Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ హౌస్ లోకి గాడిద.. కంటెస్టెంట్స్ షాక్..!

బిగ్ బాస్ హిందీ 18వ సీజన్ అక్టోబర్ 6న మొదలైంది. ఐతే ఈ షోలో కంటెస్టెంట్స్ తో పాటు గాడిదని కూడా హౌస్ లోకి పంపించారు బిగ్ బాస్ టీం.

By:  Tupaki Desk   |   7 Oct 2024 9:30 PM GMT
బిగ్ బాస్ హౌస్ లోకి గాడిద.. కంటెస్టెంట్స్ షాక్..!
X

వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షో నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకుంది. తెలుగులో 8వ సీజన్ ఐదు వారాల క్రితం మొదలై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇక హిందీలో బిగ్ బాస్ ఏకంగా 18వ సీజన్ మొదలైంది. అక్కడ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్నారు. బిగ్ బాస్ హిందీ 18వ సీజన్ అక్టోబర్ 6న మొదలైంది. ఐతే ఈ షోలో కంటెస్టెంట్స్ తో పాటు గాడిదని కూడా హౌస్ లోకి పంపించారు బిగ్ బాస్ టీం.

అదేంటి బిగ్ బాస్ హౌస్ లోకి గాడిద ఎందుకు అనుకుంటున్నారు కదా.. ఇంకేంటి యానిమల్స్ కూడా కంటెస్టెంట్స్ కింద లెక్క వేస్తున్నారా అనుకోవచ్చు. బిగ్ బాస్ సీజన్ 18 లో ఒక కంటెస్టెంట్ తనతో పాటు గాడిదని తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ హిందీ సీజన్ 18 లో ప్రముఖ లాయర్ గుణరత్న సదావర్తే ఒక కంటెస్టెంట్ గా వచ్చాడు. ఆయన తనతో పాటు తన పెట్ డాంకీని తెచ్చుకున్నాడు. తను పెంచుకునే గాడిదని హౌస్ లోకి తీసుకుని వచ్చి షాక్ ఇచ్చాడు.

గుణరత్న పెంపుడు డాంకీ అయిన మాక్స్ ని కూడా బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొచ్చాడు. ఐతే బిగ్ బాస్ దానికి ఎలా ఓకే చెప్పాడు. ఇంతకీ బిగ్ బాస్ ఒప్పుకున్నా కంటెస్టెంట్స్ గాడిదని హౌస్ లో ఉంచేందుకు ఒప్పుకుంటారా లేదా అన్నది చూడాలి. మన దగ్గర ఏమో కానీ బిగ్ బాస్ హిందీలో ఏదైనా చేస్తారు. అందుకే కంటెస్టెంట్ ఏకంగా తనతో గాడిదని హౌస్ లోకి తీసుకొచ్చాడు.

బిగ్ బాస్ కన్నడలో 777 ఛార్లీలో నటించిన చార్లీ అనే కుక్కని ఒక కంటెస్టెంట్ గా తీసుకోవాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. ఇప్పుడు కుక్కకు బదులుగా గాడిద బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చింది. మరి ఆ గాడిద ఎన్నాళ్లు హౌస్ లో ఉంటుంది. దానికి మిగతా హౌస్ మెట్స్ అంగీకారం ఉంటుందా లేదా అన్నది చూడాలి. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విషయానికి వస్తే ఆఇవారం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తో సందడి మొదలైంది. బిగ్ బాస్ సీజన్ 8 రీలోడ్ వైబ్ చాలా బాగుంది.