Begin typing your search above and press return to search.

RC16.. జాన్వి రెమ్యూనరేషన్ షాక్..!

ఇక ఇప్పుడు చరణ్ సినిమాకు మరో 2 కోట్లు పెంచి అనగా మొత్తం 8 కోట్ల దాకా ఈ సినిమాకు రెమ్యునరేషన్ గా అందుకుంటుందట.

By:  Tupaki Desk   |   16 May 2024 5:05 AM GMT
RC16.. జాన్వి రెమ్యూనరేషన్ షాక్..!
X

బాలీవుడ్ లో ఆల్రెడీ ఒక రేంజ్ లో దూసుకెళ్తున్న శ్రీదేవి తనయురాలు జాన్వి కపూర్ ఇప్పుడు అదే స్పీడ్ ని సౌత్ లో కూడా కొనసాగించాలని చూస్తుంది. స్టార్ డాటర్ గా సినిమా ఛాన్సులు త్వరగానే రాబట్టుకున్న జాన్వి వచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకుంది. అందుకే ఆమెకు వరుస చాన్సులు వస్తున్నాయి. తనకు ఇచ్చిన పాత్రను పూర్తి స్థాయిలో నాయం చేస్తున్న జాన్వి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అయితే బాలీవుడ్ లో ఎంత చేసినా అక్కడ గ్లామర్ షోకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.

అందుకే అమ్మడు తెలివిగా సౌత్ సినిమాల మీద కన్నేసింది. తల్లి శ్రీదేవి ఇక్కడ స్టార్ క్రేజ్ తెచ్చుకోగా సౌత్ ఆడియన్స్ కు ఆమె ఎప్పటికీ మర్చిపోలేని ఒక జ్ఞాపకంగా మారింది. అందుకే తల్లిని ఆదరించిన సౌత్ సినిమాల్లో కూడా జాన్వి సత్తా చాటాలని చూస్తుంది. దేవర తో టాలీవుడ్ గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న జాన్వి కపూర్ ఆ సినిమాలో తన పాత్రని ఎంజాయ్ చేస్తుందని టాక్. ఎన్.టి.ఆర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ అమ్మడికి బాగా కలిసి వచ్చే అంశమే అని చెప్పొచ్చు.

ఇక మరోపక్క ఆ సినిమా రిలీజ్ అవ్వకుండానే చరణ్ తో జత కడుతుంది జాన్వి కపూర్. చిరంజీవి, శ్రీదేవి జంటకు ఎంత క్రేజ్ ఉందో ఇప్పుడు చరణ్, జాన్వి కలిసి నటిస్తున్న సినిమాకు అంతే ఇంపాక్ట్ కలుగుతుంది. బుచ్చి బాబు డైరెక్షన్ లో చరణ్ హీరోగా చేస్తున్న సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. అయితే ఈ సినిమాలో నటించేందుకు జాన్వి బ్లాస్టింగ్ రెమ్యునరేషన్ అందుకుంటుందని టాక్. బాలీవుడ్ లో ఒక్కో సినిమాకు 4 నుంచి 5 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్న జాన్వి కపూర్ దేవర కోసం 6 కోట్ల దాకా డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది.

ఇక ఇప్పుడు చరణ్ సినిమాకు మరో 2 కోట్లు పెంచి అనగా మొత్తం 8 కోట్ల దాకా ఈ సినిమాకు రెమ్యునరేషన్ గా అందుకుంటుందట. జాన్వి కపూర్ సినిమాలో ఉంటే బాలీవుడ్ లో కూడా మార్కెట్ పెరుగుతుందని ఆమె అడిగినంత ఇచ్చేస్తున్నారట మేకర్స్. మొత్తానికి జాన్వి కపూర్ సౌత్ లో కూడా తన ఫాం కొనసాగిస్తుంది. దేవర అంచనాలను అందుకుంటే మాత్రం జాన్వి ని ఆపడం ఎవరి వల్లా కాదని చెప్పొచ్చు.