కల్కి 2898 AD : దిశా సైడ్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
ఇక అందరి దృష్టి ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 AD పై ఉంది.
By: Tupaki Desk | 2 Jan 2024 1:20 PM ISTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం తెల్సిందే. ఇక అందరి దృష్టి ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 AD పై ఉంది.
ఈ సినిమా పాన్ ఇండియా మూవీ కాదు.. అంతకు మించి అంటూ చిత్ర యూనిట్ సభ్యులు మొదటి నుంచి చెబుతూ ఉన్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొనే నటిస్తోంది. మరో కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటాని నటిస్తున్న విషయం తెల్సిందే.
తాజాగా చిత్ర యూనిట్ సభ్యులు కల్కి 2898 AD షూటింగ్ ను దిశా పటాని ముగించింది అంటూ ప్రకటించారు. హీరోయిన్ కు సమానమైన పాత్రను దిశా పటాని పోషిస్తుంది. ఆమె పాత్ర సినిమాకు అత్యంత కీలకంగా ఉంటుంది అంటూ మేకర్స్ గతంలో ప్రకటించిన విషయం తెల్సిందే.
సాంప్రదాయబద్ధమైన తెలుగు అమ్మాయి పాత్రలో దిశా పటానీని చూడబోతున్నామని కూడా సమాచారం అందుతోంది. ప్రభాస్ మరియు దిశా పటానీ కాంబో సన్నివేశాలు ఉంటాయా లేదా అనే విషయంలో మాత్రం మేకర్స్ నుంచి స్పష్టమైన క్లారిటీ లేదు. కానీ విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం దిశా పటానీ పాత్ర కథ లో కీలకంగా ఉంటుందట.
ఈ సినిమా యూనివర్శిల్ సబ్జెట్ అయిన టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందింది. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో రూపొందిన ఈ సినిమా ను వైజయంతి మూవీస్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అమితాబచ్చన్ తో పాటు ఇంకా ఎంతో మంది స్టార్స్ ఈ సినిమాలో కనిపించబోతున్నారు.