యూఎస్ లో పుష్ప 2 ప్రీమియర్ టికెట్ ధరలు ఎంతంటే?
తెలుగు వెర్షన్ ని ఎక్స్.డి స్క్రీన్స్ లో ఒక్కో టికెట్ ధర 31.89 డాలర్లుగా నిర్ణయించారు. స్టాండర్డ్ స్క్రీన్స్ లలో 26.89 డాలర్లకి టికెట్స్ అమ్ముతున్నారు.
By: Tupaki Desk | 3 Nov 2024 8:26 AM GMTయూఎస్ లో ఎక్కువగా ఎక్కువ పబ్లిక్ అటెన్షన్ ఉన్న ఈవెంట్ సినిమాల టికెట్స్ ని భారీ ధరలకి అమ్ముతారు. ముఖ్యంగా హాలీవుడ్ సినిమాలకి మాత్రమే గతంలో ధరలు పెంచుకునే సౌలభ్యం ఉందేది. అయితే ఇండియాలో బ్రాండ్ క్రియేట్ అయ్యాక యూఎస్ లో కూడా సినిమాలకి ఆదరణ పెరిగింది. జక్కన్న సినిమాల టికెట్ ధరలు పెంచుకునే అవకాశం ఉండేది. ఆయన సినిమాలపై ప్రత్యేక ఆసక్తి ఉండటంతో ప్రీమియర్ షోల టికెట్ ధరలని పెంచి అమ్మేవారు.
అయితే పాన్ ఇండియా ట్రెండ్ వచ్చిన తర్వాత ముఖ్యంగా తెలుగు హీరోల సినిమాలకి యూఎస్ లో డిమాండ్ పెరిగింది. అక్కడ మన పాన్ ఇండియా సినిమాలకి ప్రీమియర్స్ షోలు భారీగానే వేస్తున్నారు. పబ్లిక్ నుంచి కూడా ఈ ప్రీమియర్ షోలకి విపరీతమైన స్పందన వస్తోంది. అందుకే తెలుగు పాన్ ఇండియా హీరోల సినిమాల ప్రీమియర్ షోల టికెట్స్ ఎక్కువ ధరకి అమ్మడం మొదలయ్యింది. ఈ ఏడాది రిలీజ్ అయిన ప్రభాస్ ‘కల్కి 2898ఏడీ’ మూవీకి టికెట్ ధరలు పెంచి అమ్మారు.
ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ ‘దేవర టికెట్ ధరలు కూడా ఎక్కువగానే నిర్ణయించి నెల రోజులు ముందుగానే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. ఇప్పుడు పుష్ప 2 మూవీ ప్రీమియర్ షోలకి సంబందించిన అడ్వాన్స్ బుకింగ్స్ లలో కూడా టికెట్స్ ని భారీ ధరకి అమ్ముతున్నారు. తెలుగు వెర్షన్ ని ఎక్స్.డి స్క్రీన్స్ లో ఒక్కో టికెట్ ధర 31.89 డాలర్లుగా నిర్ణయించారు. స్టాండర్డ్ స్క్రీన్స్ లలో 26.89 డాలర్లకి టికెట్స్ అమ్ముతున్నారు.
హిందీ వెర్షన్ 18.89 డాలర్స్ గా ధర నిర్ణయించారు. టికెట్ రేట్లు అధికంగా ఉన్న కూడా ప్రీమియర్ షోలకి బుకింగ్స్ మాత్రం అద్భుతంగా జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు యూఎస్ లో ప్రీమియర్ షోలకి 3400 టికెట్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అమ్ముడయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి వచ్చే ఆదరణ బట్టి సంక్రాంతికి రాబోయే రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ టికెట్ ధరలు కూడా నిర్ణయించే అవకాశం ఉందని అనుకుంటున్నారు.
ఏది ఏమైనా ఐకాన్ స్టార్ క్రేజ్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు, నార్త్ లోనే కాకుండా ఓవర్సీస్ కి కూడా పాకిందని అడ్వాన్స్ బుకింగ్స్ కి వస్తోన్న ఆదరణ బట్టి స్పష్టం అవుతోంది. ఇదే రీతిలో టికెట్ బుకింగ్స్ జరిగితే ‘పుష్ప 2’ ప్రీమియర్ షోల ద్వారానే యూఎస్ లో 5 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.