'సలార్' ఆధిపత్యాన్ని వీళ్లు సహించలేరా?
అయితే హిందీ మీడియాలో, ట్రేడ్ విశ్లేషకుల్లో కొందరు అదే పనిగా సలార్ ని టార్గెట్ చేస్తూ నెగెటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు.
By: Tupaki Desk | 19 Dec 2023 4:38 AM GMTడార్లింగ్ ప్రభాస్ నటించిన 'సలార్' కింగ్ ఖాన్ నటించిన డంకీతో పోటీపడుతూ అత్యంత భారీగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ సలార్ ఓపెనింగుల్లో కింగ్ ఖాన్ డంకీని అధిగమిస్తుందని ఇప్పటికే సమీక్షకులు చెబుతున్నారు. అయితే హిందీ మీడియాలో, ట్రేడ్ విశ్లేషకుల్లో కొందరు అదే పనిగా సలార్ ని టార్గెట్ చేస్తూ నెగెటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. అదే సమయంలో షారూఖ్ డంకీకి హైప్ పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.
నిజానికి సలార్ హిందీ వెర్షన్ వసూళ్లను, డంకీ హిందీ వెర్షన్ వసూళ్లతో మాత్రమే పోల్చి చూడాలని ఇతర భాషల కలెక్షన్స్ ని జోడించవద్దని ప్రజలకు కొందరు ట్రేడ్ అనలిస్టులు సూచిస్తున్నారు. కింగ్ ఖాన్ షారూఖ్ నటించిన డంకీ కేవలం హిందీ బెల్ట్ లో మాత్రమే విడుదలవుతోంది. దక్షిణాదిన ఈ చిత్రం విడుదల కావడం లేదు.. అందువల్ల ఓపెనింగు రికార్డులను సలార్ తో పోల్చవద్దంటూ ప్రచారం చేస్తున్నారు.
అయితే ఈ ప్రచారంతో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి? అంటే.. దక్షిణాది స్టార్ల మనుగడను లేదా ఆధిపత్యాన్ని సహించేందుకు ఇంకా హిందీ మీడియా కానీ, అక్కడ స్టార్లు కానీ సిద్ధంగా లేరు. డంకీకి ఇచ్చే హైప్ ని సలార్ కి ఇచ్చేందుకు కూడా వారు సిద్ధంగా లేరు. ఇంతకుముందు ప్రభాస్ నటించిన సాహో విషయంలోను ఇలానే జరిగింది. ఈ సినిమా రిలీజ్ రోజున క్రిటిక్స్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. కానీ ప్రభాస్ స్టామినా ముందు అవేవీ పని చేయలేదు. సాహో చిత్రం హిందీ బెల్ట్ లో అసాధారణ విజయం సాధించింది. నిజానికి దక్షిణాది కంటే హిందీ బెల్ట్ నుంచే భారీ వసూళ్లను సాధించింది. అలాగే పుష్ప చిత్రం కూడా హిందీ వెర్షన్ బిగ్గెస్ట్ హిట్ అయింది. ఈ సినిమా దక్షిణాదిన అంతంత మాత్రమేనని కూడా హిందీ మీడియాలు, ట్రేడ్ ప్రచారం సాగించాయి. ఏది ఏమైనా మన స్టార్ల ఆధిపత్యాన్ని సహించేందుకు ఇంకా వారు అలవాటు పడాల్సి ఉంది.
సలార్ ఈ క్రిస్మస్ సెలవులు సద్వినియోగం చేసుకుని భారీ ఓపెనింగులను సాధించనుందని తెలుస్తోంది. హిందీ వెర్షన్ తో పాటు తెలుగు-తమిళం-మలయాళం-కన్నడం నుంచి సలార్ భారీ వసూళ్లను సాధించనుంది. హిందీ బెల్ట్ లో డంకీని మించి క్రిస్మస్ వారాంతంలో వసూలు చేస్తుందని అంచనా. అందుకే హిందీ ట్రేడ్ కానీ క్రిటిక్స్ కానీ ముందు జాగ్రత్తగా సలార్ కలెక్షన్లతో డంకీ కలెక్షన్లను పోల్చవద్దని సూచిస్తున్నారు. డే వన్ ఓపెనింగులు ఎలా ఉన్నా కానీ సెలవు దినాల్లో సలార్ హవా సాగించడం ఖాయమని అంతా భావిస్తున్నారు.