డోన్ట్ ఆస్క్ డోన్ట్ టెల్... హ్యాపీ రిలేషన్‌షిప్‌కి కొత్త మార్గం
పెళ్లి చేసుకుని పదుల సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకున్న వారు ఉన్నారు.
By: Tupaki Desk | 8 Dec 2024 5:59 AM GMTఈ మధ్య కాలంలో యువత పెళ్లిపై ఆసక్తి చూపించడం లేదు. సహజీవనంకి ఓకే చెబుతూ ఎప్పుడు ఇంట్రస్ట్ తగ్గితే అప్పుడు, ఎప్పుడు గొడవలు అయితే అప్పుడు ఎవరి దారిన వారు వెళ్లి పోతున్నారు. ఈ పాశ్చాత్య సంస్కృతి ఇండియాలోనూ మొదలైనట్లుగా అనిపిస్తుంది. ఈమధ్య కాలంలో లవ్ బ్రేకప్, రిలేషన్‌షిప్ బ్రేకప్ గురించి ప్రముఖంగా చర్చలు జరుగుతున్నాయి. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు చాలా మంది విడిపోతూ ఉన్నారు. పెళ్లి చేసుకుని పదుల సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకున్న వారు ఉన్నారు.
యువత రిలేషన్‌షిప్ సాఫీగా సాగాలంటే DADT పద్దతిని పాటించాలి అంటూ నిపుణులు చెబుతున్నారు. ఈ పద్దతిని పాటించడం ద్వారా ఇద్దరి మధ్య విభేదాలు తక్కువగా వస్తాయనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. DADT అంటే డోన్ట్ ఆస్క్ డోన్ట్ టెల్. చాలా విషయాల గురించి భాగస్వామితో లేదా ప్రియుడు/ప్రేయసితో చెప్పక పోవడం అడగక పోవడం మంచిది అనే అభిప్రాయంను వారు వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా విషయాన్ని పదే పదే అడగడం వల్లే అసలు సమస్య మొదలవుతుంది. ముఖ్యంగా కొన్ని సున్నిత విషయాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.
జీవిత భాగస్వామ్యులు తమ యొక్క శృంగార, భావోద్వేగ జీవితాలను గురించి మాట్లాడుకోవడం ఉత్తమం. కొత్తగా రిలేషన్‌లో అడుగు పెట్టబోతున్న వారు, ఇప్పటికే రిలేషన్‌లో ఉన్న వారు DADT ఈ విషయం గురించి ఆలోచిస్తే బాగుంటుంది. DADT ఫాలో కావడం వల్ల జీవిత భాగస్వామ్యుల మధ్య అసూయ, వివాదాలు, ఒకరిపై ఒకరికి కోపం ఉండదని, మనసులో కొన్ని విషయాలను దాచుకోవడం అనేది కచ్చితంగా అవసరమే. అందుకే జీవిత భాగస్వామితో అన్ని విషయాలను గురించి చర్చించాల్సిన అవసరం లేదు అనేది DADT పద్ధతి యొక్క సారాంశం.
ప్రస్తుతం యువతలో ఉన్న మానసిక పరిస్థితి నేపథ్యంలో చాలా సున్నితంగా ఉన్నారు. అందుకే రిలేషన్‌లో వివాదాలు రాకుండా ఉండాలి అంటే, హ్యాపీగా రిలేషన్‌షిప్ కొనసాగాలి అంటే కచ్చితంగా DADT పద్దతిని అనుసరించాలి అని నిపుణులు చెబుతున్నారు. జీవిత భాగస్వామిని సంతోషంగా చూసుకోవాలి అనుకోవడం ఓకే కానీ, నువ్వు సంతోషంగా ఉన్నావా అని అడగకూడదు, అంతే కాకుండా నీ వల్ల నేను సంతోషంగా లేను అనే విషయాన్ని చెప్పకూడదు. ఇలా కొన్ని విషయాల్లో సర్దుకు పోతేనే హ్యాపీ రిలేషన్‌షిప్ సాఫీగా సాగుతుందని మానసిక నిపుణులు అంటున్నారు.