Begin typing your search above and press return to search.

డబుల్ ఇస్మార్ట్.. ఈ రేటుతో క్లిక్కయ్యేనా?

పెంచిన టికెట్ ధరలతో వీలైనంత వేగంగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవచ్చని నిర్మాతలు, బయ్యర్లు భావిస్తున్నారు

By:  Tupaki Desk   |   14 Aug 2024 1:44 PM GMT
డబుల్ ఇస్మార్ట్.. ఈ రేటుతో క్లిక్కయ్యేనా?
X

ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా అప్పీల్ తో వచ్చే భారీ బడ్జెట్ సినిమాలకి టికెట్ ధరల్ని పెంచుకునే సౌలభ్యం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. సినిమా రేంజ్ బట్టి టికెట్ ధరల్ని 30 నుంచి 150 వరకు పెంచుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. డార్లింగ్ ప్రభాస్ కల్కి 2898ఏడీ సినిమాకి ఏపీ, తెలంగాణాలో మొదటి రెండు వారాలు 100 నుంచి 150 రూపాయిల వరకు టికెట్ ధరల్ని పెంచుకునే ఛాన్స్ ఇచ్చారు.

పెంచిన టికెట్ ధరలతో వీలైనంత వేగంగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవచ్చని నిర్మాతలు, బయ్యర్లు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు రామ్ పోతినేని హీరోగా తెరకెక్కి ఆగష్టు 15న రిలీజ్ కాబోతున్న పాన్ ఇండియా మూవీ డబుల్ ఇస్మార్ట్. ఈ సినిమాకి కూడా ఏపీలో టికెట్ ధరలు పెంచుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ సినిమాని పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ పూరి కనెక్ట్స్ బ్యానర్ పై నిర్మించారు

నిర్మాతల అభ్యర్ధన మేరకు మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ ధరలు 35 రూపాయిల వరకు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చారంట. ఈ టికెట్ ధరల పెంపు డబుల్ ఇస్మార్ట్ చిత్రానికి ఏపీలో కొంత వరకు ప్లస్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఏపీలో ఎక్కువగా బీ,సి సెంటర్లు ఉంటాయి. అక్కడ మాస్ చిత్రాలకి మంచి ఆధారణ లభిస్తూ ఉంటుంది. కమర్షియల్ మాస్ యాక్షన్ చిత్రాలని ఏపీ ప్రేక్షకులు ఇష్టపడతారు.

గతంలో పూరి, రామ్ కలయికలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా కూడా ఏపీలో బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. భారీ లాభాలు అందించింది. దానికి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ మూవీ రాబోతోంది. దీంతో ఎక్స్ పెక్టేషన్స్ కూడా సినిమాపై హైఎండ్ లోనే ఉన్నాయి. పూరి జగన్నాథ్ మార్క్ కూడా ఏపీ ప్రజలకి బాగా ఇష్టం. అందుకే కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇస్మార్ట్ సినిమాకి ప్రేక్షకాదరణ బాగుంటుందని భావిస్తున్నారు. ఒక విధంగా కంటెంట్ బాగుంటే రేట్ల గురించి పెద్దగా ఎవరు పట్టించుకోరు. కానీ యవరేజ్ టాక్ వస్తేనే మొదటికే మోసం వస్తుంది.

ఇప్పటి వరకైతే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, ట్రైలర్ కి పబ్లిక్ నుంచి చూడవచ్చు అనేలా ఒక టాక్ ఉంది. కావ్య థాపర్ గ్లామర్ షో కూడా మూవీకి అదనపు అస్సెట్ అవుతుందని అనుకుంటున్నారు. డబుల్ ఇస్మార్ట్ సినిమాతో సంజయ్ దత్ విలన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. దీంతో భారీ యాక్షన్ సీక్వెన్స్ ని ప్రేక్షకులు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. మరి పెంచిన టికెట్ ధరలతో డబుల్ ఇస్మార్ట్ ఏపీలో ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.