నేషనల్ క్రష్ మాజీని అలా గుర్తు చేసుకుంటుందా!
మరి అలాంటి మధుర జ్ఞాపకంగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నాకి ఏదైనా ఉందా? అంటే ఉందం టోంది.
By: Tupaki Desk | 1 Jan 2025 11:30 PM GMTసెలబ్రిటీలంతా గ్రాండ్ గా న్యూ ఇయర్ కి వెల్కమ్ చెప్పేసారు. కొత్త ఏడాదిలో జీవితం మరింత సంతోషంగా సాగి పోవాలని కోరుకుంటున్నారు. గత జ్ఞాపకాలను పదిలం చేసుకుని కొత్త ఏడాది అందించే జ్ఞాపకాల కోసం ఎదురు చూస్తున్నారంతా. మరి అలాంటి మధుర జ్ఞాపకంగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నాకి ఏదైనా ఉందా? అంటే ఉందం టోంది. డిసెంబర్ 30వ తేదీని జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను అంటోంది.
ఆరోజు అమ్మడు నటించిన తొలి సినిమా రిలీజ్ అయిన డే కావడంతో జీవితాంతం అదో మధుర జ్ఞాపకంగా పేర్కోంది. అదే సినిమా ఆమె జీవితాన్ని కూడా మార్చేసింది. నేడు నేషనల్ క్రష్ గా నీరాజనాలు అందుకుంటుంది అంటే? ఆ సినిమా విజయంతోనే సాధ్యమైందీ జీవితం. అమ్మడి తొలి సినిమా కన్నడలో నటించిన 'కిరీక్ పార్టీ'. అందులో హీరోగా నటించింది రక్షిత్ శెట్టి. ఆమెని హీరోయిన్ చేసిందే రక్షిత్ శెట్టి. శాండిల్ వుడ్ లో ఆ సినిమా మంచి విజయం సాధించింది.
`కిరీక్ పార్టీ` సమయంలోనే రక్షిత్ శెట్టితోనే అమ్మడు ప్రేమలోనూ పడింది. ఇద్దరు చాలా కాలం ప్రేమించుకున్నారు. నిశ్చితార్దం కూడా జరిగింది. కానీ టాలీవుడ్ బెడ్యూ `ఛలో` తర్వాత సీన్ మారిపోయింది. నటిగా తెలుగులో బిజీ అవ్వడం...కొన్నాళ్లకు రక్షిత్ తో ప్రేమాయణం వికటించడం..అటుపై నిశ్చితార్దం క్యాన్సిల్ అవ్వడం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్మిక చాలా విమర్శలు ఎదుర్కుంది.
కెరీర్ కోసమే రక్షిత్ కి దూరమైంది? అన్న విమర్శ ప్రధానంగా హైలైట్ అయింది. చివరికి రక్షిత్ అభ్యర్ధన మేరకు విమర్శలకు పుల్ స్టాప్ పడింది. ఇదంతా రష్మిక వ్యక్తిగత జీవితంలో ఓ భాగం. ప్రస్తుతం రష్మిక కెరీర్ దేదీప్యమానంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే. పుష్పతో పాన్ ఇండియాలో ఎంతో ఫేమస్ అయింది. బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తోంది. నటిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది.