ఫోటో స్టోరి: దిశా లవ్ లవ్ లబ్ డబ్
దిశా పటానీ తాజాగా ఓ అందమైన ఫోటోగ్రాఫ్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోగ్రాఫ్ లో దిశా ఎంతో బ్యూటిఫుల్ గా కనిపిస్తోంది.
By: Tupaki Desk | 10 May 2024 4:51 PM GMTదిశా పటానీ ఇటీవల మూడు కారణాలతో నిరంతరం మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. ఒకటి తన కొత్త స్నేహితుడు అలెక్స్ ఇలిక్ తో జోరుగా షికార్లు చేస్తూ దొరికిపోయినప్పుడు... రెండోది ప్రభాస్ కల్కి చిత్రంలో నటిస్తూ నెటిజనులను కవ్వించినప్పుడు.. మూడోది అగ్గి రాజేసే ఫోటోషూట్లతో మతులు చెడగొట్టినప్పుడు.
ఇప్పుడు ఈ మూడో కారణం ఇప్పుడు మళ్లీ చర్చకు వచ్చింది. దిశా పటానీ తాజాగా ఓ అందమైన ఫోటోగ్రాఫ్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోగ్రాఫ్ లో దిశా ఎంతో బ్యూటిఫుల్ గా కనిపిస్తోంది. అంతేకాదు.. దిశా ధరించిన డిజైనర్ టాప్ ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీనిని చూడగానే.. బ్లాక్ ఫ్రాక్ లో గట్సీ గా ఫోజులిచ్చింది అంటూ అభిమానులు కితాబిచ్చేస్తున్నారు. మరోవైపు లవ్ సింబల్స్ ని పెర్ల్ తో డిజైన్ చేసి తన ఫ్రాక్ కి జోడించిన తీరు డిబేటబుల్ గా మారింది. దిశా ఈ లుక్ లో ఎంతో స్పెషల్ గా కనిపిస్తోంది. మునుపటి కంటే హాట్ గా కూడా కనిపిస్తోందని ఫ్యాన్స్ కాంప్లిమెంట్లు ఇస్తున్నారు. దిశా లవ్ లవ్ లబ్ డబ్! అంటూ ఒక అభిమాని ఈ డిజైనర్ లుక్ పై స్పందించాడు.
'లోఫర్' చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైంది దిశాపటానీ. చాలా గ్యాప్ తర్వాత ప్రభాస్ 'కల్కి' చిత్రంలో నటించే అవకాశం అందుకుంది. ఆ సినిమా తనకు పాన్ ఇండియాలో గేమ్ ఛేంజర్ గా మారుతుందని దిశా భావిస్తోంది. ఇంతకుముందు ప్రభాస్ తో కలిసి దిశా విమాన ప్రయాణానికి సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆ ఇద్దరి స్నేహం ఎంతగానో ఆకర్షించింది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే... దిశా పటాని చివరిగా 'ఏక్ విలన్ రిటర్న్స్'లో అర్జున్ కపూర్, జాన్ అబ్రహం, తారా సుతారియాలతో కలిసి నటించింది. తదుపరి నాగ్ అశ్విన్ యాక్షన్ డ్రామా 'కల్కి 2898-AD'లో దీపికా పదుకొనే, దుల్కర్ సల్మాన్ - అమితాబ్ బచ్చన్లతో కలిసి కనిపిస్తుంది. దిశా పటానీ ఇటీవలే విడుదలైన సాగర్ అంబ్రే -పుష్కర్ ఓజా యాక్షన్ డ్రామా యోధాలోను కనిపించింది.