Begin typing your search above and press return to search.

దిశా పటానీ.. ఆ టాటూ వెనుక రీజన్ తెలిస్తే షాకే!

బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీకి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.

By:  Tupaki Desk   |   4 July 2024 10:58 AM GMT
దిశా పటానీ.. ఆ టాటూ వెనుక రీజన్ తెలిస్తే షాకే!
X

బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీకి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లోఫర్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ.. 'MS Dhoni' మూవీతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆ సినిమా మంచి హిట్ అవ్వడంతో అక్కడ క్రేజీ ఆఫర్లు అందుకుంటూ అలరిస్తోంది. వరుస సినిమాల్లో నటిస్తూ సందడి చేస్తోంది. ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 మూవీలో నటించింది దిశా పటానీ.

నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. రూ.1000 కోట్ల దిశగా వేగంగా అడుగులు వేస్తోంది కల్కి. అయితే మూవీలో దిశా పటానీ గ్లామరస్ గా కనిపిస్తూ ఆకట్టుకుంది. సౌత్ లో మరింత ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. ప్రస్తుతం చేతినిండా ఆఫర్లతో తీరిక లేకుండా గడుపుతోంది బ్యూటీ. తరచూ బయట పార్టీలకు వెళ్తూ ఎంజాయ్ చేస్తోంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటోంది.

రీసెంట్ గా దిశా పటానీ చేతిపై కనిపించిన పీడీ (PD) టాటూ చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. దాని కోసం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పీడీ అంటే ప్రభాస్, దిశ అని కొందరు.. ప్రభాస్ డార్లింగ్ అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. కల్కి 2898 ఏడీ మూవీలో నటించడం వల్ల ఆమె ప్రభాస్ పేరును పచ్చబొట్టుగా వేసుకుందని అంటున్నారు. ఇక దిశా పటానీ కూడా తన టాటూపై ప్రజల ఆసక్తిని చూసి తాను సంతోషంగా ఉన్నానని పోస్ట్ చేసింది.

అయితే దిశా పటానీ టాటూ పర్మనెంట్ కాదు.. టెంపరరీ అని ఇప్పుడు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ బ్రాండ్ ప్రమోషన్ లో భాగంగా దిశ ఆ టాటూ వేయించుకుందని సమాచారం. PD అంటే అమెజాన్ సేల్ ఈవెంట్ పేరైన Prime Day అని చెబుతున్నారు. ప్రమోషన్స్ భాగంగా దిశ.. ఇలా చేసిందని అంటున్నారు. అందుకే దిశా పటానీ.. తన టాటూకు సంబంధించి జరుగుతున్న ప్రచారంపై అలా స్పందించిందని కూడా అభిప్రాయపడుతున్నారు.

మొత్తానికి దిశా పటానీ టాటూ వెనుక అసలు ఉద్దేశం తెలిసి అంతా షాకైపోతున్నారు. ప్రమోషన్స్ కోసం టెంపరరీ టాటూలను కూడా వేయించుకుంటారా అని అడుగుతున్నారు. ఇదే రిపీట్ అయితే ఒరిజినల్ టాటూస్ కు క్రేజ్ తగ్గిపోతుందని అంటున్నారు. అయితే బ్రాండ్ ప్రమోషన్ కోసమైనా లేక పర్సనల్ విషయం అయినా.. ఆ టాటూతో ఒక్కసారిగా దిశా పటానీ ఫుల్ ట్రెండింగ్ లో నిలిచిందనేది మాత్రం వాస్తవం.