నాగార్జున ఫిట్ నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా?
కానీ టాలీవుడ్ మన్మథుడు నాగార్జున 64 ఏళ్లు వచ్చినా కుర్రాడిలానే కనిపిస్తున్నాడు.
By: Tupaki Desk | 14 Jan 2024 9:01 AM GMTటాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జున క్రేజ్ గురించి తెలిసిందే. అరవైల లోనూ ఇరవై ఏళ్ళ కుర్రాడి గానే కనిపిస్తూ నవమన్మధుడు అనిపించుకుంటున్నాడు. ఆయన తోటి హీరోలు 50 ఏళ్లు రాకముందే అందాన్ని కోల్పోయారు. ముఖంపై ముడతలు పడటంతో పాటూ హీరో లుక్ లోనే కనిపించడం లేదు. కానీ టాలీవుడ్ మన్మథుడు నాగార్జున 64 ఏళ్లు వచ్చినా కుర్రాడిలానే కనిపిస్తున్నాడు.
ఈ ఏజ్ లోనూ ఆయన అంత యంగ్ గా కనిపించడానికి ఆయన గ్లామర్ తో పాటు ఫిట్నెస్ సీక్రెట్ గురించి తెలుసుకునేందుకు అభిమానులే కాదు ఆడియన్స్ సైతం ఆసక్తి చూపుతుంటారు. ఈ క్రమంలోనే తాజాగా 'నా సామిరంగ' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో తన ఫిట్నెస్ గ్లామర్ సీక్రెట్ రివీల్ చేశాడు. తాజా ఇంటర్వ్యూలో నాగార్జునతో పాటూ సంగీత దర్శకుడు, ఎంఎం కీరవాణి గేయ రచయిత చంద్రబోస్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కీరవాణి నాగార్జున ని మీరు డైట్ మెయింటెన్ చేస్తారా? మీ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి? అని అడిగితే..
" నేను ఎలాంటి డైట్ మెయింటైన్ చేయనని, ఏం తినాలనిపిస్తుందో అన్ని కడుపునిండా తింటానని, డిన్నర్ మాత్రం ఏడు గంటలకు చేస్తానని అన్నారు. బ్రేక్ ఫాస్ట్ లో వైట్ ఎగ్స్ తో పాటూ బ్రెడ్ కూడా తీసుకుంటానని, డిన్నర్ లో చికెన్ తో పాటూ నచ్చివన్నీ తింటానని చెప్పారు. అంతేకాకుండా ఎంత తిన్నా కూడా జిమ్ చేసి కరిగించుకోవడం వల్లే ఫిట్ గా ఉన్నానని తెలిపారు. ఇక రోజు రాత్రి పడుకునే ముందు కచ్చితంగా స్వీట్ తినే పడుకుంటానని, స్వీట్ తినకపోతే తనకు నిద్ర కూడా పట్టదని చెప్పుకొచ్చారు.
ఎలాంటి డైట్ మైంటైన్ చేయకుండా తినాలనిపించింది కడుపునిండా తిని, ఉదయం లేవగానే వర్కౌట్స్ చేస్తే మనం తిన్న ఫుడ్ అంతా క్యాలరీస్ రూపంలో కరిగిపోయి మంచి ఫిట్ గా ఉంటామని నాగార్జున తన ఫిట్నెస్ సీక్రెట్ గురించి రివీల్ చేశారు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.
ఇక 'నా సామిరంగ' విషయానికొస్తే.. ఈరోజు థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాని నిర్మించారు.