విషాదం : క్యాన్సర్ తో నటి కన్నుమూత
క్యాన్సర్ బారిన పడ్డ సెలబ్రిటీల్లో కొందరు తిరిగి మామూలు పరిస్థితికి వచ్చారు.
By: Tupaki Desk | 8 March 2024 9:32 AM GMTఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు, టీవీ రంగానికి చెందిన వారు క్యాన్సర్ బారిన పడ్డట్లు వార్తలు రెగ్యులర్ గా చూస్తూ ఉన్నాం. క్యాన్సర్ బారిన పడ్డ సెలబ్రిటీల్లో కొందరు తిరిగి మామూలు పరిస్థితికి వచ్చారు. కానీ కొందరు మాత్రం తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.
ఇటీవల నటి పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్ తో చనిపోయినట్లుగా ఫ్రాంక్ చేసిన విషయం తెల్సిందే. ఆ క్యాన్సర్ గురించి పూనమ్ అవగాహణ కల్పించేందుకు అలా చేసింది. ఆమె పై ఆ సమయంలో విమర్శలు వచ్చాయి. అదే సమయంలో ఆ క్యాన్సర్ గురించి చర్చించడం జరిగింది.
ఇప్పుడు అదే క్యాన్సర్ తో బుల్లి తెర ద్వారా సుపరిచితురాలు అయిన నటి డాలీ సోహి మృతి చెందారు. హిందీ బుల్లితెరపై తనదైన ముద్ర వేసిన 48 ఏళ్ల డాలీ సోహి గత ఆరు నెలలుగా క్యాన్సర్ తో పోరాటం చేస్తున్నారు. గర్భాశయ క్యాన్సర్ తో డాలీ తుది శ్వాస విడిచారు.
ముంబైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో క్యాన్సర్ కి చికిత్స తీసుకుంటూనే ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు దృవీకరించారు. ఆ కుటుంబంలో మరో విషాదకర సంఘటన ఏంటి అంటే డాలీ చనిపోవడానికి ఒక్క రోజు ముందే ఆమె సోదరి తీవ్రమైన జాండీస్ కారణంగా మృతి చెందారు.
ఒక్క రోజు వ్యవధిలో సిస్టర్స్ చనిపోవడంతో ఆ కుటుంబం పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు డాలీ సోహి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆమె మృతికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా డాలీ ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ నివాళ్లు అర్పిస్తున్నారు.