Begin typing your search above and press return to search.

డబుల్ ఇస్మార్ట్.. ఈ సడన్ ట్విస్ట్ ఏంటి?

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతోన్న మూవీ డబుల్ ఇస్మార్ట్

By:  Tupaki Desk   |   18 Jan 2024 4:45 AM GMT
డబుల్ ఇస్మార్ట్.. ఈ సడన్ ట్విస్ట్ ఏంటి?
X

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతోన్న మూవీ డబుల్ ఇస్మార్ట్. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పై పూరి జగన్నాథ్ ఆవిష్కరిస్తున్నారు. చార్మి, పూరి కలిసి నిర్మిస్తున్నారు. ది వారియర్, స్కంద తో రెండు ఫ్లాప్ లు ఖాతాలో వేసుకున్న రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ తో ఎలా అయిన సక్సెస్ కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయ్యి ఉన్నాడు.

అతని కెరియర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ తెరకెక్కుతోంది. పూరి స్టైల్ లో మాస్ యాక్షన్ కమర్షియల్ మూవీగా దీనిని సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 8న రిలీజ్ చేస్తామని పూరి టీమ్ ఎప్పుడో ప్రకటించింది. సినిమా షూటింగ్ స్టార్ట్ చేసినపుడు పూరి జగన్నాథ్ రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ చేశారు.

అయితే ఈ మూవీ షూటింగ్ ఫిబ్రవరి నెలాఖరుకి కంప్లీట్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. పూరి గతంలో చేసిన సినిమాలకి భిన్నంగా డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ కోసం ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు. కచ్చితంగా ప్రూవ్ చేసుకోవాల్సిన మూవీ కావడంతో పక్కా లెక్కలతో డబుల్ ఇస్మార్ట్ ని బ్లాక్ బస్టర్ బొమ్మగా మార్చేందుకు పూరీ జగన్నాథ్ గట్టిగానే కష్టపడుతున్నాడు.

ఈ నేపథ్యంలోనే షూటింగ్ ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. సినిమా షూటింగ్ ఫిబ్రవరి నెలాఖరుని కంప్లీట్ అయితే ఎనిమిది రోజుల్లో రిలీజ్ చేయడం కష్టం అని భావించి డేట్ వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారంట. షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చూసుకుంటూనే సినిమాకి స్ట్రాంగ్ ప్రమోషన్స్ చేయాలి.

అంత టైం దొరకడం కష్టం కష్టం. దానికి తోడు ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు ఒక్క గ్లింప్స్ కూడా పూరీ జగన్నాథ్ రిలీజ్ చేయలేదు. మూవీ జనాల్లోకి వెళ్ళాలంటే టీజర్, సాంగ్స్ , ట్రైలర్ చాలా కీలకం అవుతాయి. ఇవేవీ ఇంకా సిద్ధం చేయలేదు. అందుకే మూవీని రెండు నెలలు వాయిదా వేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.