Begin typing your search above and press return to search.

పాలరాతి బొమ్మే అంటే నమ్మేలా నెరజాన..!

మోడ్రెన్ లైట్ యాష్ కలర్ డ్రెస్ లో పరువాలన్నీ కనిపించేలా దిశా అందాల విందు ఫాలోవర్స్ కు కిక్ ఎక్కిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   18 July 2024 1:45 PM GMT
పాలరాతి బొమ్మే అంటే నమ్మేలా నెరజాన..!
X

సినిమాలు మాత్రమే హీరోయిన్ గా క్రేజ్ సంపాదించొచ్చు అనేది ఒకప్పటి మాట అసలు సినిమాలు ఛాన్సులు రాకపోయినా సరే సోషల్ మీడియా తో సత్తా చాటొచ్చు అని ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది. కొందరు హీరోయిన్స్ కేవలం ఈ సోషల్ మీడియా వల్లే తమ ఇమేజ్ ని డబుల్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఇన్ స్టాగ్రాం లో ఫోటో షూట్స్ తో ప్రేక్షకులకు పిచ్చెక్కిస్తూ సూపర్ పాపులర్ అవుతున్నారు. అలాంటి భామల లిస్ట్ ఒకటి తీస్తే అందులో మొదటి పేరు అందాల భామ దిశా పటాని ఉంటుంది.

కాల్విన్ క్లెయిన్ లో దుస్తులకు బ్రాండ్ అంబాసిడర్ అయిన అమ్మడు ఆ బ్రాండ్ ప్రమోషన్స్ ఏమో కానీ దిశాకు మాత్రం అదిరిపోయే రేంజ్ లో క్రేజ్ వచ్చింది. రోజుకొక ఫోటో షూట్ తో అప్పట్లో అమ్మడు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో దిశా పటాని ఫోటో కనిపిస్తే చాలు లక్షల కొద్దీ లైకులు వచ్చేస్తున్నాయి. దిశా పటాని ఏం చేసినా అదో సెన్సేషన్ అనిపించేలా ఆమె ఫోటో షూట్స్ ఉన్నాయి.

తనపై ఫాలోవర్స్ పెట్టుకున్న నమ్మకాన్ని ఏమాత్రం నిరాశపరచని ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ గా మరోసారి రెచ్చిపోయింది. మోడ్రెన్ లైట్ యాష్ కలర్ డ్రెస్ లో పరువాలన్నీ కనిపించేలా దిశా అందాల విందు ఫాలోవర్స్ కు కిక్ ఎక్కిస్తున్నాయి. ఒక్కసారి చూసి చూపు తిప్పుకోలేనంత అందం ఆమెది అందుకే దిశా ఫోటోలకు సోషల్ మీడియాలో అంత డిమాండ్ ఏర్పడుతుంది. దిశా కొత్త ఫోటోలు చూసి ఈ అమ్మడు పాలరాతి బొమ్మే అంటూ క్రేజీ కామెంట్స్ పెట్టేస్తున్నారు ఆడియన్స్.

ఇక దిశా సినిమాల విషయానికి వస్తే ఈమధ్యనే కల్కి 2898 AD సినిమాలో తళుక్కున మెరిసింది అమ్మడు. సినిమాలో ఆమె సాంగ్ కొంతమందికి అంతగా ఎక్కకపోయినా కల్కిలో అమ్మడిని చూసి దిశా ఫ్యాన్స్ మాత్రం ఖుషి అయ్యారు. లోఫర్ తో తెలుగు ఎంట్రీ ఇచ్చి ఆ సినిమా ఫ్లాప్ అవ్వగానే మళ్లీ ఇటు వైపు తొంగి చూడని దిశా పటాని మళ్లీ ఈ మెరుపులు చూసి ఎవరైనా ఛాన్స్ ఇస్తే మాత్రం ఈసారి పర్ఫెక్ట్ ప్లానింగ్ తో టాలీవుడ్లో కూడా తన ఫాం కొనసాగించేస్తుందని చెప్పొచ్చు.