Begin typing your search above and press return to search.

జాకెట్ లేకుండా దివి అందాల కనువిందు

గిరిజన యువతి గెటప్ లో వెనక్కి తిరిగి అడవివైపు చూస్తూ జాకెట్ లేకుండా కాటన్ చీర కట్టుకొని బ్యాక్ లెస్ అందాలని చూపిస్తోంది.

By:  Tupaki Desk   |   23 Aug 2023 3:54 AM GMT
జాకెట్ లేకుండా దివి అందాల కనువిందు
X

టాలీవుడ్ లో నటిగా సక్సెస్ కావాలని ప్రయత్నాలు చేస్తోన్న తెలుగమ్మాయి దివి వాదిత్యా. ఈ బ్యూటీకి బిగ్ బాస్ తో మంచి ఫేమ్ వచ్చింది. ఆ తరువాత మంచి అవకాశాలు కూడా వచ్చాయి. ఏటీఎం అనే వెబ్ సిరీస్ దివికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. చిన్న చిన్న సినిమాలలో హీరోయిన్ గా రాణిస్తోంది. అయితే బ్రేక్ ఇచ్చే మూవీ ఒక్కటి కూడా పడటం లేదు. ఇదిలా ఉంటే ఈ బ్యూటీకి హీరోయిన్ గా ఆశించిన స్థాయిలో ఫేమ్ లేకపోయిన సోషల్ మీడియాలో మాత్రం సెన్సేషన్ అని చెప్పాలి.


ఇన్ స్టాగ్రామ్ లో ఇప్పటికప్పుడు తన అందాల ఫోటోలని పంచుకుంటూ కుర్రకారుకి చెమటలు పట్టిస్తూ ఉంటుంది. ఆమె ఒరకళ్ళతో చూస్తే వెయ్యి ఓల్టుల కరెంట్ కుర్రాళ్ళ గుండెల్లోకి ఎక్కేస్తుంది. చిరునవ్వుతో సిగ్గుపడితే అబ్బాయిల నిద్ర మాయమైపోతుంది. అంతలా ఆమె అందాలు కుర్రకారుకి వినోదం అందిస్తున్నాయి. అందుకే రెగ్యులర్ గా అవకాశం దొరికిన ప్రతిసారి ఇన్ స్టాగ్రామ్ లోగ్లామర్ షోకి తెరతీస్తూ ఉంటుంది.

తాజాగా ఈ బ్యూటీ పెట్టిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గిరిజన యువతి గెటప్ లో వెనక్కి తిరిగి అడవివైపు చూస్తూ జాకెట్ లేకుండా కాటన్ చీర కట్టుకొని బ్యాక్ లెస్ అందాలని చూపిస్తోంది. ఈ ఫోటో చూసిన అబ్బాయిలు క్లీన్ బౌల్డ్ అయ్యారని చెప్పొచ్చు. ఇక ఈ ఫోటోకి కవితాత్మకంగ అస్తమించే సూర్యుడితో రోజులు లెక్కపెట్టుకుంటూ.. నీ రాకకై ఎదురుచూస్తూ, నే నీకోసం చేస్తున్న నిరీక్షణ ఒక కొటేషన్ కూడా దివి రాసుకొచ్చింది.

ఈ కొటేషన్ చూసిన తర్వాత ఆమె లుక్ ఇంటెన్షన్ ఏంటనేది అర్ధమవుతోంది. అయితే ఈ స్టైల్ ఏదో సినిమాలోనిధి అయ్యుంటుందని అందరూ భావిస్తున్నారు. దివి చేస్తోన్న కొత్త సినిమాలోలా ఉందని కామెంట్స్ పెడుతున్నారు. ఈ ఫోటోపై నెటిజన్లు ఇంటరెస్టింగ్ కామెంట్స్ పెడుతున్నారు. వెనక్కి తిరిగి నీ అందాన్ని చూపించు అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు.

ఏది ఏమైనా తెలుగమ్మాయిలు ఒకప్పటిలా లేరని, సరైన సినిమా పడితే గ్లామర్ షో విషయంలో నార్త్ ఇండియన్ భామలతో సమానంగా పోటీ పడతామని దివి లాంటి బ్యూటీస్ చూపిస్తున్నారు. మరి వీరికి బ్రేక్ ఇచ్చే ప్రాజెక్ట్ ఎప్పుడు దొరుకుతుందనేది చూడాలి.