Begin typing your search above and press return to search.

ర‌ణ‌వీర్ డాన్ 3లో గ్లోబ‌ల్‌స్టార్?

రణవీర్ సింగ్ నెక్ట్స్ డాన్ అని ద‌ర్శ‌క‌ నిర్మాత‌ ఫర్హాన్ అక్తర్ గతంలో ప్రకటించారు. డాన్ 3 ప్రకటన ఫ్రాంచైజీ అభిమానులను కలవరపెట్టింది

By:  Tupaki Desk   |   7 Nov 2023 11:30 PM GMT
ర‌ణ‌వీర్ డాన్ 3లో గ్లోబ‌ల్‌స్టార్?
X

రణవీర్ సింగ్ నెక్ట్స్ డాన్ అని ద‌ర్శ‌క‌ నిర్మాత‌ ఫర్హాన్ అక్తర్ గతంలో ప్రకటించారు. డాన్ 3 ప్రకటన ఫ్రాంచైజీ అభిమానులను కలవరపెట్టింది. ఎందుకంటే వారు షారుఖ్ ఖాన్ తన పాత్రను తిరిగి పోషించాలని కోరుకున్నారు. ప్రియాంక చోప్రా రోమా పాత్రకు ఏ నటి సరిపోతుందో చూడాల‌ని కూడా ఫ్యాన్స్ చర్చించుకోవడం ప్రారంభించారు. ఇంత‌లోనే అలాంటి వారికి శుభవార్తగా, ఈ చిత్రం కోసం ప్రియాంక చోప్రాను తీసుకున్నట్లు సమాచారం.

జాతీయ మీడియా వివ‌రాల‌ ప్రకారం, ప్రియాంక చోప్రా- కత్రినా కైఫ్- అలియా భట్ ప్రధాన పాత్ర‌ల్లో భారీ అంచనాల చిత్రం 'జీ లే జరా' స్ట‌డీగా ఆలస్యమవుతున్నందున, ఫర్హాన్ అక్తర్ 'డాన్ 3'లో ప్రియాంక చోప్రాను ఎంపిక చేసాడ‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ఒక స‌న్నిహిత సోర్స్ ప్ర‌కారం.. ఫ‌ర్హాన్ అక్తర్ ఇప్పుడు డాన్ 3కి ప్రాధాన్యత ఇస్తున్నారు. 'జీ లే జారా'కు మేల్ తారాగణం ఇంకా వర్కవుట్ కాలేదు. అత‌డు ఈలోగానే ఇప్పుడు రణవీర్ సింగ్ - ప్రియాంక చోప్రాతో డాన్ 3ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్తాడు అని సోర్స్ చెబుతోంది.

రణవీర్ సింగ్ 'డాన్ 3' లో కియారా అద్వానీ లేదా కృతి సనన్ క‌థానాయిక‌గా న‌టిస్తారని గతంలో చాలా ఊహాగానాలు సాగాయి. అయితే తాజా నివేదిక ప్రకారం, ప్రియాంక చోప్రా ఫ్రాంచైజీకి తిరిగి వస్తుంది. షారూఖ్ ఖాన్ డాన్ - డాన్ 2లో ప్రియాంక రోమా పాత్రను అభిమానులు ఎంతగానో మెచ్చుకున్నారు. తెరపై షారూఖ్‌తో ఘాటైన‌ ఆవేశపూరిత ల‌వ్ కెమిస్ట్రీ ఈ సినిమాల విజయానికి దోహదపడింది. షారూఖ్ ఇకపై డాన్‌గా కనిపించనప్పటికీ ప్రియాంక ఫ్రాంచైజీకి తిరిగి వ‌స్తుంది! అంటే అది వారిలో ఉత్సాహం నింపుతుంది.

రణవీర్ - గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా విషయానికొస్తే, ఈ అంద‌మైన జంట‌ బాజీరావ్ మస్తానీ -దిల్ ధడక్నే దో వంటి చిత్రాలలో కలిసి నటించారు. ఈ అంద‌మైన జంట‌ను తిరిగి తెరపై చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడతారు. అయితే ఆన్‌లైన్‌లో ఈ వార్తకు మిశ్రమ స్పందన వస్తోంది. రెడ్డిట్‌లో ఒక వ్యక్తి ఇలా రాశాడు, "ఇది నిజమైతే చాలా బాగుంటుంది. వారి మధ్య మంచి కెమిస్ట్రీ ఉంది'' అని వ్యాఖ్యానించ‌గా, ''జంగ్లీ బిల్లీ తిరిగి వచ్చింది'' అని రాసాడు. ప్రియాంక- రణవీర్ జంట‌ బాగా కనిపిస్తార‌ని ఒక‌రు వ్యాఖ్యానించారు. అయితే, "జంగ్లీ బిల్లి ఒకటే కానీ ప్రధాన డాన్‌ని మార్చారు.. అతడు ప్రేక్షకులకు ఎలా జస్టిఫై చేస్తాడు?" అని ఒకరు వ్యాఖ్యానించారు. ఒక కొత్త నటి 100 శాతం నటించబోతోంది అని ఒక‌రు గెస్ చేయ‌గా, "ఓమ్ ప్లీజ్ కియారా, క్రితి లేదా శోభితా. ఎవ‌రో ఒక‌రు వ‌స్తారు! అని ఒక అభిమాని గెస్ చేసారు. ప్రియాంక చోప్రా న‌టిస్తోంద‌ని మేకర్స్ నుండి ఇంకా ఎటువంటి ధృవీకరణ లేదు.