డాన్స్ ఫ్లోర్‌పై దివి ధమాకా... ఈ లుక్‌కు నెటిజన్లు ఫిదా!
మహర్షి, గాడ్ ఫాదర్ వంటి సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించిన ఆమె, గ్లామర్ అప్‌డేట్‌లతో సినీ ప్రాజెక్టులకు సమీపిస్తున్న తరుణంలో ఇన్‌స్టాలో పోస్టులు హీటెక్కిస్తున్నాయి.
By: Tupaki Desk | 30 March 2025 3:11 AMబిగ్ బాస్ షోతో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దివి వధ్యా, సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన పోస్టులతో అభిమానులను మెప్పిస్తున్న సంగతి తెలిసిందే. మహర్షి, గాడ్ ఫాదర్ వంటి సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించిన ఆమె, గ్లామర్ అప్‌డేట్‌లతో సినీ ప్రాజెక్టులకు సమీపిస్తున్న తరుణంలో ఇన్‌స్టాలో పోస్టులు హీటెక్కిస్తున్నాయి.
తాజాగా దివి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన సాలిడ్ నైట్ పార్టీ లుక్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. గచ్చిబౌలిలో ఓ క్లబ్‌లో ఎంజాయ్ చేస్తూ తీసుకున్న ఈ ఫోటోల్లో ఆమె కళ్లజోడు, బ్లాక్ ఔట్‌ఫిట్‌తో నలుగురిలో స్టాండ్ అవుట్ అవుతోంది. నలుపు రంగు ఫిట్ డ్రెస్, సన్నగా వదిలిన జుట్టు, సింపుల్ మెకప్‌తో ట్రెండీ లుక్‌ను ప్రెజెంట్ చేసింది దివి.
దివి వేసుకున్న ఈ డ్రెస్ డీప్ నెక్ కట్‌తో ఉండి, ఆమె స్టైలిష్ నైటౌట్ వైబ్స్‌ను హైలైట్ చేస్తోంది. మినిమల్ మేకప్, సింపుల్ నెక్‌లెస్, డార్క్ షేడ్స్ గ్లాసెస్‌తో ఆమె ఎలిగెన్స్‌ను మెరుగ్గా చూపించగలిగారు. బ్యాక్ లైట్ అంబియన్స్‌లో తీసిన ఫోటోలు ఆమె గ్లో ను రెట్టింపు చేశాయి. ఈ ఫోటోలకు సంబంధించిన క్యాప్షన్ శనివారం వీకెండ్ లవ్ అంటూ పెట్టిన దివి, వారాంతాన్ని స్టైలిష్‌గా సెలబ్రేట్ చేసిందని చెప్పకనే చెబుతోంది.
హంగామా హో గయా అంటూ ఫిల్మీ టచ్ ఉన్న సంగీతాన్ని కూడా వీడియోలో జత చేస్తూ సింపుల్ సిగ్నల్ ఇచ్చినట్టే చేశారు. దీంతో నెటిజన్లు "దివి ఎలా కనిపించినా అందమే, బ్యూటీ అండ్ బోల్డ్‌నెస్ కాంబో" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. వాస్తవానికి దివి కెరీర్‌లో సినిమాల కన్నా సోషల్ మీడియాలో ఆమె క్రేజ్ ఎక్కువగా కనిపిస్తోంది. కానీ ఇలాంటి స్టైలిష్ అప్‌డేట్‌లు చూసిన తర్వాత మాత్రం ప్రొడ్యూసర్స్ కూడా ఆమెను పట్టించుకోవడం ఖాయం అనిపిస్తోంది. మరి ఈ పిక్స్ తర్వాత దివి కొత్త సినిమాల్లో ఛాన్సులు కొట్టేస్తుందా అనేది చూడాలి.