Begin typing your search above and press return to search.

పిక్‌ టాక్‌ : రెడ్‌ కాటన్‌ చీరలో అందాల దివి

సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌గా అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేసే ముద్దుగుమ్మ దివి మరోసారి తన అందమైన ఫోటోలను షేర్‌ చేసింది.

By:  Tupaki Desk   |   20 Jan 2025 6:30 PM GMT
పిక్‌ టాక్‌ : రెడ్‌ కాటన్‌ చీరలో అందాల దివి
X

బిగ్‌బాస్‌తో ఒక్కసారిగా పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ దివి. అంతకు ముందు పెద్దగా ఈ అమ్మడి గురించి ప్రేక్షకులకు తెలియదు. ఎప్పుడైతే ఈ అమ్మడు బుల్లి తెరపై బిగ్‌ బాస్ ద్వారా అలరించిందో అప్పటి నుంచి ఈ అమ్మడికి సోషల్ మీడియా ద్వారా మంచి క్రేజ్ దక్కింది. అంతే కాకుండా సినిమాల్లోనూ ఆఫర్లు వస్తున్నాయి. ఇటీవల సంక్రాంతి కానుకగా వచ్చిన డాకు మహారాజ్ సినిమాలోనూ ఈ అమ్మడు కనిపించిన విషయం తెల్సిందే. అయితే అందంకు తగ్గట్టుగా మంచి ఆఫర్లు రావడం లేదు అనేది కొందరి అభిప్రాయం. ఈమె అందం సోషల్‌ మీడియాకే పరిమితం అవుతోంది.


సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌గా అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేసే ముద్దుగుమ్మ దివి మరోసారి తన అందమైన ఫోటోలను షేర్‌ చేసింది. ఈసారి రెడ్ కాటన్ చీరలో దివి కనిపించింది. పెద్దగా స్కిన్‌ షో చేయకుండానే నడుము మడతలను చూపిస్తూ దివి కవ్విస్తోంది. టాలీవుడ్‌లో ఉన్న ఎంతో మంది హీరోయిన్స్‌తో పోల్చితే దివి అందం విషయంలో చాలా ముందు ఉంటుంది. అంతే కాకుండా నటనలోనూ ఇప్పటికే చాలా సార్లు నిరూపించుకుంది. అయినా ముద్దుగుమ్మకు టాలీవుడ్‌లో ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదు.


ఇలాంటి చీర కట్టు ఫోటోల్లో, మోడ్రన్‌ డ్రెస్‌ల్లో, స్కిన్‌ షో చేసే ఫోటోల్లో ఈ అమ్మడు అలరిస్తూ వచ్చింది. ఎన్నో సార్లు ఈ అమ్మడి అందాల ఆరబోత ఫోటోలు వైరల్‌ అయ్యాయి. మరోసారి ఈమె అందమైన ఫోటోలను సోషల్‌ మీడియాలో నెటిజన్స్ తెగ షేర్‌ చేస్తున్నారు. సాధారణంగానే చీర కట్టులో దివి చాలా అందంగా ఉంటుంది. ఈసారి అంతకు మించి అందంగా ఉంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సింపుల్‌ కాటన్‌ చీరలోనూ ఇంత అందంగా కనిపించవచ్చు అని దివి నిరూపించింది అంటూ నెటిజన్స్ కొందరు ఈమె ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేస్తూ తెగ లైక్‌ చేస్తున్నారు.


సినిమాల్లో లీడ్‌ రోల్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్న దివికి చిన్నా చితకా ఆఫర్లు మాత్రమే వస్తున్నాయి. పెద్ద హీరోల సినిమాల్లో చిన్న పాత్రలు, చిన్న హీరోల సినిమాల్లో ఒక మోస్తరు గుర్తింపు ఉన్న పాత్రలను ఈమె చేస్తుంది. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా వెబ్‌ సిరీస్‌ల్లోనూ నటిస్తూ వస్తుంది. గేమ్‌ షోల్లో అప్పుడప్పుడు కనిపిస్తూ వస్తుంది. సోషల్‌ మీడియాలో ఎక్కువగా ఈ అమ్మడు సందడి చేస్తూ ఉంటుంది. తెలుగు అమ్మాయి కాకుంటే దివికి కచ్చితంగా టాలీవుడ్‌లో మంచి ఆఫర్లు దక్కేవి అనేది కొందరి అభిప్రాయం. దివి టాలీవుడ్‌లో కాకుండా ఇతర భాషల్లో ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది కదా అని కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.