కపూర్ బ్యూటీని చూసి కన్ప్యూజ్ అవ్వొద్దు!
అక్కడ సోనమ్ నటిగా తిరుగులేని కెరీర సాగిస్తుంటే...నిర్మాతగా రియా కపూర్ ఇప్పుడిప్పుడే స్పీడప్ అవుతుంది.
By: Tupaki Desk | 28 Oct 2023 5:07 AM GMTఅనీల్ కపూర్ వారసురాళ్లుగా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సోనమ్ కపూర్ -రియా కపూర్ జెట్ స్పీడ్ తో దూసు కుపోతున్న సంగతి తెలిసిందే. అక్కడ సోనమ్ నటిగా తిరుగులేని కెరీర సాగిస్తుంటే...నిర్మాతగా రియా కపూర్ ఇప్పుడిప్పుడే స్పీడప్ అవుతుంది. అక్కలా హీరోయిన్ అయి ఉంటే? రూపాయి పెట్టుబడి లేకుండానే డబ్బు సంపాదించేది. కానీ అమ్మడు నిర్మాతగా స్థిరపడాలని భావించడంతో ముందుగా పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది.
ఇప్పటికే రియాకపూర్ నాలుగు సినిమాలు నిర్మించింది. అయితే నిర్మాతగా ఇంకా రియా మార్క్ పడలేదు. సరైన హిట్ అమ్మడి ఖాతాలో పడలేదు. వీర్ ది వెడ్డింగ్ లాంటి సినిమా మంచి లాభాలు తెచ్చి పెట్టింది. దీంతో ఇప్పుడీ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తుంది. నిర్మాణం కోసం భారీగానే ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త కంటెంట్ కంటే హిట్ సినిమాకి సీక్వెల్ అయితేనే ఉత్తమం అని భావించి ఇటీవలే ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించారు.
ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ పనుల్లో రియా కపూర్ బిజీగా ఉంది. మేజర్ షేర్ రియాదే కావడంతో..ప్రాజెక్ట్ కోసం రేయింబవళ్లు శ్రమిస్తుంది. మరి ఇలా నిర్మాత అయినంత మాత్రాన ఫ్యాషన్ వరల్డ్ లో తానెందుకు? యాక్టివ్ గా ఉండకూడదో! ఏమో అనుకుంది గానీ..తాజాగా అమ్మడు న్యూ ఆల్ట్రా మోడ్రన్ బ్యూటీగా నెట్టింట కాక పుట్టిస్తుంది. ఇదిగో ఇక్కడిలా బ్లాక్ అండ్ బ్లాక్ డిజైన్ లో స్టన్ అయ్యేలా చేసింది.
మ్యాచింగ్ తలకి రౌండ్ హ్యాట్ ధరించి రియా హీరోయిన్లకు ఏమాత్రం తక్కువ కాదని ప్రూవ్ చేసింది. నెక్ పై అమ్మడు ధరించిన యాక్సరసీస్ సమ్ థింగ్ స్పెషల్ గా ఫోకస్ అవుతుంది. పెద్ద సైజ్ ముత్యాల లాంటి డిజైన నెక్ ని మరింత అందంగా మలిచింది. ప్రస్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైరల్ గా మారింది. ఇలా ఫ్యాషన్ గా ముస్తాబవ్వడం చూసి నెటి జనులు ఎవరీ బ్యూటీ? సోనమ్ కపూర్ నా? అని కన్ప్యూజన్ కి గురవుతున్నారు.