సారా టెండూల్కర్ వయసెంతో తెలుసా?
2024 అక్టోబర్ 12 నాటికి సారా 27వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా తన తల్లి అంజలితో కలిసి బర్త్ డే సెలబ్రేషన్స్ లో ఉన్నప్పటి ఫోటో ఒకటి అంతర్జాలంలో వైరల్ అయింది.
By: Tupaki Desk | 15 Oct 2024 3:40 PM GMTలెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ ఎప్పుడూ తన స్టైల్‌తో ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది. ఒక బాలీవుడ్ స్టార్ కిడ్ కి ఏమాత్రం తీసిపోని అందం తన సొంతం. టీనేజ్‌లో సారా అందచందాలు మతులు చెడగొడుతున్నాయి. ఇటీవల మోడల్ గా సారా ఆర్జన గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. సారా మోడలింగ్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్, వ్యాపారం సహా ఇన్‌స్టా ప్రమోషన్ ద్వారా డబ్బు సంపాదిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 7.1 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. నిజానికి సారా వైద్య విద్యను అభ్యసించింది. అయితే గ్లామర్ ప్రపంచానికి పరిచయమైంది. ఇప్పటికే సారా కొన్ని ప్రకటనల ద్వారా కోటిన్నర ఆర్జించిందని మీడియాలో కథనాలొచ్చాయి. 2024 అక్టోబర్ 12 నాటికి సారా 27వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా తన తల్లి అంజలితో కలిసి బర్త్ డే సెలబ్రేషన్స్ లో ఉన్నప్పటి ఫోటో ఒకటి అంతర్జాలంలో వైరల్ అయింది. సారా బర్త్ డే కేక్ కట్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాల్లో వైరల్ అవుతున్నాయి.
12 అక్టోబర్ సారా పుట్టిన తేదీ. సచిన్ టెండూల్కర్ - డా. అంజలి టెండూల్కర్ దంపతులకు జన్మించారు. సారాకు ఒక సోదరుడు కూడా ఉన్నాడు. అర్జున్ టెండూల్కరన్ తన తండ్రి వారసత్వాన్ని ముందుకు తీసుకుని వెళుతూ క్రికెట్‌లో తన కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. మరోవైపు సారా కోరిక మేరకు వైద్య విద్యను అభ్యసించింది. ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ నుండి తన విద్యను పూర్తి చేసిన తర్వాత, సరన్ బయోమెడికల్ సైన్సెస్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందింది. యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్- లండన్ నుండి క్లినికల్ అండ్ పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్‌లో మాస్టర్స్ పూర్తి చేసింది. సారా AfN-సర్టిఫైడ్ అసోసియేట్ న్యూట్రిషనిస్ట్ (ANutr) .. ఆరోగ్య రంగంపై దృష్టి సారించి ఫంక్షనల్ న్యూట్రిషన్ కోచ్‌గా మారడం ద్వారా తన నైపుణ్యాలను మరింత అభివృద్ధి చేసుకోవాలని చూస్తోంది. కానీ సారా కేవలం పోషకాహార నిపుణురాలు మాత్రమే కాదు మోడల్ కూడా.
సారా టెండూల్కర్ 2021లో ఆజియో లక్స్ తో మోడలింగ్ ప్రారంభించింది. అప్పటి నుండి మోడలింగ్ ప్రపంచంలో పాపులర్ ఫేస్ గా మారింది. అనేక జాతీయ, అంతర్జాతీయ ఫ్యాషన్ షోల వేదికపై ఆమె అందాల మాయాజాలం యువతరాన్ని గిలిగింతలు పెట్టింది. అంతే కాదు.. సారా వ్యాపారవేత్తగాను కెరీర్ ప్రారంభించింది. తన పేరుతో డైరీలను విక్రయిస్తూ సారా `ప్లానర్స్` అనే ఆన్‌లైన్ వ్యాపారాన్ని ప్రారంభించింది. లెజెండరీ క్రికెటర్ కుమార్తె ఒరిజినాలిటీ అందరికీ నచ్చుతుంది. తన స్వశక్తితో కోట్లాది రూపాయల సంపదను సృష్టిస్తోంది.