Begin typing your search above and press return to search.

రాత్రంతా గ‌డ‌పాల‌ని కండీష‌న్ పెట్టాడు!

ఒక‌నొక స‌మ‌యంలో అవకాశాలు లేక‌..చేతిలో డబ్బు లేక ఒత్తిడికి లోన‌య్యాను. ఆ స‌మ‌యంలో అవ‌కాశం అంటూ ఒక‌రు ముందుకొచ్చారు

By:  Tupaki Desk   |   15 April 2024 12:30 PM GMT
రాత్రంతా గ‌డ‌పాల‌ని కండీష‌న్ పెట్టాడు!
X

ఇండ‌స్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అంశం అప్ప‌ట్లో ఎంత సంచ‌ల‌న‌మైందో తెలిసిందే. మీటూ ఉద్య‌మంలో భాగంగా త‌మ‌కెదురైన అనుభ‌వాల్ని న‌టీన‌టులంతా ఓపెన్ అయ్యారు. స్టార్ భామ‌ల ద‌గ్గ‌ర నుంచి చిన్న స్థాయి..టీవీ న‌టీమ‌ణుల వ‌ర‌కూ అంతా ఓపెన్ అయిన వారే. ఇప్ప‌టికీ ఎవ‌రో ఒక‌రు బాధిత మ‌హిళ‌లు తెర‌పైకి వ‌స్తూనే ఉన్నారు. తాజాగా టీవీ నటి దివ్యాంక త్రిపాఠి దహియా కాస్టింగ్ కౌచ్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. కెరీర్ ఆరంభంలో చాలా మంది లైంగికంగా లొంగ‌దీసుకోవాల‌ని ప్ర‌య‌త్నించిన‌ట్లు ఆరోపించారు.

ఒక‌నొక స‌మ‌యంలో అవకాశాలు లేక‌..చేతిలో డబ్బు లేక ఒత్తిడికి లోన‌య్యాను. ఆ స‌మ‌యంలో అవ‌కాశం అంటూ ఒక‌రు ముందుకొచ్చారు. తీరా అక్క‌డికి వెళ్లాక డైరెక్ట‌ర్ తో ఒక రాత్రంతా గ‌డ‌పాల‌ని కండీష‌న్ పెట్టారు. ఆ త‌ర్వాత మంచి అవ‌కాశం ఉంటుంద‌ని...ఇండ‌స్ట్రీలో మంచి లైఫ్ కూడా ఉంటుంద‌ని భ‌రోసా ఇచ్చారు. కానీ అందుకు నా మ‌న‌సు అంగీక‌రించ‌లేదు. అవ‌కాశం పేరుతో మోసం చేయాల‌నే వాళ్ల బుద్ది ప‌సిగ‌ట్టాను. ఇలాంటి వారు నాకే కాదు చాలా మందికి ఎదుర‌య్యే ఉంటారు. అలాంటి వారి బెదిరింపుల‌కు భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు.

అవ‌కాశం రావ‌డం ఆల‌స్య‌మైనా? ట్యాలెంట్ ఉంటే క‌చ్చితంగా ఏదో ఒక‌రు గుర్తించి అవ‌కాశాలిచ్చేవారు ఉన్నారు. అలాంటి వారి దృష్టిలో ప‌డేందుకు నిరంత‌రం ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉండాలి. అవ‌కాశం పేరుతో లైంగిక బెదిరింపుల‌కు పాల్ప‌డేవారిపై ప్ర‌త్యేక చ‌ట్టాలు తీసుకొచ్చి శిక్షించాలి. అప్పుడే ఇండ‌స్ట్రీలో మార్పులొస్తాయి. సినిమా వ‌ర‌ల్డ్ లో ఇలాంటివి కామ‌న్ అనే వారు త‌గ్గుతారు' అని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ప్ర‌స్తుతం ఆ వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

కాస్టింగ్ కౌచ్ ఉంద‌ని పేరున్న చాలా మంది హీరోయిన్లు అన్నారు. లేద‌ని ఖండించిన వారు ఉన్నారు. దివ్యాంక త్రిపాఠి హిందీ సీరియల్స్ బాగా ఫేమ‌స్ ఆర్టిస్ట్. 'లో యే హై మొహబ్బతేన్' సీరియల్‌తో ఆమె కు మంచి గుర్తింపు ద‌క్కింది. ప్ర‌స్తుతం 'అదృశ్యం' అనే సీరియల్‌లో న‌టిస్తున్నారు. బుల్లి తెర‌పై అత్య‌ధిక పారితోషికం అందుకుంటోన్న భామ‌గానూ ఆమె పేరిట రికార్డుంది.