Begin typing your search above and press return to search.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ బిగ్ బాస్ తెలుగు S8 24x7 లైవ్ అప్డేట్స్ - టాస్క్ పూర్తైనా దాని మీదే చర్చ..!

By:  Tupaki Desk   |   12 Sep 2024 4:30 AM GMT
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ బిగ్ బాస్ తెలుగు S8 24x7 లైవ్ అప్డేట్స్ -  టాస్క్ పూర్తైనా దాని మీదే చర్చ..!
X

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 (BiggBoss Telugu Season 8) ని లైవ్ లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney Plus Hotstar) లో చూసేందుకు CLICK HERE!! మీద క్లిక్ చేయండి


10:00 PM : ప్రేరణ సంచాలక్ గా తనని తప్పుబట్టారంటూ మణికంఠతో చర్చిస్తుంది. నిఖిల్, సోనియా, పృధ్వి, అభయ్, యష్మి ఒక చోట్ల కూర్చుని మాట్లాడుకుంటున్నారు.

9:45 PM : ఫిట్నెస్ స్పిరిట్ ఉండాలి అన్ని ఆటలు మనమే గెలవాలంటే ఎలా అని సీత అన్నది. ఆదిత్య ఓం గురించి విష్ణు ప్రియ నైనికతో మాట్లాడుతుంది. సోనియా, శేఖర్ బాషా ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ బయటకు వెళ్లారు. డిష్ వాష్ ల గురించి ఇంకా బిగ్ బాస్ క్లారిటీ వ్వలేదని నైనిక అంటుంది. నిఖిల్, పృధ్వి, అభయ్, యష్మిలు మాట్లాడుతున్నారు.

9:30 PM: కిచెన్ లో నైనిక, మణికంఠ, సీత మాట్లాడుతున్నారు. విష్ణు ప్రియ వారి డిస్కషన్ లో జాయిన్ అయ్యింది.

9:15 PM : టాస్క్ పూర్తైంది. కంటెస్టెంట్స్ అంతా కూడా ఎవరి బెడ్ రూం లలో వారు టాస్క్ లో జరిగిన విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ టాస్క్ లో సంచాలక్ గా ప్రేరణ చాలా కన్ ఫ్యూజ్ అయ్యింది. బిగ్ బాస్ అందరినీ లైన్ లో నిలుచోమని చెప్పాడు.

9:00 PM : నబీల్ తనని ఆట నుంచి అవుట్ చేసిందని వాళ్లంతా బయటకు వచ్చి తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. ఓ పక్క బయట గార్డెన్ లో సాక్స్ కొనసాగుతుంది. నిఖిల్, అభయ్ ల మధ్య ఆట జరుగుతుంది. నబీల్ ఇంకా హౌస్ లోనే ఉండి బాధపడుతున్నాడు. ప్రస్తుతం అభయ్, నిఖిల్ ల మధ్య సింగిల్ సాక్స్ ఆట జరుగుతుంది.

8:45 PM : నబీల్, అభయ్, నిఖిల్ మధ్య ఇంకా టాస్క్ కొనసాగుతూనే ఉంది. నబీల్ కి సంచాలక్ ప్రేరణ సాక్స్ బయట ఉంచాలని చెప్పింది. నబీల్ కావాలని చేస్తున్నావని ప్రేరణ అంటుంది. చివరి బజర్ మోగేదాకా ఆ ముగ్గురు అలానే ఆడేలా ఉన్నారు. ఐతే ముగ్గురు ఉంటే కచ్చితంగా బిగ్ బాస్ ఎవరికీ ప్రైజ్ మనీ ఇవ్వరని కంటెస్టెంట్స్ డిస్కస్ చేస్తున్నారు. ఈ టాస్క్ లో బజర్ మోగే దాకా ముగ్గురు ఉండటంతో టాస్క్ రెండో లెవెల్ కి చేరుతుందని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. దాని కోసం ఈసారి సింగిల్ సాక్స్ తో ఆట ఆడాలని చెప్పాడు. నబీల్ సాక్స్ దాచాడని ప్రేరణ చెప్పింది.

8:30 PM : విష్ణు ప్రియ తో యష్మి వాదులాట కొనసాగుతుంది. అభయ్ నిఖిల్ నబీల్ మధ్య పోటీ జరుగుతుంది. ఆట ఈ ముగ్గురు మధ్య మొదలైంది. ముగ్గురు ఒకరిని రేసు నుంచి తప్పించాలని ఆడుతున్నారు. నిఖిల్ నబీల్ కలిసి అభయ్ కి టఫ్ ఫైట్ ఇస్తున్నారు

8:15 PM : ఇప్పటికే ఈ టాస్క్ లో పృధ్వి, విష్ణు ప్రియ, మణికంఠ టాస్క్ నుంచి బయటకు వచ్చారు. అక్కడ టాస్క్ లో ఇంకా నిఖిల్, అభయ్, నబీల్ ఉన్నారు. ఈ టాస్క్ సంచాలక్ గా ప్రేరణ క్లారిటీ లేకపోవడం వల్ల టాస్క్ అంతా రభస రభసగా సాగుతుంది.

8:00 PM : విష్ణు ప్రియను అభయ్ నెట్టేశాడని సంచాలక్ గా ప్రేరణ తన నిర్ణయాన్ని వారి క్లాన్ సభ్యులను అడుగుతుంటే యష్మి టీం సభ్యులు ఆమెపై ఎటాక్ చేస్తున్నారు. ఐతే ప్రేరణ బెనిఫిట్ ఆఫ్ డౌట్ తో ఆమెను ఆడించాలని అనుకున్నా మిగతా క్లాన్ సభ్యులు ఆమెతో వాదన జరుపుతున్నారు.

7:45 PM : ఈ టాస్క్ లో కంటెస్టెంట్స్ అంతా కూడా సంచాలక్ నిర్ణయం మీద అసంతృప్తిగా ఉన్నారు. వారు సంచాలక్ అయిన ప్రేరణ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. టాస్క్ పై కంటెస్టెంట్స్ ఒకలా సంచాలక్ ఒకలా అర్ధం చేసుకున్నారు. నిఖిల్ ప్రేరణ మీద గట్టిగా వాయిస్ రేజ్ చేశాడు. పృధ్వి ని ఆట నుంచి అవుట్ అని ప్రేరణ చెప్పింది. ఐతే ఆ నిర్ణయాన్ని పృధ్వి అభయ్ ఒప్పుకోవట్లేదు. దాని మీద హౌస్ లో ఆట ఆడే వాళ్ల అందరి మధ్య వాదన జరుగుతుంది. సాక్స్ చేతులతో తీసివేయకూడదని బిగ్ బాస్ చెప్పాడు. దాంతో మళ్లీ పృధ్వి ఆడాలని ఆమె క్లాన్ చీఫ్ యష్మి చెప్పింది. మళ్లీ ఆట మొదలు పెట్టగా ఈసారి సాంగ్ లో మణికంఠ అవుట్ అయ్యాడు.

7:30 PM : ఈ టాస్క్ లో ఎలాంటి పుషింగ్స్ ఎలో చేయనని ప్రేరణ చెబుతుంది. పుష్ చేస్తే డైరెక్ట్ అవుట్ ఇస్తానని చెప్పింది. టాక్స్ రూల్స్ పై కంటెస్టెంట్స్ సంచాలకురాలితో మాట్లాడుతున్నారు. అన్ని ఆటల్లో స్ట్రాటజెలు ఉంటాయి కానె నేను వచ్చినప్పుడే వద్దంటారని విష్ణు ప్రియ అన్నది. ఎవరో చెప్పిన మాటలు కాదు సంచాలక్ చెప్పిన మాటలే వినాలంటూ నైనిక చెబుతుంది. ఆమె ఏం డిసైడ్ చేసినా నాకు ఓకే అన్నది.

7:15 PM : పృధ్వి అభయ్, నబీల్ విష్ణు ప్రియ, నిఖిల్ మణికంఠ ఈ టాస్క్ చేస్తున్నారు. మారీ సాంగ్ కి కంటెస్టెంట్స్ అంతా పోటీ పడ్డారు. టాస్క్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఈ టాస్క్ కి ప్రేరణ సంచాలకురాలిగా ఉన్నారు.

7:00 PM : టాస్క్ కి సంబందించిన డీటెయిల్స్ అన్నీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి చెబుతున్నారు. యాంకిల్ వరకే సాక్స్ ధరించాలని పోటీదారులకు చెబుతున్నాడు.

6:45 PM : క్లాన్ సభ్యులు టాస్క్ కి సిద్ధం అయ్యారు. బిగ్ బాస్ ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్నారు

6:30 PM : బిగ్ బాస్ ఈసారి 3 క్లాన్స్ ఆరుగురు సభ్యులకు టాస్క్ ఇచ్చాడు. సాక్స్ వేసుకుని డాన్స్ చేసే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. దానికి అందరు రెడీ అవుతున్నారు.

6:15 PM : యష్మీ టీమ్ మెంబర్స్ అంతా బెడ్ రూమ్ లో మాట్లాడుకుంటున్నారు. నామినేషన్ పాయింట్స్ గురించి మాట్లాడుతున్నారు. అభయ్ శేఖర్ బాషా పాటలు పాడుతున్నారు. అంత్యాక్షరి ఆట ఆడుతున్నారు. ప్రస్తుతం అందరు సోఫాలో కూర్చుని ఉన్నారు.

6:00 PM : నిఖిల్ మణికంఠ సరదాగా ఆడుకుంటున్నారు. నైనిక వాళ్ల దగ్గరే ఉంది. ఒక పక్క యష్మీ క్లాన్ సభ్యులు చర్చిస్తున్నారు. టాస్క్ కి అంతా సిద్ధం అవుతున్నారు.

5:45 PM : టాస్క్ లో ఈసారి ఏ క్లాన్ నుంచి ఎవరు రావాలని డిస్కర్షన్ చేస్తున్నారు. ప్రేరణ ఈసారి టాస్క్ తనకే అని టీమ్ తో మాట్లాడుతుంది.

5:30 PM : బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరిని హౌస్ లోనే ఉండమన్నాడు. నేను చీఫ్ అయితే అందరికి రాగి జావే ఇస్తా అని మణికంఠ అన్నాడు. రాగి ముద్దలో నాటుకోడి పులుసు బాగుంటుంది అని సీతతో మణికంఠ చెప్పాడు. సీత కిచెన్ లో ఉంటే నబీల్ మాట్లాడుతున్నాడు.

5:15 PM : బెడ్ రూమ్ లో శేఖర్ బాషా విష్ణు ప్రియతో మాట్లాడుతున్నాడు. అభయ్ కూడా వారితో జాయిన్ అయ్యాడు. ఇప్పుడే బ్యాటరీస్ కోసం బజర్ మోగింది ఒక్కొక్కరు వెళ్లి బ్యాటరీలు తీసుకుంటున్నారు. టాస్క్ ల గురించి మాట్లాడొద్దు అని ప్రేరణ కి యష్మి అభయ్ అంటున్నారు. ఈసారి అబ్బాయిలు గుండు చేయించుకోవాలని చెబుతాడేమో అని మాట్లాడుకుంటున్నారు. నైనిక సీత మాట్లాడుతున్నారు. నబీల్ వచ్చి వారితో చర్చిస్తున్నాడు.

5:00 PM : నైనిక విష్ణు ప్రియతో మాట్లాడుతున్నారు. టాస్క్ పూర్తయిన తర్వాత నిఖిల్ కు అందరు హెల్ప్ చేస్తున్నారు. తన కాఫీ తీసుకున్నారని నైనిక ఫీల్ అవుతుంది. వాళ్ల ఫుడ్ లో సాల్ట్ కలిపేస్తా అని విష్ణు ప్రియతో చెప్పింది. టాస్క్ గురించి అభయ్ యష్మిలు సీత మాట్లాడుతున్నారు.

4:45 PM : వ్యాక్స్ టాక్స్ పూర్తైంది. సోనియా సంచాలకురాలిగా చేసింది.. నబీల్ ని విజేతగా ప్రకటించింది.

4:30 PM : బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ కు అందరు సిద్ధం అవుతున్నారు. పృధ్వి, నబీల్, నిఖిల్ ముగ్గురు బజర్ కోసం ఎదురుచూస్తున్నారు. స్టోర్ నుంచి ఇప్పుడే టాస్క్ కి కావాల్సిన వస్తువులు తీసుకుని సోనియా వచ్చింది. టాస్క్ ఇప్పుడే మొదలైంది.

4:15 PM : బిగ్ బాస్ ఈసారి 50 వేల టాస్క్ ఇచ్చాడు. మోకాళ్లు, చాతి వ్యాక్స్ చేసుకోవాలని చెప్పాడు. ముందు ఎవరు క్లీన్ గా చేస్తారో వారే విజేతగా నిలుస్తారు. పృధ్వి నబీల్ నిఖిల్ లకు ఈ టాస్క్ ఇచ్చాడు.

4:00 PM : బిగ్ బాస్ ప్లీజ్ టాస్క్ కోసం కంటెస్టెంట్స్ ని అలర్ట్ చేశాడు. స్క్రీన్ మీద బిగ్ బాస్ ప్లీజ్ స్టార్టింగ్ సూన్ అనే మెసేజ్ ఇచ్చాడు. కంటెస్టెంట్స్ అంతా సోఫా దగ్గరకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. నైనిక, సీత డైనింగ్ టేబుల్ దగ్గర లంచ్ చేస్తున్నారు. విష్ణు ప్రియ కూడా వారితో పాటు భోజనం చేసింది. ప్రస్తుతం అందరు సోఫా లో కూర్చుని పాటలు పాడుతున్నారు.

3:45 PM : మణికంఠ ఆకలి వేస్తుంది అనుకుంటూ సోఫాలో కేకలు వేస్తున్నాడు. యష్మి టీం సభ్యులు భోజనం చేస్తూనే ఉన్నారు. పృధ్వి, శేఖర్ తప్ప మిగతా నలుగురు లంచ్ చేస్తున్నారు. నైనిక, సీత కలిసి మాట్లాడుతున్నారు. నైనిక, సీత కలిసి మాట్లాడుతున్నారు. వాళ్లతో నిఖిల్ కూడా జాయిన్ అయ్యాడు.

3:30 PM : ఆదిత్య ఓం టాస్క్ గురించి సోనియాతో సోఫాలో కూర్చుని మాట్లాడుతున్నాడు. ప్రేరణ చేస్తున్న కర్రీని యష్మి టేస్ట్ చేస్తుంది. ఇద్దరు కిచెన్ లో మాట్లాడుకుంటున్నారు. యష్మి టీం సభ్యులు సోనియా, అభయ్, ప్రేరణ, యష్మి వారి బెడ్ రూం లో భోజనం చేస్తున్నారు.

3:15 PM : అందరు ఇంట్లోనే ఉండమని బిగ్ బాస్ ఆర్డర్ వేశాడు. కిచెన్ లో ప్రేరణ కర్రీ చేస్తుంది. సీత కూడా అక్కడే వంట చేస్తుంది. నెక్స్ట్ రేషన్ టాస్క్ గురించి నైనిక సీతతో మాట్లాడుతుంది. సోఫా దగ్గర అభయ్ పృధ్వి టాస్క్ గురించి డిస్కస్ చేస్తున్నారు.

3:00 PM : కిచెన్ లో సీత వంట చేస్తుంది. ప్రేరణ కూడా తన క్లాన్ సభ్యుల కోసం వంట మొదలు పెట్టింది. యష్మి ప్రేరణకు ఏం కావాలో అందిస్తుంది. కిచె దగ్గరకు నిఖిల్, నబీల్ ఉన్నారు. పృధ్వి కూడా కిచెన్ లో కావాల్సినవి అందిస్తున్నాడు. నైనిక, సీత కిచెన్ లోనే ఒక పక్కన కూర్చుని మాట్లాడుతున్నారు. జరిగిన టాస్క్ గురించి అభయ్, ఆదిత్య ఓం, నిఖిల్ మాట్లాడుతున్నారు.

2:45 PM : కిచెన్ లో సీత, నైనిక కుకింగ్ చేస్తున్నారు. వాళ్లకు ఆదిత్య ఓం హెల్ప్ చేస్తున్నారు. నబీల్ కూడా అదే క్లాన్ కు సంబంధించిన వ్యక్తి కాబట్టి అతను కూడా కావాల్సినవి హెల్ప్ చేస్తున్నాడు. మరోపక్క యష్మి క్లాన్ బెడ్ రూం లో నిఖిల్ కూడా జాయిన్ అయ్యి అభయ్, పృధ్వి, యష్మి, ప్రేరణ, శేఖర్ బాషా అందరు మాట్లాడుతున్నారు.

2:30 PM : ఈ టాస్క్ లో అంతులేని వీరులు ఓడిపోయారు. లక్షన్నర లో కెరటం టీం కు 75 వేలు, అఖండ క్లాన్ కు 75 వేలు వచ్చాయి.

2:15 PM : లక్షన్నర గెలిచే టాస్క్ మొదలైంది. గార్డెన్ ఏరియాలో టాస్క్ మొదలు పెట్టిన బిగ్ బాస్. ఆదిత్య ఓం మొదట ఆట మొదలు పెట్టాడు.

2:00 PM : కంటెస్టెంట్స్ కొందరు సోఫాలో కొందరు ఉన్నారు. మరికొందరు వేరే చోట మాట్లాడుతున్నారు. ఐతే బిగ్ బాస్ అందరినీ సోఫాలో కూర్చోమని ఆర్డర్ వేశాడు. అందరు వచ్చి సోఫాలో కూర్చున్నారు. గ్లాస్ లోంచి మినట్ మెయిడ్ పల్పీ ఆరంజ్ కిందకు పోకుండా చూసుకోవాలి. ప్లాస్మాలో ఈ టాస్క్ ఆడే వారి పేర్లు చూపిస్తామని బిగ్ బాస్ చెప్పాడు. ఈసారి టాస్క్ 1.50 లక్షలు అని చెప్పాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో అభయ్, నిఖిల్, ఆదిత్య ఓం పాల్గొంటున్నారు.

1:45 PM : యష్మి టీం మెంబర్స్ అభయ్, యష్మి, ప్రేరణ మాట్లాడుతున్నారు. 3 రోజులు మిల్క్ ప్యాకెట్స్ మ్యానేజ్ చేసుకోవాలని మాట్లాడుకుంటున్నారు. టాస్కులు ఆడని వారి గురించి యష్మి చర్చిస్తుంది. వాళ్ల టీం లో సీత, ఆదిత్య ఓం ఆడలేదని మాట్లాడుతున్నారు. పృధ్వి, విష్ణు ప్రియ, శేఖర్ బాషా, మణికంఠ ఒకచోట కూర్చుని మాట్లాడుతున్నారు.

1:30 PM :కిచెన్ లో మణికంఠ రాగి జావ చేసుకుంటున్నాడు. యష్మి వచ్చి అతనితో మాట్లాడుతుంది. ప్రేరణ, యష్మి ఇద్దరు డిస్కస్ చేస్తున్నారు. యష్మి క్లాన్ రేషన్ లో మిస్ అయిన పనీర్, మష్రూం గురించి మాట్లాడుతున్నారు. యష్మి క్లాన్ సభ్యులతో ఆమె మాట్లాడుతుంది. అభయ్, సోనియా, ప్రేరణ ఉన్నారు.

1:15 PM : కిచెన్ లో ప్రేరణ, సోనియా ఉన్నారు. యష్మి వారితో మాట్లాడుతుంది. కర్రీ గురించి వారు మాట్లాడుకుంటున్నారు. వారు పెరుగు అవుతుందా లేదా అని చర్చిస్తున్నారు.

01:00 PM : ప్రేరణ, యష్మి లంచ్, డిన్నర్ కి కర్రీస్ గురించి మాట్లాడుతున్నారు. సోనియా పాల ప్యాకెట్స్ తీసుకుంటే నబీల్ కి తిరిగి మళ్లీ అభయ్ ఇచ్చేశాడు. కిచెన్ లో సోనియా, అభయ్, విష్ణు ప్రియ ఉన్నారు. అభయ్ బెడ్ రూం లో దోశ తింటున్నాడు.

12:45 PM : కిచెన్ లో ప్రేరణ, నిఖిల్ మాట్లాడుతున్నారు. విష్ణు ప్రియ కూడా వారి చర్చలో ఉంది. బెడ్ రూమ్ లో యష్మి, సోనియా ఇద్దరు దోశలు తింటున్నారు. వారిద్దరితో పృధ్వి మాట్లాడుతున్నారు. ఎవరి సైకోయిజం చూడాలని ఉందని యష్మి విష్ణు ప్రియతో చెబుతుంది. నబీల్, కిరాక్ సీత వారి రూమ్ లో ఉన్నారు. యష్మి తమ వస్తువులను సర్ధుతుంది.

12:30 PM : డైనింగ్ టేబుల్ దగ్గర శేఖర్ బాషా, పృధ్వి, కిరాక్ సీత దోశలు తిన్నారు. కిచెన్ లో సోనియా, యష్మి విష్ణు ప్రియ పాల ప్యాకెట్ తీసుకున్న విషయం గురించి మాట్లాడుతున్నారు. యష్మి, ప్రేరణ, సోనియా ముగ్గురు కిచెన్ లో మాట్లాడుతున్నారు.

12:15 PM : విష్ణు ప్రియ పాల ప్యాకెట్ అడక్కుండా తీసుకుందని యష్మి ఆమెతో వాదన పెట్టుకుంది. అడక్కుండా తీసుకుని ఆట ఆడితే ఓకే కానీ అడిగితే వద్దని చెప్పాక మళ్లీ కావాలని తీసుకుందని యష్మి చర్చ మొదలు పెట్టింది. యష్మి పృధ్వితో జరిగిన విషయం గురించి మాట్లాడుతుంది. కిచెన్ లో విష్ణు ప్రియ, ప్రేరణ పాల ప్యాకెట్ ఇష్యూ గురించి మాట్లాడుతున్నారు. సీత డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి మాట్లాడుతుంది.

12:00 PM : డిష్ లు క్లీన్ చేసే విషయంపై లగ్జరీ టీం చేయాలా వద్దా అన్నది వివరణ కోరుతున్నారు విష్ణు ప్రియ. ప్లీజ్ బిగ్ బాస్ ఏదో ఒకటి చెప్పండి అంటూ కిచెన్ లో అభయ్, సీత ఉన్నప్పుడు మాట్లాడింది. ఫిజికల్లి ఫిట్ ఉండటం చాలా ఇంపార్టెంట్ అని నబీల్ తో చెబుతున్నాడు మణికంఠ. పృధ్వి కోపం గురించి కిచెన్ దగ్గర సీత, విష్ణు ప్రియ మాట్లాడుతున్నారు. సోఫా నైనిక, నిఖిల్ మాట్లాడుతున్నారు. వాళ్ల ముద్దుపేర్ల గురించి చెప్పుకుంటున్నారు.

11:45 AM : అఖండ క్లాన్ వారి మష్రూమ్, పనీర్ ప్యాకెట్ ఎవరో తీసుకున్నారని ప్రేరణ పృధ్వికి చెప్పింది. నబీల్ మీద తన అనుమానం వ్యక్తం చేసింది ప్రేరణ. చికెన్ తీసుకున్నాం కాబట్టి వాళ్లు ఇలా చేసి ఉంటారని యష్మి అన్నది. నిన్న నిద్ర డిస్ట్రబ్ చేసినందుక్ యష్మి ఫీలయ్యానని ప్రేరణతో చెబుతుంది. ఇవన్నీ చేస్తూ పద్ధతి గురించి మాట్లాడుతున్నారు. సొసైటీలో పిల్లర్స్ అన్నట్టు చెబుతున్నారని ప్రేరణ అన్నది. కిచెన్ లో విష్ణు ప్రియ, అభయ్ టీ పెడుతున్నారు.

11:30 AM : పృధ్వి ఫ్రిజ్ లో పాలు పెట్టాడు. ఆదిత్య ఓం వచ్చి ఫ్రిజ్ డోర్ మీరు వేస్తారా లేదా నేను వేయాలా అని జోక్ చేశాడు. సీతకు టీ చేయమని చెప్పి స్నానానికి వెళ్లాడు పృధ్వి. అభయ్, శేఖర్ బాషా ఉన్న బెడ్ రూమ్ లోకి ఆదిత్య బ్లాక్ కాఫీ తెచ్చుకున్నాడు. ప్రేరణలో బెడ్ రూమ్ లోకి వచ్చి తను వేసుకున్న షర్ట్ గురించి అభయ్, శేఖర్ బాషా, ఆదిత్య ఓం లతో చెబుతుంది. అక్కడ నబీల్ కూడా ఉన్నాడు. యష్మి ఇప్పుడే వారి బెడ్ రూమ్ లోకి వచ్చింది.

11:15 AM : నిఖిల్, సోనియా, కిరాక్ సీత, నైనిక, విష్ణు ప్రియ, మణికంఠ ఒకచోట కూర్చుని మాట్లాడుతున్నారు. మణికంఠకు సీరియల్స్ లో విలన్ క్యారెక్టర్ లైన్ కడతాయని విష్ణు ప్రియ అన్నది. ఆదిత్య ఓం ఒంటరిగా ఒక్కడే లాన్ లో సోఫాలో కూర్చుని ఉన్నాడు.

11:00 AM : బయట చెయిర్స్ లో అభయ్, పృధ్వి, నిఖిల్, నబీల్, ఆదిత్య ఓం కూర్చుని ఆ తాడు ఆట గురించి మాట్లాడుతున్నారు. వాష్ రూమ్ లో యష్మి, ప్రేరణ, కిరాక్ సీత బ్రుష్ చేస్తున్నారు. సోనియా టైం ఎంత అవుతుండొచ్చని అడిగితే 10 దాటి ఉంటుందని శేఖర్ బాషా చెబుతున్నాడు. నైనిక వచ్చి సోనియాతో మాట్లాడింది. తనకు వచ్చిన డ్రీం గురించి నిఖిల్ తో నైనిక చర్చిస్తుంది. తన స్టోరీనిA,B,C క్యారెక్టర్స్ తో చెబుతున్న నైనిక.

10:45 AM : ఫుల్ కిక్కు సాంగ్ తో కంటెస్టెంట్స్ అంతా నిద్ర లేస్తూ వచ్చి బయట డాన్స్ చేశారు. ఆదిత్య ఓం, నిఖిల్, కిరాక్ సీత, నబీల్, అభయ్, యష్మి, ప్రేరణ, శేఖర్ బాషా, పృధ్వి డాన్స్ చేస్తున్నారు. సోనియా మాత్రం వచ్చి బయట సోఫాలో కూర్చుంది. సాంగ్ పూర్తి కాగానే అందరు కంటెస్టెంట్స్ గుడ్ మార్నింగ్ బిగ్ బాస్ అని చెప్పారు.

10:30 AM : బిగ్ బాస్ ప్లీజ్ టాస్క్ ఆడి మీ ప్రైజ్ మనీ పెంచుకోండని బిగ్ బాస్ ఇచ్చిన ఆఫర్ ను 3 క్లాన్ సభ్యులు వినియోగించుకోవాలని అనుకుంటున్నారు. ఐతె రెండు టాస్కులు పూర్తి కాగా 3 వ టాస్క్ 75 వేలా లేదా లక్ష రూపాయలకు ఇస్తారా అన్నది కంటెస్టెంట్స్ మధ్య చర్చ జరిగింది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ నిద్ర లేవలేదు. నబీల్ ఒక్కడే బయటకు వచ్చాడు.

10:15 AM : టాస్కుల్లో ఫిజికల్ అవ్వాలా వద్దా అన్న డిస్కషన్ 3 క్లాన్ సభ్యుల మధ్య నిన్న చాలాసేపు జరిగింది. అయితే డిఫెన్స్ మోడ్ ఓకే కానీ ఫిజికల్ అయితే దెబ్బలు తగులుతాయని 3 క్లాన్ చీఫ్స్ అలాంటివి వద్దని నిర్ణయించుకున్నారు. అందుకే బిగ్ బాస్ ప్లీజ్ రెండో టాస్క్ లో నిఖిల్, పృధ్వి, నబీల్ లు ఎక్కువ ఫిజికల్ అవ్వకుండా కేవలం వాళ్ల ప్రయత్నం చేశారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ ఇంకా నిద్ర పోతూనే ఉన్నారు. ఒకరిద్దరు మెలకువ ఉన్నట్టు గుసగుసలాడుతున్నారు.

10:00 AM : బిగ్ బాస్ ప్లీజ్ లో రెండు టాస్కులు జరిగితే అందులో 25 వేలు అంతులేని వీరులు క్లాన్ గెలవగా.. 50 వేల టాస్క్ ను కెరటం క్లాన్ దక్కించుకుంది. నెక్స్ట్ టాస్క్ కి 3 క్లాన్ సభ్యులు సిద్ధంగా ఉన్నారు. బుధవారం ఆ రెండు టాస్కులతోనే రోజుని ముగించగా గురువారం ఎలాంటి టాస్క్ ఇస్తారన్నది కంటెస్టెంట్స్ ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ ఇంకా నిద్రపోతూనే ఉన్నారు.

ఇండియాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు ఇప్పటికే 7 సక్సెస్ ఫుల్ సీజన్లు పూర్తి చేసుకోగా ప్రస్తుతం వారం క్రితమే సీజన్ 8 ని మొదలు పెట్టింది. బిగ్ బాస్ సీజన్ 8 ఇంతకుముందు కంటే మరింత కలర్ ఫుల్ గా ఈ సీజన్ లిమిట్ లెస్ ఎంటర్టైన్ మెంట్, ఎంజాయ్ మెంట్ తో వచ్చింది. ఇప్పటికే గడిచిన వారం రోజుల్లో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ మీద ప్రేక్షకులు ఒక అవగాహనకు రాగా రాబోయే రోజుల్లో మరిన్ని ట్విస్టులు, టర్న్ లు ఉంటాయని తెలుస్తుంది.

బిగ్ బాస్ సీజన్ 8 లో ప్రస్తుతం బిగ్ బాస్ ప్లీజ్ టాస్క్ నడుస్తుంది. 3 క్లాన్ లకు సమయానుసారంగా బిగ్ బాస్ టాస్క్ లు ఇస్తాడు. ప్రైజ్ మనీ పెంచుకునే విధంగా ఒక్కో టాస్క్ ఒక్కో రేటు బిగ్ బాస్ ఫిక్స్ చేసి టాస్క్ ఇస్తాడు. ఇప్పటికే బిగ్ బాస్ ప్లీజ్ టాస్క్ లో రెండు రౌండ్లు పూర్తయ్యాయి. మొదటిది అంతులేని వీరులు 25 వేలు గెలవగా రెండోది కెరటం క్లాన్ 50 వేలు గెలుచుకుంది. నెక్స్ట్ బిగ్ బాస్ ఏ టాస్క్ ఇస్తాడు.. ఆ ఫైట్ ఎవరి మధ్య జరుగుతుంది.. ఆ టాస్క్ వాల్యూ ఎంత అన్నది తెలుసుకోవాలంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లైవ్ చూడాల్సిందే.