Begin typing your search above and press return to search.

డబుల్ ఇస్మార్ట్.. రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డీల్స్..

రెండు సాంగ్స్ ఛార్ట్ బస్టర్లుగా నిలిచి ఓ రేంజ్ లో రెస్పాన్స్ అందుకున్నాయి. త్వరలోనే మూడో సింగిల్ ను కూడా రిలీజ్ చేయనున్నారు మేకర్స్

By:  Tupaki Desk   |   26 July 2024 8:12 PM GMT
డబుల్ ఇస్మార్ట్.. రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డీల్స్..
X

యంగ్ హీరో రామ్ పోతినేని, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబోలో ప్రేక్షకుల ముందుకు రానున్న డబుల్ ఇస్మార్ట్ మూవీపై మంచి అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. 2019లో వచ్చి బ్లాక్ బస్టర్ అయిన ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా మరో మ్యాజిక్ చేస్తుందని అంతా ఆశిస్తున్నారు. సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న పూరితో పాటు రామ్ కు అదిరిపోయే రిజల్ట్ అందిస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందుకు తగ్గట్లే ఇప్పటికే వచ్చిన పాటలు అదరగొట్టేశాయి.

రెండు సాంగ్స్ ఛార్ట్ బస్టర్లుగా నిలిచి ఓ రేంజ్ లో రెస్పాన్స్ అందుకున్నాయి. త్వరలోనే మూడో సింగిల్ ను కూడా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఆగస్టు 15వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుందీ సినిమా. దీంతో విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ మేకర్స్.. మరింత స్పీడ్ గా ప్రమోషన్స్ చేపడుతున్నారు. మరికొద్ది రోజుల్లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. అయితే డబుల్ ఇస్మార్ట్ మూవీ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ లు అదిరిపోయే రేంజ్ లో జరిగాయి.

ఇప్పటికే ఈ సినిమా థియేట్రికల్ హక్కులను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ కు చెందిన నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి రూ.60 కోట్లకు దక్కించుకున్నారు. రామ్‌ కెరీర్‌ లోనే ఇది అతిపెద్ద డీల్ అని మేకర్స్ తెలిపారు. తాజాగా నాన్ థియేట్రికల్ రైట్స్ డీల్ కూడా పూర్తయింది. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.30 కోట్లకు డిజిటల్ రైట్స్ కు సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను స్ట్రీమింగ్ చేయనుంది.

థియేట్రికల్ రైట్స్ లాగే డిజిటల్ రైట్స్ కూడా రామ్ కెరీర్ లోనే అత్యధిక ధరకు అమ్ముడయ్యాయి. ఆడియో రైట్స్ రూ.9 కోట్లకు విక్రయించారు మేకర్స్. డబుల్ ఇస్మార్ట్ మూవీ హిందీ వెర్షన్ ఓటీటీ డీల్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. తెలుగు సహా ఇతర భాషల శాటిలైట్ హక్కులు కూడా విక్రయించాల్సి ఉంది. త్వరలోనే అవన్నీ పూర్తి చేయనున్నారు మేకర్స్. ఆ డీల్స్ కూడా మంచి లాభాలతో జరుగుతాయని మూవీ టీమ్ నమ్మకంతో ఉంది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.

ఇక సినిమా విషయానికొస్తే.. రామ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు. షాయాజీ షిండే, బానీ జే, అలీ, గెటప్ శ్రీను, మార్కండ్ దేశ్ పాండే, ఉత్తేజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌ పై పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.