RRR తెరవెనక కథ..!
ఐతే ఈ సినిమా తెర వెనక జరిగిన కథ గురించి రాజమౌళి ఒక డాక్యుమెంటరీ రూపంలో సిద్ధం చేస్తున్నారు.
By: Tupaki Desk | 9 Dec 2024 10:03 AM GMTబాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిన సినిమా RRR. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరిని కలిపి ఒక సినిమాలో అది కూడా ఇద్దరికీ సమానమైన పాత్రలు వచ్చేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. ట్రిపుల్ ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమరం భీం గా తారక్ అదరగొట్టారు. సినిమాలో నటించిన ఇద్దరి హీరోలకు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్నట్టు కాకుండా ఇద్దరికీ ఈక్వల్ ప్రియారిటీ ఇచ్చాడు జక్కన్న. ఐతే బాహుబలి తో ఇంటర్నేషనల్ మార్కెట్ లో కేవలం చర్చలు మాత్రమే జరిగేలా చేసిన రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమా తో ఆస్కార్ వచ్చేలా చేశాడు.
సినిమాలో నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ క్యాంపెయిన్ లో మన సినిమా గురించి ఇంటర్నేషనల్ లెవెల్ లో డిస్కషన్ జరిగింది. అవతార్ మేకర్ జేమ్స్ కామెరూన్ కూడా రాజమౌళి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఐతే RRR సినిమా బాక్సాఫీస్ రికార్డులు తెలిసిందే. ఐతే ఈ సినిమా తెర వెనక జరిగిన కథ గురించి రాజమౌళి ఒక డాక్యుమెంటరీ రూపంలో సిద్ధం చేస్తున్నారు.
త్వరలోనే ఆ డాక్యుమెంటరీ రాబోతుంది. సినిమా తెర మీద అద్భుతాలు చేసింది. కానీ తెర వెనక జరిగిన విషయాల గురించి ఈ డాక్యుమెంటరీలో చూపించనున్నారు. అసలు ఇద్దరు హీరోలు సినిమాకు ఎలా ఒప్పుకున్నారు. వారికి జక్కన్న ఏం చెప్పి ఒప్పించాడు. ఆ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ ని ఎలా సాటిస్ఫై చేయాలని అనుకున్నాడు. ఇలా ప్రతి విషయాన్ని ఈ డాక్యుమెంటరీలో చూపించబోతున్నారు.
బియాండ్ సీక్రెట్ తో ఆర్.ఆర్.ఆర్ బిహైడ్ & బియాండ్ అంటూ ఒక డాక్యుమెంటరీ రాబోతుంది. దీనికి సంబంధించి అఫీషియల్ అపేట్ ఇచ్చారు ఆర్.ఆర్.ఆర్ మూవీ నిర్మాతలు. RRR ట్విట్టర్ హ్యాండిల్ నుంచి రాజమౌళి ఉన్న పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఐతే ఈ డాక్యుమెంటరీలో ఎందులో రిలీజ్ అవుతుంది. ఇది చేయడానికి వెనక రీజన్స్, ఇనంకా ఈ డాక్యుమెంటరీలో ఏయే అంశాలు చర్చిస్తున్నారు.
రాజమౌళి RRR సినిమా మరోసారి ఆయన డైరెక్షన్ లో మహేష్ తో ప్లాన్ చేశారు. 2025 ఏప్రిల్ లో మహేష్, జక్కన్న సినిమా షూటింగ్ మొదలు పెడతారని తెలుస్తుంది. ఈ సినిమాకు హాలీవుడ్ టెక్నిషియన్స్ కూడ్డ పనిచేయబోతున్నారు. బడ్జెత్ కూడా 1000 కోట్ల దాకా కేటాయించే ప్లాన్లో ఉన్నారట. సో అక్కడ ఉంది రాజమౌళి కాబట్టి ఏదైనా చేసేయొచ్చు అనే ధైర్యం ఉంటుంది.