Begin typing your search above and press return to search.

ఇంతకీ నేషనల్ క్రష్ కి ఏ కోస్టార్ మీద 'క్రష్' ఉన్నట్లు?

ఈ సందర్భంగా నేషనల్ క్రష్ కి తన సహ నటుడిపై క్రష్ ఉందనే విషయాన్ని వెల్లడించింది.

By:  Tupaki Desk   |   1 Aug 2024 4:43 PM GMT
ఇంతకీ నేషనల్ క్రష్ కి ఏ కోస్టార్ మీద క్రష్ ఉన్నట్లు?
X

సౌత్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం క్రేజీ ఆఫర్స్ తో దూసుకుపోతోంది. తెలుగుతో పాటుగా తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది. ఇటీవలే ఆహా వేదికగా నిర్వహిస్తున్న తెలుగు ఇండియన్ ఐడిల్ సీజన్-3 కార్యక్రమానికి గెస్టుగా హాజరైంది. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. థమన్, సింగర్స్ గీతా మాధురి, కార్తీక్ జడ్జీలుగా వ్యవహరిస్తుండగా.. సింగర్ శ్రీరామ చంద్ర హోస్టుగా ఉన్నారు. ఈ సందర్భంగా నేషనల్ క్రష్ కి తన సహ నటుడిపై క్రష్ ఉందనే విషయాన్ని వెల్లడించింది.

ఇండియన్ ఐడిల్ ప్రోగ్రామ్ లో ఓ ఫన్నీ సెగ్మెంట్‌లో భాగంగా ''మీ కోస్టార్‌ లేదా కొలీగ్‌ మీద ఎప్పుడైనా క్రష్‌ ఫీలింగ్‌ కలిగిందా?'' అని శ్రీరామ చంద్ర అడిగారు. దీనికి రష్మిక మందన్నా, తమన్ ఇద్దరూ ''ఎస్‌'' అనే సమాధానమిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ మన నేషనల్ క్రష్ కి ఏ కోస్టార్‌ మీద క్రష్ ఉందా? అని ఆరాలు తీస్తున్నారు.

ఇదే కార్యక్రమంలో 'పుష్ప 2' సినిమా గురించి రష్మిక మందన్న మాట్లాడింది. 'పుష్ప: ది రైజ్‌' కంటే 'పుష్ప: ది రూల్' భారీ స్థాయిలో ఉంటుందని చెప్పింది. తన కెరీర్ లో 'పుష్ప' చిత్రంలోని 'శ్రీవల్లి' పాట.. 'డియర్‌ కామ్రేడ్‌'లోని 'కడలల్లే' సాంగ్ తన ఆల్ టైమ్ ఫేవరెట్ అని తెలిపింది. అలానే 'గీత గోవిందం' సినిమాలోని 'తెల్ల తెల్లవారే వెలుగు రేఖల' పాట తనకు ఎంతో స్పెషల్ అని రష్మిక చెప్పుకొచ్చింది.

2016లో కిరిక్ పార్టీ అనే సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన రష్మిక మందన్నా.. తన కోస్టార్ రక్షిత్ శెట్టితో డేటింగ్ చేసింది. 2017లో అతనితో నిశ్చితార్థం కూడా చేసుకుంది. అయితే తెలియని కారణాలతో వారిద్దరూ తమ రిలేషన్ షిప్ కు స్వస్తి పలుకుతూ, 2018లో ఎంగేజ్మెంట్ ను క్వాన్సిల్ చేసుకున్నారు. అప్పటి నుంచీ రష్మిక గురించి అనేక రూమర్స్ వస్తూనే ఉన్నాయి. తనతో కలిసి రెండు సినిమాల్లో నటించిన హీరో విజయ్ దేవరకొండతో ఆమె ప్రేమాయణం సాగిస్తోందంటూ రూమర్స్ వినిపిస్తుంటాయి. కానీ ఈ విషయాన్ని ఎప్పుడూ ధృవీకరించలేదు.

రష్మిక చేతిలో ప్రస్తుతం అర డజను క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అల్లు అర్జున్ తో 'పుష్ప 2', సల్మాన్ ఖాన్ తో 'సికందర్‌', ధనుష్ తో 'కుబేర' సినిమాలు చేస్తోంది. 'రెయిన్‌ బో', 'ది గర్ల్‌ ఫ్రెండ్‌' వంటి ఉమెన్ సెంట్రిక్ చిత్రాల్లోనూ నటిస్తోంది. అలానే లక్ష్మణ్ ఉతేకర్‌ దర్శకత్వంలో విక్కీ కౌశల్ కు జోడీగా 'ఛావా' అనే హిందీ మూవీ చేస్తోంది.