Begin typing your search above and press return to search.

మంచి ఫామ్ లో ఉన్న టైమ్ లో పెద్ద దెబ్బ

41 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయిన ఈ చిత్రం లాంగ్ రన్ లో కేవలం 16.75 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది.

By:  Tupaki Desk   |   16 Sep 2023 3:54 AM GMT
మంచి ఫామ్ లో ఉన్న టైమ్ లో పెద్ద దెబ్బ
X

సౌత్ ఇండియా నుంచి మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ భాషలతో సంబంధం లేకుండా పాన్ ఇండియా హీరోగా ఎదుగుతున్నాడు. అన్ని భాషలలో దర్శక, నిర్మాతలు దుల్కర్ తో సినిమాలు చేయడం కోసం ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగులో మహానటి తర్వాత సీతారామం సినిమాతో దుల్కర్ సల్మాన్ సోలోగా సూపర్ హిట్ కొట్టాడు. ఈ సినిమాలో అతని నటనకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు సితారా ఎంటర్టైన్మెంట్స్ లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ కొత్త సినిమాకి దుల్కర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఇదిలా ఉంటే రీసెంట్ గా దుల్కర్ సల్మాన్ నుంచి మలయాళంలో పాన్ ఇండియా మూవీగా కింగ్ ఆఫ్ కొత్త ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ చిత్రాన్ని దుల్కర్ తన సొంతం ప్రొడక్షన్ లో భారీ బడ్జెట్ తో నిర్మించారు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా మొదటి ఆటకే డివైడ్ టాక్ వచ్చేసింది. తరువాత కూడా అస్సలు కోలుకోలేదు. దుల్కర్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా ఈ చిత్రం నిలిచింది.

41 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయిన ఈ చిత్రం లాంగ్ రన్ లో కేవలం 16.75 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది. దీంతో 24.25 కోట్ల నష్టంతో ముగిసింది. మలయాళం ఇండస్ట్రీలో ఈ స్థాయిలో నష్టం అంటే బిగ్గెస్ట్ డిజాస్టర్ అని చెప్పాలి. కేరళలో ఈ సినిమా 15.35 కోట్ల గ్రాస్ ని లాంగ్ రన్ లో కలెక్ట్ చేసింది. తరువాత అత్యధికంగా తెలుగులో 2.45 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకుంది.

అయితే తెలుగులో 5.5 కోట్ల వరకు ఈ సినిమాపై బిజినెస్ జరిగింది. 4.3 కోట్ల నష్టంతో డిజాస్టర్ జాబితాలోకి వెళ్ళిపోయింది. ఓవరాల్ గా తెలుగులో 1.2 కోట్ల షేర్ మాత్రమే ఈ సినిమా రాబట్టింది. మలయాళం తర్వాత దుల్కర్ కి తెలుగులో పెద్ద మార్కెట్ ఉంది. అయిన కూడా కింగ్ ఆఫ్ కొత్త బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యింది.

ఓవరాల్ గా మూవీకి వచ్చిన కలెక్షన్స్ చూసుకుంటే తెలుగు రాష్ట్రాలలో 2.45 కోట్లు, తమిళనాడులో 1.95 కోట్లు, కర్ణాటకలో 1.05 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 0.60 కోట్లు, ఓవర్సీస్ లో 15.80 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి,. కేరళలో 15.35 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఓవరాల్ గా 37.20 కోట్ల గ్రాస్ ని లాంగ్ రన్ లో ఈ చిత్రం కలెక్ట్ చేయడం విశేషం. దుల్కర్ సల్మాన్ కి ఉన్న ఇమేజ్ ని కింగ్ ఆఫ్ కొత్త కొంత వరకు డ్యామేజ్ చేసిందని ఈ కలెక్షన్స్ బట్టి చెప్పొచ్చు.