Begin typing your search above and press return to search.

సోనీ - జీ మధ్య వివాదం సెటిల్డ్..ఇప్పుడేం జరగనుంది?

మరో కార్పొరేట్ వివాదం ఒక కొలిక్కి వచ్చింది. రెండు ఎంటర్ టైన్ మెంట్ సంస్థల మధ్య నెలకొన్న సుదీర్ఘ పంచాయితీకి చెల్లుచీటి పడినట్లే.

By:  Tupaki Desk   |   28 Aug 2024 4:28 AM GMT
సోనీ - జీ మధ్య వివాదం సెటిల్డ్..ఇప్పుడేం జరగనుంది?
X

మరో కార్పొరేట్ వివాదం ఒక కొలిక్కి వచ్చింది. రెండు ఎంటర్ టైన్ మెంట్ సంస్థల మధ్య నెలకొన్న సుదీర్ఘ పంచాయితీకి చెల్లుచీటి పడినట్లే. జీ ఎంటర్ టైన్ మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్.. సింఫుల్ గా చెప్పాలంటే జీల్ కు సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియాలు కీలక నిర్ణయానికి వచ్చాయి.

ఫెయిల్ అయిన 10 బిలియన్ డాలర్ల విలీన ఒప్పందం విషయంలో ఈ రెండు సంస్థల మధ్య గడిచిన ఆర్నెల్లుగా కార్పొరేట్ వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. దీన్ని.. తాజాగా ఈ రెండు సంస్థలు ఉభయతారకంగా పరిష్కరించుకున్నాయి. అదే సమయంలో ఒక దానిపై మరొకటి పెట్టుకున్న కేసుల్ని ఉపసంహరించుకునేలా అంగీకారం కుదిరిన విషయాన్ని వెల్లడించాయి. తాజాగా ఇరు సంస్థల మధ్య కుదిరిన వివాద పరిష్కారంలో భాగంగా.. ఇకపై రెండు సంస్థల్లో ఎవరికిఎవరిపై ఎలాంటి క్లెయింలు ఉండవు.

ఫ్యూచర్ లోనూ ఈ సంస్థలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోనున్నాయి. అన్ని వివాదాల కచ్ఛితమైన ముగింపు లక్ష్యంగా ఈ నిర్ణయాల్ని తీసుకోనున్నారు. అసలు ఈ వివాదం ఎలా మొదలైందన్న విషయాన్ని చూస్తే.. 2021 డిసెంబరులో రెండు సంస్థలు విలీన సహకార ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఏడాది జనవరిలో ఒప్పందాన్నిరద్దు చేసి.. ఆ తర్వాత రెండు రోజుల్లోనే సోనీ సంస్థ.. సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ను ఆశ్రయించింది.

విలీన షరతుల్ని జీల్ పాటించని కారణాన్ని ఎత్తి చూపుతూ.. దగ్గర దగ్గర రూ.748.7 కోట్ల పరిహారాన్ని ఇవ్వాల్సిందిగా పేర్కొంది. ఈ వాదనను జీల్ తీవ్రంగా వ్యతిరేకించింది. ముందుగా తాము అనుకున్న విలీనాన్ని అమలు చేయాలని కోరుతూ జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ ను ఆశ్రయించింది. ఇలా వివాదం అంతకంతకూ ముదిరి పాకాన పడుతున్న వేళ.. ముందుగా చేసుకున్న ఒప్పంద సమయం ముగిసిన తర్వాత నుంచి రెండు సంస్థలు స్వతంత్రంగా వ్యవహరిస్తున్నాయి.

అయితే.. జీల్ మాత్రం ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. దాన్ని అధిగమించటానికి ప్రయత్నిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.118 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇదిలా ఉండగా.. సోనీతో తనకున్న పంచాయితీని సెటిల్ చేసుకోవటంలో చోటు చేసుకున్న తాజా పరిణామం జీల్ షేర్లు పెరిగేలా చేశాయి. మంగళవారం ట్రేడిండ్ లో 12 శాతం పెరిగిన షేరు మొత్తంగా ట్రేడింగ్ ముగిసే నాటికి రూ.150.85 వద్ద క్లోజ్ అయ్యింది. ఒక దశలో 14.25 శాతం పెరిగింది. మొత్తంగా మంగళవారం ట్రేడింగ్ ముగిసే నాటికి కంపెనీ మార్కెట్ విలువ రూ.1488 కోట్లు పెరిగింది. దీంతో.. జీల్ మొత్తం మార్కెట్ విలువ రూ.14,489.4 కోట్లకు చేరుకున్నట్లైంది.