Begin typing your search above and press return to search.

డాక్యు సిరీస్: వైఫ్‌తో స్టార్ హీరో గొడ‌వ‌లు కీచులాటలు

'డెప్ వి. హియర్డ్' పేరుతో దీని ని రిలీజ్ చేస్తోంది. తాజ‌గా ట్రైల‌ర్ విడుద‌లైంది.

By:  Tupaki Desk   |   28 July 2023 5:31 PM GMT
డాక్యు సిరీస్: వైఫ్‌తో స్టార్ హీరో గొడ‌వ‌లు కీచులాటలు
X

2022లో భార్య అంబర్ హర్డ్ పై జానీ డెప్ పరువు నష్టం దావా విచారణ ఇంటర్నెట్ లో ప్ర‌పంచం దృష్టిని ఆకర్షించింది. ఈ దావా లో నెగ్గి జానీ డెప్ భారీ మొత్తం లో ప‌రిహారాన్ని పొందాడు డెప్. అయితే భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య జరిగిన గొడ‌వ‌ల‌ పై విచార‌ణ దాని నేప‌థ్యం స‌హా డ‌ర్టీ పిక్చ‌ర్ మొత్తాన్ని ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ డాక్యు సిరీస్ రూపం లో తెర‌కెక్కించింది. 'డెప్ వి. హియర్డ్' పేరుతో దీని ని రిలీజ్ చేస్తోంది. తాజ‌గా ట్రైల‌ర్ విడుద‌లైంది. ఇది ఊహించిన విధంగానే రివర్టింగ్‌ గా రూపొందింది.

ఆరు వారాల పాటు సాగిన కీల‌క‌మైన కోర్టు విచార‌ణ‌ లో చివరికి జానీ డెప్ తన మాజీ భార్య అంబర్ హర్డ్‌ పై దావాలో విజేతగా నిలిచాడు. వివాహం అనంత‌రం తాను గృహ హింస కు గురైనట్లు అంబర్ ఆరోపిస్తూ ఆరు సంవత్సరాలుగా న్యాయ పోరాటం కొనసాగిస్తోంది. ఈ క‌థ మొత్తాన్ని డాక్యు సిరీస్ లో చూపిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ మూడు-భాగాల డాక్యుమెంటరీ సిరీస్‌ను 'డెప్ వి. హియర్డ్' పేరుతో ఆగస్టు 16న విడుదల చేయనుంది. ఈ డాక్యుమెంటరీ జానీ డెప్- అంబర్ హర్డ్‌ల వివాదాని కి సంబంధించిన‌ సాక్ష్యాల ను లోతుగా పరిశోధిస్తుంది. ప్రపంచ దృష్టిని ఆకర్షించిన అత్యంత-పాపుల‌ర్ ట్రయల్ ని మళ్లీ ప్ర‌జ‌లు వీక్షించే అవ‌కాశం ఓటీటీ లో క‌ల‌గ‌నుంది. డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ ఎమ్మా కూపర్ దర్శకత్వం లో బిటాచోన్ 365 అండ్ ఎంప్రెస్ ఫిల్మ్స్ నిర్మించిన 'డెప్ వి. హియర్డ్' డాక్యు సిరీస్ వీక్ష‌ణ కోసం ప్ర‌పంచ‌వ్యాప్తంగా జానీ డెప్ అభిమానులు వేచిచూస్తున్నారు. ఇది ఆగస్ట్ 16న విడుదలవుతోంది.

జానీ డెప్ - అంబర్ హర్డ్ మధ్య ఏమి జరిగింది?

జానీ డెప్ - అంబర్ హర్డ్ మధ్య రిలేష‌న్ షిప్ 2009లో 'ది రమ్ డైరీ'లో పని చేస్తున్నప్పుడు ప్రారంభమైంది. కొన్ని సంవత్సరాల తర్వాత వారు డేటింగ్ ప్రారంభించారు. 2015లో వివాహం చేసుకున్నారు. అయితే వివాహం అనంత‌రం అంబర్ తాను భ‌ర్త వ‌ల్ల‌ శారీరక వేధింపులకు గురైన‌ట్టు ఆరోపించింది. దాని ని డెప్ ఖండించారు.

ఈ జంట విడాకులు 2017లో ఖరారయ్యాయి. తర్వాత జానీ డెప్ 2018లో వాషింగ్టన్ పోస్ట్ లో త‌న భార్య‌ రాసిన 'ఆప్-ఎడ్‌'పై అంబర్ హియర్డ్‌ పై పరువు నష్టం దావా వేసాడు. ఆప్-ఎడ్ లో హియర్డ్ తన ను తాను గృహహింస బాధితురాలిగా అభివర్ణించింది కానీ దానిని ప్రూవ్ చేయ‌లేక‌పోయింది. డెప్ వి. హియర్డ్ డాక్యుసీరీలు ఇద్దరు ప్రముఖుల మధ్య ఉన్నత స్థాయి చట్టపరమైన వివాదం - సంక్లిష్టమైన డైనమిక్స్‌పై సమగ్ర రూపాన్ని ఆవిష్క‌రించింద‌ని స‌మాచారం.