Begin typing your search above and press return to search.

డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్.. ఏది లీడ్ లో ఉందంటే..

టాలీవుడ్ నుంచి కమర్షియల్ యాక్షన్ చిత్రాలుగా డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ సినిమాలు నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   16 Aug 2024 8:46 AM GMT
డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్.. ఏది లీడ్ లో ఉందంటే..
X

టాలీవుడ్ నుంచి కమర్షియల్ యాక్షన్ చిత్రాలుగా డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ సినిమాలు నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రిలీజ్ కి ముందు ఈ సినిమాలను పబ్లిక్ లోకి పంపించడానికి విపరీతంగా ప్రమోషన్స్ చేశారు. కచ్చితంగా ఈ సినిమాలతో కమర్షియల్ సక్సెస్‌లు అందుకోవాలని కసి ఆయా చిత్ర యూనిట్లలో కనిపించింది. పూరి జగన్నాథ్ ‘లైగర్’ లాంటి డిజాస్టర్ తర్వాత గ్యాప్ తీసుకొని డబుల్ ఇస్మార్ట్ చేశారు. ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకొని బౌన్స్ బ్యాక్ అవ్వాలని ఆయన భావించారు.

రామ్ పోతినేనికి కూడా డబుల్ ఇస్మార్ట్ సక్సెస్ చాలా అవసరం. దీంతో మూవీని గట్టిగా ప్రమోట్ చేశారు. ఆగష్టు 15న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో మంచి గ్రాస్‌ని కలెక్ట్ చేసింది. రామ్, పూరి జగన్నాథ్ ఇమేజ్ పరంగా చూస్తే మొదటి రోజు గ్రాస్ అనేది చాలా తక్కువ కలెక్షన్స్ అని టాక్ వచ్చింది. అయితే ‘లైగర్’ లాంటి డిజాస్టర్ తర్వాత వచ్చిన సినిమా కావడంతో ఈ పర్వాలేదు అనే స్థాయిలోనే కలెక్షన్స్ వచ్చాయనే మాట వినిపిస్తోంది.

ఆగష్టు 15 పబ్లిక్ హాలిడే అయినా అందరూ ఇండిపెండెన్స్ డే మూడ్ లో ఉండడంతో హెవీ కలెక్షన్స్ వచ్చి ఉండవని భావిస్తున్నారు. ఈ నాలుగు రోజులు మంచి వసూళ్లు వస్తాయని చిత్ర యూనిట్ అంచనా వేస్తోంది. మాస్ ఆడియన్స్‌కి మూవీ బాగా కనెక్ట్ అయ్యిందని మేకర్స్ నమ్ముతున్నారు. డబుల్ ఇస్మార్ట్ కి పోటీగా మాస్ మహారాజ్ రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ థియేటర్స్ లోకి వచ్చింది.

ఈ సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో డీసెంట్ కలెక్షన్స్ మాత్రమే కలెక్ట్ చేసింది. రవితేజ లాస్ట్ మూవీ ఈగల్ మొదటి రోజు కలెక్షన్స్‌తో పోల్చుకుంటే, మిస్టర్ బచ్చన్ చాలా తక్కువ వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తోందని, మెల్లగా కలెక్షన్స్ పెరుగుతాయని దర్శకుడు హరీష్ శంకర్ చెబుతున్నారు. మిస్టర్ బచ్చన్ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా చేసేశారు.

మొదటి రోజు కలెక్షన్స్ పరంగా చూసుకుంటే, మిస్టర్ బచ్చన్ కంటే డబుల్ ఇస్మార్ట్ కాస్తా బెటర్‌గా పెర్ఫార్మ్ చేసిందనే మాట వినిపిస్తోంది. అయితే ఈ రెండు సినిమాల లాంగ్ రన్ కలెక్షన్స్ ఎలా ఉంటాయనేది శుక్రవారం, శనివారం వచ్చే ప్రేక్షకాదరణ బట్టి క్లారిటీ వస్తుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ రెండు చిత్రాలకు మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. పబ్లిక్ నుంచి కూడా మిక్స్డ్ టాక్ వస్తోంది. ఈ పరిస్థితిలో సినిమాలు ఎలా ప్రేక్షకులను థియేటర్స్‌కు రప్పిస్తాయనేది ఆసక్తికరంగా మారింది.