Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : మబ్బుల్లో అందాల దివి

నీటిలోనే దివి ఉన్నా కూడా ఫోటో ఎఫెక్ట్‌ మరియు ఆమె అందం మేఘాల్లో తేలి ఆడుతున్నట్లుగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   12 March 2024 6:22 AM GMT
పిక్ టాక్‌ : మబ్బుల్లో అందాల దివి
X

తెలుగు బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు దక్కించుకున్న నటి దివి. అంతకు ముందు దివి పలు సినిమాల్లో నటించినా కూడా జనాలు పెద్దగా గుర్తించే వారు కాదు. కానీ ఎప్పుడైతే ఈ అమ్మడు బిగ్‌బాస్ లో సందడి చేసిందో అప్పటి నుంచి సోషల్‌ మీడియాలో దివి పేరు మారుమ్రోగుతూనే ఉంది.

హీరోయిన్స్ కి ఏ మాత్రం తక్కువ కాదు అన్నట్లు ఉండే ఆమె అందం, అంతకు మించి అన్నట్లుగా ఆమె షేర్ చేసే అందాల ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతూ ఉంటాయి. తాజాగా మరోసారి ఈ అమ్మడి అందాల ఆరబోత ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఈసారి మేఘాలలో తేలి ఆడుతున్నట్లు ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది. నీటిలోనే దివి ఉన్నా కూడా ఫోటో ఎఫెక్ట్‌ మరియు ఆమె అందం మేఘాల్లో తేలి ఆడుతున్నట్లుగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతటి అందాల ముద్దుగుమ్మ కు రావాల్సిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదు... దక్కాల్సిన గుర్తింపు దక్కడం లేదు.

ఆ మధ్య చిరంజీవి సినిమాలో చిన్న పాత్రలో నటించింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చి పెట్టలేదు. రెండు మూడు వెబ్‌ సిరీస్‌ ల్లో కూడా ఈ అమ్మడు నటించి మెప్పించింది. కానీ బిజీ మాత్రం అవ్వడం లేదు. ముందు ముందు అయినా ఈ అందాల దివికి ఆఫర్లు వస్తాయేమో చూడాలి.