బికినీ బీచ్‌లో చెలరేగిపోయిన దిశా
ఈ బ్యూటీ నిరంతరం ఔటింగులకు వెళ్లినప్పుడు పూర్తి డిఫరెంట్ లుక్ తో మైమరిపిస్తోంది.
By: Tupaki Desk | 5 May 2024 5:51 AM GMTబాలీవుడ్ అందాల కథానాయిక దిశా పటానీ నిరంతర సోషల్ మీడియా ట్రీట్ గురించి తెలిసిందే. అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్‌తో దిశా ఆల్వేస్ హెడ్ టర్నర్ గా నిలుస్తోంది. ఈ బ్యూటీ నిరంతరం ఔటింగులకు వెళ్లినప్పుడు పూర్తి డిఫరెంట్ లుక్ తో మైమరిపిస్తోంది.
జిమ్ దుస్తులతో .. ట్యాంక్ టాప్‌లు.. బ్యాగీ ప్యాంట్‌లతో ప్రతిసారీ తన వంపు సొంపులను ప్రదర్శిస్తూ పబ్లిక్ లో హెడ్ టర్నర్ గా నిలుస్తోంది. ఇక బికినీ బీచ్ లో అయితే దిశా చెలరేగిపోతుందన్న సంగతి తెలిసిందే. బీచ్ లో ఇసుక తిన్నెలలో దిశా మతి చెడే భంగిమలకు సంబంధించిన చాలా ఫోటోషూట్లు అంతర్జాలంలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ప్రతిసారీ దిశా హెడ్ టర్నర్ గా నిలుస్తోంది. ఇంతలోనే ఇప్పుడు తాజా హాట్ వీడియోతో అభిమానులకు ఊపిరి తీసుకోనివ్వని స్పెషల్ ట్రీటిచ్చింది.
దిశా పర్పుల్ కలర్ బికినీలో ప్రత్యక్షమైంది. ఈ బికినీ సంథింగ్ హాట్ గా ఉందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. బీచ్ లో చిద్విలాసంగా దిశా నవ్వులు చిందిస్తూ కనిపించింది. మరోవైపు దిశా తన స్నేహితురాలితో కలిసి మ్యూజిక్ సెషన్స్ లో ఉన్నప్పుడు ఎరుపు రంగు బికినీలో సందడి చేసింది. ఒక కేఫ్‌లో కూర్చొని తన స్నేహితురాలు దిశా వెనుక డ్యాన్స్ చేస్తూ కనిపించింది. దిశా కెమెరాకు ముద్దు కూడా ఇచ్చింది. దిశా ఇన్ స్టాలోని వరుస ఫోటోషూట్లు ఇప్పుడు అంతర్జాలాన్ని షేక్ చేస్తున్నాయి.
కెరీర్ మ్యాటర్ కి వస్తే... దిశా పటాని చివరిగా `ఏక్ విలన్ రిటర్న్స్`లో అర్జున్ కపూర్, జాన్ అబ్రహం, తారా సుతారియాలతో కలిసి నటించింది. తదుపరి నాగ్ అశ్విన్ యాక్షన్ డ్రామా `కల్కి 2898-AD`లో దీపికా పదుకొనే, దుల్కర్ సల్మాన్ - అమితాబ్ బచ్చన్‌లతో కలిసి కనిపిస్తుంది. దిశా పటానీ ఇటీవలే విడుదలైన సాగర్ అంబ్రే -పుష్కర్ ఓజా యాక్షన్ డ్రామా యోధాలోను కనిపించింది.