సుధీర్ బ్యూటీ.. మైండ్ బ్లాక్ చేసేసిందిగా!
రొమాంటిక్ సీన్స్ లో ఓ రేంజ్ లో యాక్ట్ చేసి విపరీతంగా ఆకట్టుకున్నారు.
By: Tupaki Desk | 25 Oct 2024 3:00 AM GMTకోలీవుడ్ బ్యూటీ దివ్య భారతి.. తొలి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ డమ్ ను సంపాదించుకున్న విషయం తెలిసిందే. జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన బ్యాచిలర్ మూవీతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. మొదటి సినిమాతో సరైన హిట్ అందుకోలేకపోయినా.. యాక్టింగ్ తో మాత్రం మంచి మార్కులు కొట్టేశారు. తన సహజ నటనతో విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కించుకున్నారు. రొమాంటిక్ సీన్స్ లో ఓ రేంజ్ లో యాక్ట్ చేసి విపరీతంగా ఆకట్టుకున్నారు.
బ్యాచిలర్ మూవీలో సాంగ్స్ ఫుల్ పాపులర్ అయ్యాయి. పెన్నే పెన్నే సాంగ్ తో కుర్రకారును ఫిదా చేశారు దివ్యభారతి. ఆ తర్వాత 2022లో డైరెక్టర్ అంజనా అలీ ఖాన్ దర్శకత్వం వహించిన మధిల్ మేల్ కాదల్ చిత్రంతో మరింత ఫేమస్ అయ్యారు. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి మహారాజ చిత్రంలో క్యామియో రోల్ పోషించారు. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్నారు.
టాలీవుడ్ లో గోట్ మూవీలో ప్రస్తుతం సుధీర్ సరసన దివ్య భారతి యాక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఆ సినిమా నుంచి మేకర్స్ విడుదల చేసిన సాంగ్స్, పోస్టర్స్ తో దివ్య భారతి ఆకట్టుకున్నారు. అయితే సినిమాల్లోకి రాకముందు సీరియల్స్, షార్ట్ ఫిల్మ్స్ లో నటించిన ఆమె.. మోడల్ కూడా. అందుకే అందాల ఆరబోతలో తగ్గేదేలే అన్నట్లు సందడి చేస్తుంటారు. ఎప్పటికప్పుడు తన గ్లామరస్ పిక్స్ తో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తుంటారు.
నెట్టింట దివ్య భారతి గ్లామర్ ఫోటోలు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా బ్లాక్ కలర్ స్టైలిష్ డ్రెస్ లో దిగిన పిక్స్ ను షేర్ చేశారు. ప్రపంచంలో ప్రేమ అనేది ఆశ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. తన అందాలతో అందరినీ మైమరపించారు. తన లుక్స్ తో ఫిదా చేశారు. అందచందాలతో ఆకట్టుకున్నారు. రకరకాల పోజుల్లో అదరగొట్టారు. థై షోతో కుర్రాళ్లను ఫ్లాట్ చేశారు. గ్లోరియస్ స్కిన్ టోన్ తో మైండ్ బ్లాక్ చేశారు.
ప్రస్తుతం దివ్య భారతి కొత్త పిక్స్.. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు. కామెంట్ సెక్షన్ నింపేస్తున్నారు. మేడమ్ సర్ మేడమ్ అంతే అని కొనియాడుతున్నారు. ముద్దుగుమ్మ అందానికి ఫ్లాట్ అయ్యామని చెబుతున్నారు. తెలుగులో మంచి అవకాశాలు అందుకోవాలని ఆశిస్తున్నారు. మరి దివ్య భారతి.. ఫ్యూచర్ లో ఎలాంటి అవకాశాలు అందుకుంటారో వేచి చూడాలి.