మోస్ట్‌ బిజీ హీరోయిన్ గా ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాలు చేస్తోంది. చాలా కాలం తర్వాత మళ్లీ తెలుగు లో ప్రభాస్ మూవీ కల్కి తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదే సమయంలో మరో సౌత్ మూవీ అయిన కంగువా లో కూడా ఈ అమ్మడు నటిస్తున్న విషయం తెల్సిందే.

నార్త్‌ అండ్ సౌత్‌ లో బిజీ బిజీగా ఉన్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో అంతకు మించి అన్నట్లుగా బిజీగా ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు మరియు వీడియో లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. నెట్టింట తాజాగా ఈమె షేర్‌ చేసిన రెడ్‌ మినీ డ్రెస్ ఫోటోలు నెటిజన్స్ నోరు వెళ్లబెట్టేంత అందంగా ఉన్నాయి.

బాలీవుడ్‌ తో పాటు సౌత్ లో కూడా మంచి ఫాలోయింగ్ ను దక్కించుకున్న ఈ అమ్మడు తాజా పొట్టి డ్రెస్ ఫోటోలు మత్తెక్కిస్తున్నాయి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ రేంజ్‌ అందాల ఆరబోత వెండి తెరపై కూడా చేస్తే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద గడగడలాడించడం కన్ఫర్మ్‌ కదా అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.