Begin typing your search above and press return to search.

దివి అందాల వడ్డన ఎవరి కోసమో?

వైట్ కలర్ శారీలో దిగిన ఫోటో షూట్ ను పోస్ట్ చేసిన దివి.. వడ్డించా నేను చాలా నీకు? అంటూ క్యాప్షన్‌ పెట్టింది. ప్రస్తుతం దివి పిక్స్ ఫుల్ వైరల్ గా మారాయి.

By:  Tupaki Desk   |   6 Jan 2025 5:27 PM GMT
దివి అందాల వడ్డన ఎవరి కోసమో?
X

బిగ్ బాస్ బ్యూటీ, టాలీవుడ్ భామ దివి వద్త్యాకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. అందం, అభినయంతో ఆమె తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుందనే చెప్పాలి. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి తన క్రేజ్ ను మరింత పెంచుకుంది. అప్పట్లో మహేష్ బాబు మహర్షి చిత్రంలో ఓ సీన్ లో కనిపించినా.. పెద్దగా ఎవరూ స్పెషల్ గా గుర్తించలేదు.

అంతకు ముందు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు, ప్రకటనల్లో సందడి చేసింది దివి. కానీ బిగ్ బాస్ షోతో తర్వాత మాత్రం తెలుగు వారందరికీ బాగా దగ్గరైందని చెప్పాలి. దివి ఫాలోయింగ్ తో పాటు క్రేజ్ కూడా ఓ రేంజ్ లో పెరిగింది. అలా టాలీవుడ్ లో క్రేజీ బ్యూటీగా మారిపోయిన ముద్దుగుమ్మ దివికి వరుసగా మంచి ఆఫర్స్ వస్తున్నాయి.

రీసెంట్ గా లంబసింగి మూవీతో హీరోయిన్ గా మారింది దివి. కొన్ని వెబ్ సిరీసులు, వీడియో సాంగ్స్ తో ఆకట్టుకున్న అమ్మడు.. ప్రస్తుతం పలు ఆఫర్స్ తో బిజీ బిజీగా గడుపుతూనే ఉంది. ఇటీవల హరికథ వెబ్ సిరీస్‌ తో మెప్పించిందనే చెప్పాలి. అదే సమయంలో సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తోంది ముద్దుగుమ్మ దివి.

అయితే ఓవైపు సినిమాలు, వెబ్ సిరీసుల్లో బిజీగా ఉన్న దివి.. మరోవైపు సోషల్ మీడియాలో యమా యాక్టివ్. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన గ్లామరస్ పిక్స్ ను షేర్ చేసే అమ్మడు.. పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలు పంచుకుంటూ ఉంటుంది. తాజాగా షేర్ చేసిన పిక్స్ అయితే వేరే లెవెల్.

వైట్ కలర్ శారీలో దిగిన ఫోటో షూట్ ను పోస్ట్ చేసిన దివి.. వడ్డించా నేను చాలా నీకు? అంటూ క్యాప్షన్‌ పెట్టింది. ప్రస్తుతం దివి పిక్స్ ఫుల్ వైరల్ గా మారాయి. ఒక్కో ఫోటోలో దివి అందాల ఆరబోత అదుర్స్ అనే చెప్పాలి. రకరకాల పోజులు ఇచ్చి తన గ్లామర్ తో మైమరిపిస్తున్న ముద్దుగుమ్మ.. వేరే లెవెల్ లో అందరినీ ఆకట్టుకుంటోంది.

దీంతో దివి నయా పిక్స్ పై నెటిజన్లు తెగ స్పందిస్తున్నారు. గ్లామరస్ ఫోటోస్ కు కేరాఫ్ అడ్రస్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆమె అందానికి ఫిదా అయ్యామని చెబుతున్నారు. ఓ రేంజ్ లో లైకులు కొడుతున్న నెటిజన్లు.. కామెంట్లు పెడుతూ షేర్ చేస్తున్నారు. అందాల వడ్డన ఎవరి కోసమని సరదాగా క్వశ్చన్ చేస్తున్నారు.