రష్మికకి అంత సత్తా ఉందా?
అంతకు ముందు 'గుడ్ బై' ..'మిషన్ మజ్ను' లాంటి చిత్రాల్లోనూ నటించగల్గింది. ఇనవ్నీ పుష్పతో పాటు ప్రతిభతో దక్కించుకున్న అవకాశాలు
By: Tupaki Desk | 23 Oct 2023 4:30 PM GMT'పుష్ప' విజయంతో వ్వాటే బ్యూటీ రష్మిక మందన్న పాన్ ఇండియాలో ఫేమస్ అయింది. ఆ క్రేజ్ తోనే బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంటుంది. `యానిమల్` లో నటించే ఛాన్స్ వచ్చిందంటే? కారణం అమ్మడి ట్యాలెంట్ తోనే సాధ్యమైంది. ఇంకా లైనప్ లోకొన్ని ప్రాజెక్ట్ లున్నాయి. అంతకు ముందు 'గుడ్ బై' ..'మిషన్ మజ్ను' లాంటి చిత్రాల్లోనూ నటించగల్గింది. ఇనవ్నీ పుష్పతో పాటు ప్రతిభతో దక్కించుకున్న అవకాశాలు.
అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే ఇప్పుడిప్పుడే లేడీ ఓరియేటెండ్ నాయికగానూ ఎదిగే ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే` రెయిన్` అనే సినిమా చేస్తుంది. తాజాగా `ది గర్ల్ ప్రెండ్` అనే కొత్త చిత్రాన్ని కూడా పట్టాలెక్కించింది. ఈ రెండు కూడా తెలుగు సినిమాలో. కేవలం రష్మిక క్రేజ్ తో దక్కించు కున్న అవకాశాలే. మరి ఈ బ్యూటీ సోలోగా థియేటర్ కి ప్రేక్షకుల్ని రప్పించగలదా? అన్నది ఎంతవరకూ సాధ్యమవుతుందో చూడాలి.
ఇప్పటివరకూ స్టార్ హీరోల సరసన మెటించి తనదైన మార్క్ వేసింది. నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంది. కానీ సోలోగా సత్తా చాటింది లేదు. `సీతారామం` లాంటి సినిమాలో కీలకమైన ఆప్రిన్ పాత్రతో ఆకట్టుకున్న వైనం మాత్రం ప్రశంసనీయం. అది సపోర్టింగ్ రోల్ అయినా తనదైన పెర్పార్మెన్స్ తో ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేసింది. ఈ పాత్ర సినిమాకి అనవసరం అని ఎక్కడా అనిపించదు.
ఆ పాత్ర సినిమాకి వన్నె తీసుకొచ్చింది తప్ప! నెగిటివ్ ఫీడ్ బ్యాక్ తేలేదు. ఆ కోణంలో చూస్తే రష్మిక సోలోగా సత్తా చాటగల సమర్ధవంతురాలే ఎనలిస్టులు భావిస్తున్నారు. అమ్మడి కటౌట్ చిన్నదైనా... ట్యాలెంట్ తో నెట్టుకొచ్చేసే సమర్దవంతురాలే అనే టాక్ ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తుంది. పుష్పలో శ్రీవల్లి లాంటి యారోగెంట్ రోల్ తన స్థాయిని పెంచిన పాత్రే. అవకాశం వచ్చిన ప్రతీసారి అమ్మడు తనని తాను నిరూపించుకుంటూ ముందుకెళ్తుంది.
రష్మిక తొలి నుంచి నటనకు ఆస్కారం ఉన్న చిత్రాలే చేసింది. కమర్శియల్ యాస్పెక్ట్ లో కొన్ని సినిమాలు చేసినా వాటిలోనూ ప్రత్యేకతని చాటా ప్రయత్నం చేసింది. అలాంటి నటికి నటిగా సోలోగా సత్తా చాటే బాధ్యతలు అప్పగిస్తే నూరుశాతం న్యాయం చేస్తుందనే పాజిటివ్ సైన్ పడుతుంది. మరి రష్మిక జర్నీ ఆ రకంగా ఎలా సాగుతుందో చూడాలి.