Begin typing your search above and press return to search.

డబుల్ ఇస్మార్ట్ బాక్సాఫీస్.. ఇది నెంబర్ వన్ రికార్డ్

ఈ సినిమాపై 50 కోట్ల థీయాట్రికల్ బిజినెస్ జరిగింది. దీంట్లో కనీసం 10 కోట్ల రికవరీ కూడా డబుల్ ఇస్మార్ట్ సాధించలేకపోయిందని టాక్.

By:  Tupaki Desk   |   21 Aug 2024 4:05 AM GMT
డబుల్ ఇస్మార్ట్ బాక్సాఫీస్.. ఇది నెంబర్ వన్ రికార్డ్
X

రామ్ పోతినేని పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన డబుల్ ఇస్మార్ట్ ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని థియేటర్స్ లోకి తీసుకొచ్చారు. సినిమా కోసం చాలా గట్టిగా ప్రమోషన్స్ చేశారు. కచ్చితంగా డబుల్ ఇస్మార్ట్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని పూరి జగన్నాథ్ బౌన్స్ బ్యాక్ అవుతారని అందరూ ఆశించారు. అయితే ఈ సినిమా ఎవ్వరి అంచనాలని అందుకోలేకపోయింది.

పూరి జగన్నాథ్ సినిమాలు ఇష్టపడే ఆడియన్స్ ని సైతం డబుల్ ఇస్మార్ట్ మూవీ నిరాశపరిచింది. మూవీలో సరైన కథ లేకపోతే ఎంత పెద్ద స్టార్ తో సినిమా తీసిన వర్క్ అవుట్ కాదనే విషయం గత కొన్నేళ్లుగా తెలుస్తూనే ఉంది. మరోసారి డబుల్ ఇస్మార్ట్ కూడా దీనిని ప్రూవ్ చేసింది. కేవలం హీరో క్యారెక్టరైజేషన్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలనే పూరి జగన్నాథ్ ప్రయత్నం ఈ సారి విఫలం అయ్యిందనే మాట సినీ విశ్లేషకుల ముంచి వినిపిస్తోంది.

డబుల్ ఇస్మార్ట్ కలెక్షన్స్ మొదటి రోజు ఎక్స్ పెక్ట్ చేసిన స్థాయిలో రాలేదు. సినిమాకి డివైడ్ టాక్ రావడంతో తరువాత ఎక్కడా కోలుకోలేదు. దీంతో ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ మూవీ ఓ అరుదైన రికార్డ్ ని ఖాతాలో వేసుకుంది. మూవీ థీయాట్రికల్ బిజినెస్ లో అతి తక్కువ కలెక్షన్స్ సాధించిన సినిమాగా ఎన్టీఆర్ కథానాయకుడు రికార్డ్ ని డబుల్ ఇస్మార్ట్ బ్రేక్ చేసింది.

ఇప్పటి వరకు కలెక్షన్స్ పరంగా ఎన్టీఆర్ కథానాయకుడు మూవీ 28 శాతం రికవరీతో మొదటి స్థానంలో ఉండేది. అయితే ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ అయితే థీయాట్రికల్ బిజినెస్ పైన కేవలం 22% కలెక్షన్స్ ని మాత్రమే సాధించింది. తద్వారా టాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ చిత్రాల జాబితాలో మొదటి స్థానంలో నిలిచినట్లు అయ్యింది. ఈ సినిమాపై 50 కోట్ల థీయాట్రికల్ బిజినెస్ జరిగింది. దీంట్లో కనీసం 10 కోట్ల రికవరీ కూడా డబుల్ ఇస్మార్ట్ సాధించలేకపోయిందని టాక్.

డబుల్ ఇస్మార్ట్, ఎన్టీఆర్ కథానాయకుడు తర్వాత అతి తక్కువ శాతం రికవరీ రేట్ ఉన్న సినిమాలుగా లైగర్ 31%, భోళా శంకర్ 33%, ఆచార్య 34%, రాధేశ్యామ్ 40% ఉన్నాయి. ఇందులో రెండు మెగాస్టార్ చిరంజీవి సినిమాలు కాగా, ఒకటి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మూవీగా ఉంది. అంటే ఈ లెక్కన కేవలం స్టార్ హీరో ఇమేజ్ అనేది మూవీ ఓపెనింగ్ కలెక్షన్స్ వరకు మాత్రమే పనిచేస్తుంది తప్ప లాంగ్ రన్ వసూళ్లని ప్రభావితం చేయలేదనేది స్పష్టం అవుతోంది.