Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : అందాల దివి అదిరే షో

ప్రస్తుతం సోషల్ మీడియాలో అందాల దివి ఫోటో షూట్స్ ఎప్పటికప్పుడు వైరల్‌ అవుతూనే ఉన్నాయి

By:  Tupaki Desk   |   3 Dec 2023 3:30 PM GMT
పిక్ టాక్ : అందాల దివి అదిరే షో
X

బిగ్ బాస్ ద్వారా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ముద్దుగుమ్మ దివి. ఈ అమ్మడు బిగ్ బాస్ తో వచ్చిన క్రేజ్ ను సద్వినియోగం చేసుకుని సినిమాల్లో మరియు సిరీస్ ల్లో నటించే అవకాశాలు దక్కించుకుంది. అంతే కాకుండా సోషల్‌ మీడియా ద్వారా ఈ అమ్మడికి సాధ్యం అయినంత ఎక్కువ ఫాలోయింగ్ దక్కింది అనడంలో సందేహం లేదు.


ప్రస్తుతం సోషల్ మీడియాలో అందాల దివి ఫోటో షూట్స్ ఎప్పటికప్పుడు వైరల్‌ అవుతూనే ఉన్నాయి. తాజాగా మరో సారి ఫోటో షూట్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆకట్టుకునే అందాల షో తో దివి ఇచ్చిన ఈ ఫోటో షూట్ ఫోటోలు స్టార్‌ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా ఉన్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

బ్లాక్ అండ్‌ వైట్‌ లో కూడా దివి అందం తో మెరిసి పోతుంది అనడంలో సందేహం లేదు. ఈ రేంజ్ లో అందంగా బ్యాక్ తో పాటు థైస్ ను చూపిస్తున్న దివి షో కి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఈ రేంజ్ లో అందం తెలుగు అమ్మాయిల్లో దివికే సాధ్యం అంటూ కొందరు ఆమె ఫ్యాన్స్‌ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ రేంజ్ లో అందంగా ఉన్నా కూడా దివి వైపు ప్రముఖ హీరోలు చూడటం లేదు. ఒక వేళ పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చినా కూడా పెద్దగా ప్రాముఖ్యత లేని పాత్రల్లో ఆమె కనిపిస్తుందని నెటిజన్స్‌ మరియు ఆమె అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

టాలీవుడ్‌ లో కాకుండా ఇతర భాషల్లో దివి ప్రయత్నిస్తే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు. మరి దివి తమిళ సినీ ఇండస్ట్రీ వైపు చూస్తుందా అనేది చూడాలి.