Begin typing your search above and press return to search.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ బిగ్ బాస్ తెలుగు S8 24x7 లైవ్ అప్డేట్స్ - ఆ హింట్ ఇవ్వలేదని శేఖర్ బాషాతో చెప్పిన నబీల్..!

By:  Tupaki Desk   |   11 Sep 2024 4:30 AM GMT
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ బిగ్ బాస్ తెలుగు  S8 24x7 లైవ్ అప్డేట్స్ -   ఆ హింట్ ఇవ్వలేదని శేఖర్ బాషాతో చెప్పిన నబీల్..!
X

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 (BiggBoss Telugu Season 8) ని లైవ్ లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney Plus Hotstar) లో చూసేందుకు CLICK HERE!! మీద క్లిక్ చేయండి

10:00 PM : బెడ్ రూమ్ లో సోనియా చపాతి, అభయ్ భోజనం చేస్తున్నాడు. నెక్స్ట్ టాస్క్ ఎలా ఉంటుందో అని ప్రేరణ యష్మి, సోనియా, అభయ్, పృధ్వితో మాట్లాడుతుంది. నెక్స్ట్ 75 వేలు లేదా లక్ష రూపాయలకు ఉండొచ్చని మాట్లాడుతున్నారు. స్ట్రాటజీతో ఆడలేదని యష్మి తన టీం తో చెప్పింది. వాష్ రూం లోకి నబీల్ వెళ్లాడు అక్కడ శేఖర్ బాషాతో జరిగిన టాస్క్ గురించి మాట్లాడుతున్నాడు. రెండు చేతులతో పట్టమని ఎవరైనా చెబితే బాగుండేదని శేఖర్ బాషాతో చెబుతున్నాడు. యష్మి, పృధ్వి, ప్రేరణ సోనియా కూడా జరిగిన టాస్క్ గురించి మాట్లాడుతున్నారు.

9:45 PM : బెడ్ రూం లో సోనియాతో నిఖిల్ మాట్లాడుతున్నాడు. అభయ్ కూడా వచ్చాడు. టాస్క్ జరిగిన విధానం గురించి మాట్లాడుతున్నారు. బిగ్ బాస్ నా ఎనర్జీ డౌన్ అయ్యింది టాస్కులు ఆపేయండి అని మణికంఠ అన్నాడు. నబీల్ తాడు వదలకుండా ఉంటే పృధ్వి వదిలేవాడు. గ్లౌజ్ వాడటం వల్ల నబీల్ ఓడిపోయాడని నిఖిల్ అన్నాడు.

9:30 PM : తాడు పట్టుకుని బాల్ బుట్టలో వేసే టాస్క్ లో నిఖిల్, పృధ్వి, నబీల్ ఆడగా ముందు నబీల్ తాడు వదిలాడు. ఆ తర్వాత టఫ్ ఫైట్ లో నిఖిల్, పృధ్వి ఫైట్ పోటాపోటాగా చేయగా ఆ తర్వాత పృధ్వి తాడు వదిలాడు. ఈ టాస్క్ లో నిఖిల్ గెలిచాడు.

9:15 PM : బిగ్ బాస్ రెండో అవకాశం 50000 సంపాదించే ఛాన్స్ ఇచ్చాడు. తాడు వదలకుండా బాల్స్ ని బుట్టలో వేయాలి. ఏ సభ్యుడైతే ఎక్కువ బాల్స్ వేస్తారో వారు తమ క్లాన్ కోసం 50 వేలు సంపాదిస్తారు. ఈ టాస్క్ లో పృధ్వి, నబీల్, నిఖిల్ లకు ఈ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. అభయ్ ని సంచాలకుడిగా ఎంచుకున్నారు.

9:00 PM : టాస్క్ గురించి ఫిజికల్ అవ్వాలా వద్దా అన్న దాని మీద నిఖిల్, నైనిక, నబీల్ చర్చిస్తున్నారు. మరోపక్క సీత, విష్ణు ప్రియ ఇద్దరు నిన్న సీత ఆడిన టాస్క్ గురించి ఫీల్ అవ్వడంతో దాని గురించి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు.

8:45 PM : డైనింగ్ టేబుల్ దగ్గర విష్ణు ప్రియ, ప్రేరణ, పృధ్వి, యష్మి మాట్లాడుతున్నారు. మణికంఠ ఒక్కడే కిచెన్ లో రాగి జావ సిద్ధం చేసుకుంటున్నాడు. నిఖిల్ వచ్చి కిచెన్ లో తిన్నావా అని అడిగాడు. నేను వద్దని చెప్పా ఆటలో తెచ్చుకోవాలి కననీ అలా ఇస్తే తీసుకోనని అన్నాడు. ఆదిత్య ఓం వచ్చి మణికంఠని అర్ధం చేసుకొని హగ్ చేసుకున్నాడు. నబీల్ వచ్చి ఎవరు లేనప్పుడు దొంగిలించి తినొచ్చు అని చెప్పినా కూడా ఓకే అన్నాడు కానీ ఏమి చేయలేదు.

8:30 PM : సీత నిన్న ఆడిన ఆట నచ్చలేదని విష్ణు ప్రియ చెప్పింది. ఆ విషయంపై సీత ఏడ్చింది. ఆమెను యష్మి, అభయ్ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు. డైనింగ్ టేబుల్ దగ్గర పృధ్వి భోజనం చేస్తుంటే ప్రేరణ అతని దగ్గరకు వచ్చింది.

8:15 PM : నైనికా ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తుంది. కిచెన్ లో మణికంఠ డిష్ క్లీన్ చేస్తున్నాడు. సోఫాలో విష్ణు ప్రియ ప్రేరణ ఇంకా తమ డిస్కషన్ కొనసాగిస్తున్నారు. నిఖిల్, పృధ్విలు ప్రాంక్ గా ఏదో ట్రై చేశారు. కానీ అది కంటెస్టెంట్స్ ముందే కనిపెట్టేశారు.

8:00 PM : మణికంఠ ఒక్కడే నేల మీద పడుకుని ఏదో దీర్ఘాలోచనలో ఉన్నాడు. బయట లాన్ లో అభయ్, శేఖర్ బాషా, ఆదిత్య ఓం కూర్చుని మాట్లాడుతున్నారు. సోఫాలో ప్రేరణతో విష్ణు ప్రియ మాట్లాడుతుంది. నిన్న జరిగిన నబీల్ టాస్క్ గురించి చర్చిస్తున్నారు.

7:45 PM : టాస్క్ గురించి ప్రేరణ మణికంఠ మాట్లాడుతున్నారు. నిన్న జరిగిన టాస్క్ ల గురించి ఏం జరిగింది అన్నది మణికంఠ ప్రేరణకి చెబుతున్నాడు. యష్మి తో పృధ్వి చెప్పి ఫిజికల్ ఎవరు అవ్వొద్దని నిర్ణయించుకున్నారు.

7:30 PM : పృధ్వి, నిఖిల్ టాస్క్ ఎలా ఆడాలనే డిస్కషన్ జరిగింది. మధ్యలో నబీల్ వీళ్లకి కొట్టుకుని ఆడాలని ఉంది కావొచ్చు అంటే పృధ్వి నబీల్ మధ్య చిన్న డిస్కషన్ జరుగుతుంది.

7:15 PM : నేను ఆట ఎందుకు ఆడట్లేదని పృధ్వి ఎందుకు చెప్పాడు అంటూ నైనిక, నబీల్ లతో డిస్కస్ చేస్తుంది సీత. ఆట ఇలానే ఆడాలని ఏ బుక్ లో రాయలేదు కదా అని సీత అన్నది. ఆదిత్య ఓం తో కూడా అన్న నేను ఆట ఆడట్లేదా అని అడిగింది సీత. ఫిజికల్ కూడా ఎక్స్ ట్రీం వద్దని యష్మి తన టీం తో మాట్లాడుతుంది.

7:00 PM : టాస్క్ ఎలాంటిది ఇచ్చినా సరే అవతల వారిని హోల్డ్ చేయడానికి మిగతా తన క్లాన్ సభ్యులు హెల్ప్ చేయాలని నైనిక సీత, నబీల్ కు చెప్పింది. టాస్క్ వచ్చిన తర్వాత అందరు సిద్ధంగా ఉండటానికి రెడీ అవ్వమని నైనిక తన టీం కి చెబుతుంది. యష్మి కూడా ప్రేరణతో మాట్లాడుతున్నారు.

6:45 PM : బిగ్ బాస్ ప్లీజ్ లో మొదటి టాస్క్ పూల్ లో 15 సెకన్లలో దూకే టాస్క్ లో మణికంఠ, సోనియా, విష్ణు ప్రియ పేర్లు స్క్రీన్ మీద బిగ్ బాస్ ఇచ్చాడు. బిగ్ బాస్ ప్లీజ్ లో మొదటి టాస్క్ విష్ణు ప్రియ గెలిచింది. ఇక నెక్స్ట్ టాస్క్ కోసం పృధ్వి తన టీం అయిన యష్మి, శేఖర్, అభయ్ తో మాట్లాడాడు. అందరు షార్ప్ గా ఉండి దృష్టి మొత్తం ఆట మీద ఉండాలి. ఎక్కడ ఛాన్స్ ఇవ్వొద్దని యష్మి తన టీం తో చెప్పింది.

6:30 PM : అందరు సోఫాలో కూర్చుని ఉన్నారు. బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ కోసం రెడీ అవుతున్నారు. శేఖర్ బాషా చేసిన పసుపు మినట్ మెయిడ్ గురించి విష్ణు ప్రియ కనిపెట్టి చెప్పేసింది. బిగ్ బాస్ అందరినీ సోఫాలో కూర్చోమని చెప్పాడు. బిగ్ బాస్ ప్లీజ్ టాస్క్ లో మొదటి అవకాశం విలువ 25 వేలని చెప్పాడు. ప్లస్మా స్క్రీన్ లో పేర్లు చూపించిన సభ్యులు 15 సెకన్లలో పూల్ లోకి దూకాలి. అలా ఫస్ట్ దూకిన వారు ఆ క్లాన్ కి 25 వేలు సంపాదిస్తారని బిగ్ బాస్ చెప్పాడు.

6:15 PM : మినట్ మెయిడ్ ని పసుపుతో తయారు చేయాలని శేఖర్ బాషా ఆ బాటిల్ లో పసుపు వేసుకుని కిచెన్ లోకి వెళ్లాడు. వాటర్ ని పట్టి బాటిల్ నింపాడు. సోఫా లో కూర్చుని నిఖిల్ విష్ణు ప్రియ మాట్లాడుకుంటున్నారు.

6:00 PM : బిగ్ బాస్ ప్లీజ్ అనే టాస్క్ గురించి బిగ్ బాస్ చెప్పాడు. ప్రైజ్ మనీ కేవలం 3 లక్షలు మాత్రమే. 3 క్లాన్స్ కి డబ్బులు సంపాదించే ఛాన్స్. సమయానుసారంగా బిగ్ బాస్ ఇచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఎక్కువ మొత్తాన్ని సంపాదించిన క్లాన్ మొత్తం ప్రైజ్ మనీకి యాడ్ అవుతుంది. మిగతా రెండు క్లాన్స్ దగ్గర ఉన్న డబ్బు పరిగణలోకి తీసుకోబడదు. అది జీరో అవుతుంది. బిగ్ బాస్ ఇచ్చే మొదటి అవకాశం కోసం సిద్ధంగా ఉండండని చెప్పాడు. ఆ టాస్క్ గురించి కంటెస్టెంట్స్ అంతా ఎలా ఉంటుందో అని చర్చించుకుంటున్నారు.

5:45 PM : యష్మి ప్రేరణ ఇద్దరు విష్ణు ప్రియ దగ్గర ఉన్న మినట్ మెయిడ్ కోసం ట్రై చేశారు. విష్ణు ప్రియకు సపోర్ట్ గా నబీల్ వచ్చాడు. ఈలోగా నిఖిల్ వాళ్ల బెడ్ రూం లోకి వెళ్లి వాళ్ల వస్తువులు తీయాలని ట్రై చేసింది. చీఫ్ చాలా చీప్ అయిపోయిందని అభయ్ అన్నాడు. మీరందరు ఏం చేయట్లేదని నేనే చేస్తున్నానని యష్మి అన్నది. యష్మి నబీల్ కి పైనాపిల్ తీసుకురా కట్ చేసుకుని తిందామని అన్నది. పక్కనే ఉన్న అభయ్ హిప్నటైజ్ చేస్తుందని కామెడీగా అన్నాడు. ఇప్పుడే బిగ్ బాస్ అందరు సోఫా మీద కూర్చోమని చెప్పాడు.

5:30 PM : కాఫీ తాగుతూ తమ దగ్గర ఉన్న ఐటమ్స్ గురించి నైనిక, నబీల్ మాట్లాడుకుంటున్నారు. బిగ్ బాస్ మాకు సుగర్ కావాలి ఐడియా ఇవ్వండంటూ నైనిక కెమెరాకు చెబుతుంది. పైనాపిల్ మీద వాళ్ల కన్ను ఉంది కాబట్టి దాన్ని బ్లాంకెట్ లో దాచిపెడతా అన్నది నైనిక. ఆదిత్య ఓం వచ్చి సోఫాని డోర్స్ కి అడ్డు పెట్టి పడుకుందామని అన్నాడు. యష్మి వచ్చి పైనాపిల్ ఇవ్వమని స్వీట్ గా అడిగిందని నబీల్ నైనికాతో చెప్పాడు. ఇప్పుడు అంతా వాచ్ మెన్ డ్యూటీ చేయాలని అభయ్ అన్నాడు. పృధ్వి ని బిగ్ బాస్ మైక్ ధరించమని చెప్పాడు.

5:15 PM : ప్రేరణ విష్ణు ప్రియ ఇద్దరు కూడా నిఖిల్ గురించి మాట్లాడుతున్నారు. నామినేషన్స్ లో అతను వేసిన దాని గురించి చర్చిస్తున్నారు. సీత తనకు సపోర్ట్ చేసింది అంటున్న విష్ణు ప్రియ. వీళ్లు మాట్లాడుతుంటూనే శేఖర్ బాషా వచ్చాడు. శేఖర్ బాషాకి లైట్ ఆఫ్ చేయమని చెప్పండి నిద్రొస్తుంది పడుకుంటా అన్నది ప్రేరణ. అభయ్ సోనియా కూడా నిఖిల్ గురించి మాట్లాడుతున్నారు.

5:00 PM : బయట బ్లాక్ కాఫీ తాగుతూ అభయ్, సోనియా ప్రేరణ సాల్ట్ తీసి దాచి పెట్టిన విషయం గురించి మాట్లాడుతున్నారు. ఇంటికి వెళ్లి కూడా ఇలానే అన్ని దాచి పెట్టుకుంటే ఇంట్లో వాళ్లు ఇట్ల తయారయ్యారేంటని అంటారని అభయ్ అన్నాడు.

4:45 PM : నబీల్ ని మాయ చేసి వాళ్ల బెడ్ రూం లోకి వెళ్లాలని ట్రై చేస్తుంది యష్మి. పైనాపిల్ అంటే తనకు ఇష్టం కాబట్టి నబీల్ ని ఒకటి ఇవ్వమని అడుగుతుంది. కానీ అతను మాత్రం ఇవ్వనని చెప్పేశాడు. ఇద్దరు కలిసి మణికంఠ రూం లోకి వెళ్లి అతన్ని డిస్ట్రబ్ చేస్తున్నారు. మణికంఠ నుంచి రాగి జావ తీసుకోవాలని యష్మి ప్రయత్నిస్తుంది. నిఖిల్ ని ట్రిగర్ చేయడాఇకి యష్మి ట్రై చేస్తుంది.

4:30 PM : అభయ్ సోనియా ఒకచోట కూర్చోగా అభయ్ నిఖిల్ ని పిలిచి మాట్లాడాడు. నైనిక సోలోగా ఉన్నావా అని ఆమెతో మాట్లాడుతున్నాడు. నబీల్ తో కలిసి శేఖర్ ఆదిత్య ఓం దగ్గరకు వెళ్లాడు. యష్మి నబీల్ ని మీ రూం లోకి వెళ్దామని అడిగితే అతను ఆపేస్తున్నాడు. అద్దం లోనుంచే చూడాలని నబీల్ చెప్పడంతో డోర్ దగ్గర నుంచి చూస్తుంది యష్మి.

4:15 PM : నిఖిల్ తో యష్మి టీం మెట్స్ మాట్లాడుతున్నారు. అక్కడ పృధ్వి కూడా ఉన్నాడు. నేను కూడా నిఖిల్ క్లాన్ లోకి వస్తానని యష్మి చెప్పింది.

4:00 PM : ప్రేరణతో యష్మి నిఖిల్ గురించి మాట్లాడుతుంది. క్లీనింగ్ విషయంలో నైనిక క్లాన్ టీం డిస్కస్ చేస్తున్నారు. ఎమోషనల్ బాండ్ అనేది స్ట్రెంత్ అవ్వాలి కానీ అది వీక్ అవ్వకూడదని ప్రేరణ చెప్పింది. గిన్నెలు మేమేమి చేయమని క్లారిటీ గా ఉన్నారని ప్రేరణ అభయ్ తో చెప్పింది. అభయ్, నిఖిల్ ఆట ఎలా ఆడాలని మాట్లాడుతున్నాడు.

3:45 PM : బెడ్ రూం లో ప్రేరణకు సోనియాతో అభయ్ వేసిన ప్లాన్ గురించి చెప్పాడు. సీత డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నా సరే సోనియా చికెన్ తీసిన దాన్ని గుర్తించలేదని చెప్పాడు. డైనింగ్ టేబుల్ దగ్గర నైనిక, సీత భోజనం చేశారు. ఒకే దగ్గర నిఖిల్, యష్మి జరగబోయే టాస్క్ గురించి మాట్లాడుకున్నారు.

3:30 PM : డైనింగ్ టేబుల్ దగ్గర నైనిక క్లాన్ సభ్యులు వాళ్ల దోశ పిండి వాళ్లకు ఇచ్చేయాలని అనుకున్నారు. నాకు ఈ దొంగతనాలు లాంటివి రావు మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి అని అన్నది. నబీల్ ఫ్రిజ్ ని ఖాళీ చేసి అంతా తన ఆదీనంలోకి తీసుకెళ్తున్నాడు. తను సీక్రెట్ ప్లేస్ లో వాటిని దాచేస్తున్నాడు. నబీల్ వాళ్ల ఉప్పే కాదు కారం కూడా పోతుందని చెప్పాడు. కిరాక్ సీత వండిన వంటను కరాబు చేయొద్దని తన టీం సభ్యులతో చెప్పింది.

3:15 PM : సాల్ట్ ప్యాకెట్ ఎవరో ఖాళీ చేశారని ప్రేరణ అంతులేని వీరులు సభ్యులను అడిగింది. సాల్ట్ ఎవరు తీసుకున్నారు అన్న దాని మీద యష్మి టీం చర్చించుకుంటున్నారు. ఈలోగా నబీల్ బీన్ బ్యాగ్ కింద ఏదో దాచి పెట్టాడు.

3:00 PM : బెడ్ రూం లోకి వచ్చి కిరాక్ సీత వచ్చి చికెన్ దొంగిలించిన వారికి అరగదని అన్నది. కిచెన్ లోనే ప్రేరణ, నైనిక వారికి కావాల్సిన వంట వండుతున్నారు. విష్ణు ప్రియ డిష్ లు క్లీన్ చేస్తుంది. సీతని పిలిచే క్రమంలో నైనిక గట్టిగా అరిస్తే పిట్ట గొంతు అన్నాడు. ఈలోగా ఆదిత్య ఓం పసుపు తెచ్చి ఇచ్చాడు. సీత పృధ్విని చికెన్ తీసుకున్నారా అని అడిగింది. విష్ణు ప్రియ కూడా పృధ్వితో ప్రామిస్ వేయించుకుంది. నబీల్ తను దాచిపెట్టుకున్న ఐటెమ్స్ అన్నిటినీ సీక్రెట్ ప్లేసుల్లో దాచేస్తున్నాడు.

2:45 PM : బెడ్ రూం లో అభయ్, పృధ్వి, సోనియా భోజనం చేస్తున్నారు. నిఖిల్, మణికంఠ కూడా వాళ్లకు ఇచ్చిన వెగ్గీస్ బాయిల్ చేసుకుని తింటున్నారు. వంట పాత్రలు ఎవరు క్లీన్ చేయాలని విష్ణు ప్రియ బిగ్ బాస్ ని అడిగింది.

2:30 PM : అఖండ క్లాన్ వండుకున్న వంటల్లో సాల్ట్ కారం వేస్తే వాళ్లు తినలేరని నిఖిల్ సలహా ఇచ్చాడు. దాంతో నబీల్ తమ బెడ్ రూం లో ఉన్న సాల్ట్ ని తీసుకున్నాడు. నైనిక దగ్గరకు వచ్చి నబీల్ చికెన్ వాళ్లు తీసుకున్నారన్నది నిజమే కదా అని మరోసారి అడిగాడు. నైనిక వాళ్లు తింటారు వేస్ట్ అవుతుందని చెబుతుంది. మన ఫుడ్ ని కూడా వాళ్లు పాడు చేస్తారని నైనిక చెప్పింది. యష్మి పృధ్వి మణికంఠతో చేయాలనుకున్న పని గురించి చెప్పింది. ఇద్దరం కలిసి అంతులేని వీరులు క్లాన్ మీద ఎటాక్ చేద్దామని అనుకున్నారు. ఐతే చికెన్ తీసుకున్న విషయం వాళ్లకు తెలిసింది కాబట్టి మణికంఠ తీసుకున్నాడని చెబుదామని మాట్లాడుకున్నారు.

2:15 PM : కెరటం క్లాన్ మీకు పంపించిన ఫుడ్ ని కేవలం బాయిల్ చేసుకుని మాత్రమే తినాలని బిగ్ బాస్ ఒక బాక్స్ పంపించాడు. చికెన్ మాది తీసుకున్నారని నిఖిల్, మణికంఠలకు నబీల్ వచ్చి చెప్పాడు. ఇలా దొంగతనం చేస్తే నేను అంతా తీసుకుంటా అని అన్నాడు. కిచెన్ లో సోనియా, శేఖర్ బాషా, అభయ్, పృధ్వి మాట్లాడుతున్నారు. వాళ్లు స్టార్ట్ చేశారు కాబట్టి ఇక మనం చేద్దామని నైనిక, నబీల్ మాట్లాడుకున్నారు.

2:00 PM : విష్ణు ప్రియ నిఖిల్ ఇద్దరు వారి మధ్య జరిగిన విషయాల మీద సార్ట్ అవుట్ చేసుకుంటున్నారు. మరోపక్క కిచెన్ లో సోనియా, అభయ్ ఇద్దరు ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు. మణికంఠ కూరలో ఉప్పు ఎక్కువ వేయాలని చూస్తున్నాడు. నేను తినను మిమ్మల్ని తిననివ్వను అంటూ కిచెన్ లో మణికంఠ అభయ్, సోనియా, పృధ్వి లకు చెబుతున్నాడు.

1:45 PM : నైనికకు చెబుతూ నిఖిల్ మీద తన అసంతృప్తిని వ్యక్తం చేసిన విష్ణు ప్రియ. నవ్వించడానికి నేను చేసే ప్రయత్నాలు నన్ను చూసినా నవ్వాలని అనుకుంటా. కానీ నేను హర్ట్ చేస్తున్నా అంటే పొద్దున్నే తీసుకోలేకపోతున్నా. మణి దొంగతనం చేయడానికి వచ్చాడా అని విష్ణు ప్రియతో నైనిక చెప్పింది. యష్మి రెడీ అవుతూ ప్రేరణతో మాట్లాడుతుంది. మణికంఠ హుడీ వేసుకుంది కూడా అందుకే దొంగతనం కోసం అంటూ విష్ణు ప్రియ అన్నది. నబీల్ కూడా మణికంఠతో దాని గురించే మాట్లాడుతున్నాడు.

1:30 PM : కిచెన్ లో అభయ్ సోనియా ఇద్దరు ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఆదిత్య ఓం, మణికంఠ ఇద్దరు సోఫాలో కూర్చుని మొదటి వారం స్ట్రాంగ్ ఉన్న వారు ఇప్పుడు సైలెంట్ అయ్యారని చెప్పాడు. మణి అంటే ఎవరు.. ఆదిత్య అంటే ఎవరన్నది చూపించాలని ఇద్దరు మాట్లాడుకున్నారు. హౌస్ లో ఆట నీ క్యారెక్టర్ ని తెలియచేస్తుంది. తెగించి ఆడాలని మణికంఠ అన్నాడు. నువ్వు షాడో నుంచి బయటకు వస్తున్నావని మణికంఠను ఆదిత్య ఓం అన్నాడు. నా వల్ల ఎందుకు హర్ట్ అయ్యావో చెప్పమని సీత విష్ణు ప్రియని అడిగింది. కొద్దిగా టైం ఇస్తే చెబుతా అన్నది విష్ణు ప్రియ.

1:15 PM : నైనిక నువ్వు ప్రేమ కావాలని వెళ్లకు.. నీ దగ్గరకు వచ్చేప్పుడు వస్తుందని నిఖిల్ తో చెప్పింది. ఇదే చర్చలో బీయింగ్ ఏ బోయ్ ఎక్స్ ప్రెస్ చేస్తే ఒకలా.. చేయకపోతే ఒకలా ఉంటుందని అన్నాడు. ఎమోషన్ ఎక్స్ ప్రెస్ చేస్తే వేరేలా తీసుకుంటారంటూ నిఖిల్ మాట్లాడాడు. కిచెన్ లో సోనియా మటన్ కర్రీ చేసేందుకు సిద్ధం అయ్యింది. సీత ఓపెన్ అయ్యి చెప్పింది నేను డామినేట్ చేస్తున్నానని నిఖిల్ నైనికతో మాట్లాడాడు.

1:00 PM : క్వాంటిటీ తెలియనిది తెస్తే వాళ్లు కనిపెట్టలేరని యష్మి టీం మాట్లాకున్నారు. పసుపు, మినట్ మెయిడ్ కూడా తీసుకోవాలి. వాళ్లకు తెలిస్తే ఆట మొదలైనట్టే. చికెన్ మటన్ అయిపోయే వరకు వెయిట్ చేసి ఆ తర్వాత తీసుకుందాం. ఈలోగా మణికంఠ ట్రిగర్ అయ్యి ఏదైనా దొంగతనం చేస్తాడు. ఆ తర్వాత మనం చేద్దాం అని యష్మి చెప్పింది.

12:45 PM : టాస్క్ ని సీరియస్ గా ఆడితే మాకు కాస్త బాగుంటుందని మణికంఠ సోనియాతో అన్నాడు. సోనియా కు ఎన్నారై సంబంధం తెస్తానని చెప్పిన మణికంఠ. ఆదిత్య ఓం వాష్ రూం క్లీనింగ్ గురించి వాళ్ల చీఫ్ నైనిక తో చెప్పాడు. మీరు గట్టిగా ఉండండని నైనికని మణికంఠ అంటే దొంగతనం చేసి చూడని మణికంఠని అన్నది నైనిక. యష్మి, ప్రేరణ, అభయ్ బెడ్ రూం లో మాట్లాడుతున్నారు. ప్రేరణ నేను ఆ బోట్ మీద కూర్చుందాం అనుకున్నాం ఇప్పటివరకు కూర్చోలేదని అన్నది యష్మి.

12:30 PM : డైనింగ్ టేబుల్ దగ్గర శేఖర్ బాషా, మణికంఠ, పృధ్వి మాట్లాడుతునారు. ఆదిత్య ఓం వచ్చి ఎంతసేపు తింటారని అడిగాడు. లగ్జరీ టీం అంతే అని పృధ్వి శేఖర్ బాషా అన్నాడు. కట్టప్ప వచ్చినప్పుడు వచ్చే బ్యాగ్ గ్రౌండ్ ఏంటి అని శేఖర్ బాషా అన్నాడు. తోడు కావాలంటా వెళ్లు అంటే కొంచం పెరుగు తీసుకుని ఈరోజు తోడుకి ఇది పెట్టుకో అనాలని అన్నాడు శేఖర్ బాషా. నబీల్ తో శేఖర్ బాషా బ్లాక్ టీ తీసుకోకుండా ఉండాలంటే అంటూ ప్లాన్స్ ఇస్తున్నాడు. ఈరోజు ఓడిపోతే మీ పరిస్థితి ఏంటని పృధ్వితో ఆదిత్య అన్నాడు.

12:15 PM : నబీల్ ని డైవర్ట్ చేసి వాళ్ల దగ్గర ఉన్న పసుపుని తీసుకోవాలని సోనియా, అభయ్ ప్లాన్ చేస్తున్నారు. మెడిటేషన్ చేసుకున్నట్టుగా యాక్ట్ చెయ్ అని అన్నాడు. బెడ్ రూమ్ లో ఉన్న అభయ్ కు ప్లేట్ లో చపాతి తీఎసుకొచ్చి ఇచ్చింది ప్రేరణ. డైనింగ్ టేబుల్ మీద నబీల్, శేఖర్ బాషా, పృధ్వి, యష్మి చపాతీలు తింటున్నారు. కిచెన్ లో నిఖిల్, మణికంఠ ఉన్నారు. ఆదిత్య ఓం మణికంఠతో మాట్లాడుతున్నాడు.

12:00 PM : నిఖిల్ ఆల్ ఓకే బ్రో అని ఆదిత్య ఓం అన్నాడు. మీకు ఎక్స్ ట్రా బ్లాంకెట్ కావాలంటే తీసుకోండి అని నిఖిల్ అన్నాడు. వావ్ నిఖిల్ భలే చెప్పావ్. నిఖిల్ నీ స్కూలింగ్ ఎక్కడ జరిగిందా అని ఆదిత్య ఓం అడిగితే మైసూర్ అన్నా అని చెప్పాడు. కిచెన్ లో ప్రేరణ పని చేస్తుంది. కిచెన్ లో యష్మి సుగర్ ని తీసుకుంటుంది అందుకు ప్రేరణ హెల్ప్ చేసింది. వాళ్లు చేసుకున్న బ్రేక్ ఫాస్ట్ ఒక బౌల్ లో వేసుకుని వెళ్తా ప్రేరణ అని యష్మి ప్రేరణని అడిగింది. అలానే ఒక బౌల్ లో వేసుకుని వెళ్లింది.

11:45 AM : బెడ్ రూమ్ లో యష్మి క్లాన్ సభ్యులు మాట్లాడుకుంటున్నారు. నైనిక తన బెడ్ మీద ఏదో ఆలోచిస్తూ కూర్చున్నది. నైనిక ఏమన్నా పనుందా వన్ అవర్ డిజప్పియర్ అయిపోతా. ఆదిత్య వాళ్ల బెడ్ రూం లోనే క్లీన్ చేస్తున్నాడు. ఆదిత్య ఓం కు థాంక్యు అని విష్ణు ప్రియ చెప్పింది. ఆదిత్య ఓం ఒక్కడే వాళ్ల బెడ్ రూమ్ లో చీపురుతో క్లీన్ చేశాడు. కిచెన్ లో యష్మి నిఖిల్ తో ఎందుకు డల్ గా ఉన్నావని అడిగింది. ఎమోషనల్ అవ్వట్లేదని నిఖిల్ అన్నాడు. నువ్వు చాలా స్ట్రాంగ్ నిఖిల్ అని అన్నది యష్మి.

11:30 AM : ఇక నుంచి సీరియస్ గా గేమ్ ఆడుతా నిన్ను నామినేట్ చేయను అని ఆదిత్య ఓం శేఖర్ బాషాతో చెప్పాడు డైనింగ్ టేబుల్ దగ్గర చెప్పాడు. నైనిక కిచెన్ లో వంట సిద్ధం చేస్తుంది. నబీల్ ఆమెకు హెల్ప్ చేస్తున్నాడు. ప్రేరణకు వంట సలహా ఇస్తుంది. బెడ్ రూం లో అభయ్ సోనియా పృధ్వితో మాట్లాడుతున్నాడు. చీఫ్ ఏం చెబుతుందో అది చేద్దామని అనుకున్నారు. క్లాన్ టు క్లాన్ ఫైనల్ దాకా ఉంటే కష్టమే అని అభయ్ అన్నాడు.

11:15 AM : చాలా రోజులు అవుతున్నట్టు ఉందని సోనియా పృధ్వితో చెబుతుంది. నాకు మొబైల్ గుర్తు రావట్లేదు అది షాకింగ్ గా ఉందని పృధ్వి అన్నాడు. వాష్ రూం కి వెళ్లినా మొబైల్ తీసుకెళ్తా కానీ ఇప్పుడు అది లేకుండా ఉంటున్నా అన్నాడు. విష్ణు ప్రియ వాష్ రూం లో మణికంఠతో తన సెన్సాఫ్ హ్యూమర్ గురించి మాట్లాడుతుంది. నేను ఈ షోకి కరెక్టే కాదని విష్ణు ప్రియ అన్నది. నీకు నువ్వని అనుకోకని మణికంఠ అన్నాడు. కిచెన్ లో ననిక, నబీల్ పనిచేస్తున్నారు.

11:00 AM : పృధ్వి సోనియా ప్రైజ్ మనీ గురించి మాట్లాడుతున్నారు. డైనింగ్ టేబుల్ దగ్గర విష్ణు ప్రియ మాట్లాడుతుంది. తన జోక్స్ కు నవ్వుతున్నందుకు థాంక్స్ అని అక్కడ ఉన్న వారితో చెప్పింది. బయట లాన్ లో అభయ్ తో ప్రేరణ టాస్క్ గురించి మాట్లాడుతున్నారు. డివైడ్ అండ్ రూల్ పాలసీ కాస్త హర్టింగ్ గా ఉందని అభయ్ అన్నాడు. కొంతమంది నేను వేసే జోక్స్ హార్ట్ కి తీసుకోకూడదని నిఖిల్ కిరాక్ సీత అంటున్నారని అభయ్ తో వచ్చి చెప్పింది విష్ణు ప్రియ.

10:45 AM : నిన్న జరిగిన టాస్క్ గురించి కిచెన్ లో విష్ణు ప్రియ నైనిక ప్రేరణ మాట్లాడుతున్నారు. అక్కడే పృధ్వి శేఖర్ భాషా అభయ్ లు చర్చిస్తున్నారు. సీత ఆదిత్య ఓం వాష్ రూం లో మాట్లాడుతున్నారు. సీత వెళ్లాక కూడా ఆదిత్య ఓం తన మైక్ ని సరిచేసుకుంటున్నాడు. నిఖిల్ ఒక్కడే బయట లాన్ లో ఉన్న సోఫాలో యాపిల్ తింటూ ఆలోచిస్తున్నాడు. శేఖర్ బాషా వాళ్ల పాప ఇష్టమైన కలర్ పర్పుల్ ఎందుకు చెప్పిందో సీత వివరిస్తుంది.

10:30 AM : కిచెన్ లో అభయ్ టీ పెడుతున్నాడు. సోనియా అతనికి హెల్ప్ చేస్తుంది. ప్రేరణకు పాలు ఇచ్చేసి నాకు టీ వద్దని యష్మి చెప్పింది. లేదు సరిపోతాయి అని అభయ్ అన్నాడు. ఐతే సరిపోకపోతే నువ్వు బర్రెని కొనుక్కుని పాలు తీసుకోవాలని అన్నాడు. ప్రేరణ కూడా టీ చేసేందుకు సహాయం చేస్తుంది. నేను మంచి టీ చేస్తా అని అభయ్ కి తను ఎలా చేస్తానో చెబుతుంది.

10:15 AM: నబీల్ తో ఆదిత్య ఓం నైట్ భోజనం తిననందుకు నైట్ బాగా నిద్ర వచ్చిందని అన్నాడు. బిగ్ బాస్ అందరు బ్యాటరీస్ మార్చుకోమని అన్నాడు. శేఖర్ బాషా బాత్ రూం లో ఉన్న పృధ్వితో యమలీల లోని చిత్రగుప్తుడు తాగుబోతుతో మానవ అన్న డైలాగ్ ని చెబుతున్నాడు. సీత నైనికతో బ్రెడ్ తిందామా అని అడిగింది. ఇక్కడకు వచ్చేముందు ఏడవకూడదు అనుకున్నా కానీ నాకు తెలియకుండానే ఏడుస్తున్నా అని నైనిక సీతతో చెబుతుంది. ఎన్నో ఏళ్లు అయ్యింది ఇంతగా వెక్కి వెక్కి ఏడ్చి అన్నది.

10:00 AM: పైసా వసూల్ సాంగ్ వేయడంతో కంటెస్టెంట్స్ అంతా నిద్ర లేచారు. బయటకు వచ్చి ముందు అభయ్, ఆదిత్య ఓం, నబీల్ డాన్స్ వేశారు. కంటెస్టెంట్స్ అంతా ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు.


ఇండియాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు ఇప్పటికే 7 సక్సెస్ ఫుల్ సీజన్లు పూర్తి చేసుకోగా ప్రస్తుతం వారం క్రితమే సీజన్ 8 ని మొదలు పెట్టింది. బిగ్ బాస్ సీజన్ 8 ఇంతకుముందు కంటే మరింత కలర్ ఫుల్ గా ఈ సీజన్ లిమిట్ లెస్ ఎంటర్టైన్ మెంట్, ఎంజాయ్ మెంట్ తో వచ్చింది. ఇప్పటికే గడిచిన వారం రోజుల్లో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ మీద ప్రేక్షకులు ఒక అవగాహనకు రాగా రాబోయే రోజుల్లో మరిన్ని ట్విస్టులు, టర్న్ లు ఉంటాయని తెలుస్తుంది.

ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో రెండో వారం నామినేషన్స్ ప్రక్రియ కూడా పూర్తైంది. కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో చెప్పిన కారణాలను సార్ట్ అవుట్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వారం నామినేషన్స్ లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. బిగ్ బాస్ సీజన్ 8 కి సంబంధించిన లైవ్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూనే ఉండండి